Krishna Kowshik
భార్యా భర్తల మధ్య జరిగే ఫన్ అండ్ ప్రస్టేషన్ ను ఓటీటీ తెరపై చూపించిన వెబ్ సిరీస్.. సేవ్ ది టైగర్స్. ఇప్పుడు దీనికి సీక్వెల్ రాబోతుంది. ఈ సిరీస్ ట్రైలర్ విడుదల అయ్యింది. ఎలా ఉందంటే..?
భార్యా భర్తల మధ్య జరిగే ఫన్ అండ్ ప్రస్టేషన్ ను ఓటీటీ తెరపై చూపించిన వెబ్ సిరీస్.. సేవ్ ది టైగర్స్. ఇప్పుడు దీనికి సీక్వెల్ రాబోతుంది. ఈ సిరీస్ ట్రైలర్ విడుదల అయ్యింది. ఎలా ఉందంటే..?
Krishna Kowshik
థియేటర్ల కన్నా ఓటీటీలకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. దీంతో దర్శక నిర్మాతలు సరికొత్త కథలను సినిమాలు, సిరీస్‌లుగా ప్రేక్షకులకు అందిస్తున్నారు. వీటికి అశేషమైన ఆదరణ లభించడంతో వాటికి కూడా సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల అలా సందడి చేసిన వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’. ముగ్గురు భార్యా బాధితుల కథే ఇది. పురుషులు ఈ వెబ్ సిరీస్‌కు ఫిదా అయిపోయారు. కడుపుబ్బా నవ్వించిన ఈ సిరీస్‌లో చైతన్య కృష్ణ, ప్రియదర్శి, అభినవ్ గోమఠం, దేవయాని శర్మ , పావని గంగిరెడ్డి, జోర్దార్ సుజాత, రోషిణి, వేణు ఎల్డండి కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్‌కు మహి వి రాఘవ, చిన్నా వాసుదేవ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు.
కాగా, గతంలో దీనికి సీక్వెల్ రాబోతుందంటూ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రకటించింది. ఇప్పుడు వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల అయ్యింది. తొలి సీజన్‌కు కొనసాగింపుగా.. ఈ కథ కూడా నడవనుంది. ఇప్పుడు కూడా ఫన్ అండ్ ప్రస్టేషన్ మేళవింపు కనిపిస్తోంది. ముగ్గురు హీరోలను లాకప్‌లో పెట్టి పోలీసులు ఇంటరాగేషన్ చేస్తున్న సీనుతో స్టార్ట్ అయ్యింది ట్రైలర్. ‘ఇప్పుడు చెప్పండిరా హంసలేఖ ఏడా’అంటూ పోలీసాఫీసర్ ప్రశ్నించగా..స్టోరీ ప్లాష్ బ్యాక్ చేరుకుంటుంది. తొలి సీజన్‌తో పోల్చుకుంటే.. మోర్ ఫన్ కనిపిస్తుంది. ఇందులో మరిన్ని క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి. సీరత్ కపూర్ ఇందులో కీలక పాత్రలో కనిపించనుంది. ఇక ఆడోళ్ల డామినేషన్ కంట్రోల్ లో పెట్టేది ఏదైనా కనిపెట్టాలన్న ప్రియదర్శి అనగానే..దెబ్బకు సిస్టమ్ మారిపోవాలని చైతన్య చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ముగిసింది. చివరిలో ఈ ముగ్గురు అడవి మనుషుల్లా కనిపించడం నవ్వు తెప్పిస్తుంది.
ఇక తొలి సిరీస్‌లో విక్రమ్, రాహుల్, గంటా రవి మిత్రులు..భార్యా బాధితులు ఎందుకు అయ్యారు. వీరి కాపురాల్లో ఎలాంటి సమస్యలు వచ్చాయి. వీరి నిజ స్వరూపాలు భార్యలకు ఎలా తెలిశాయి అనేది తొలి కథలో కనిపిస్తుంది.అభినవ్, రోషిణి మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు పొట్టచెక్కలయ్యేలా ఉంటాయి. ఇక ఈ వెబ్ సిరీస్‌కు దర్శకుడు.. తేజ కాకుమాను. రెండవ సీజన్‌కు దర్శకుడు మారారు. అరుణ్ కొత్తపల్లి సేవ్ ద టైగర్స్ 2కు మెగా ఫోన్ పట్టాడు. మహి వి రాఘవ్, ప్రదీప్ అద్వైతమ్ క్రియేటర్స్‌గా ఉన్నారు. అజయ్ అరసాడ మ్యూజిక్ అందించారు. ట్రైలర్ చూస్తుంటే.. తొలి సిరీస్ కన్నా మించిపోయే కామెడీ కంటెంట్ కనిపిస్తోంది. ఇక సేవ్ ద టైగర్స్ 2 సీజన్‌ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో మార్చి 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది.