Swetha
Game Changer : శంకర్ తన సినిమాలతో ఎదో ఒక బలమైన సందేశాన్ని ఇవ్వాలని చూస్తూ ఉంటాడు. అది కూడా కమర్షియల్ మూవీ ఫార్మేట్ లో చెప్పడంలో శంకర్ స్పెషలిస్ట్. హీరో ఎవరైనా సరే సేమ్ ఫార్ములా ఫాలో అవుతూ ఉంటాడు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ విషయంలో కూడా శంకర్ ఇదే అనుసరిస్తున్నట్లు తెలుస్తుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ సోషల్ మీడియాలో గట్టిగ సౌండ్ చేస్తుంది.
Game Changer : శంకర్ తన సినిమాలతో ఎదో ఒక బలమైన సందేశాన్ని ఇవ్వాలని చూస్తూ ఉంటాడు. అది కూడా కమర్షియల్ మూవీ ఫార్మేట్ లో చెప్పడంలో శంకర్ స్పెషలిస్ట్. హీరో ఎవరైనా సరే సేమ్ ఫార్ములా ఫాలో అవుతూ ఉంటాడు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ విషయంలో కూడా శంకర్ ఇదే అనుసరిస్తున్నట్లు తెలుస్తుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ సోషల్ మీడియాలో గట్టిగ సౌండ్ చేస్తుంది.
Swetha
ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్స్ లో శంకర్ కు స్పెషల్ ప్లేస్ ఉంది. తన సినిమాలతో ఎదో ఒక బలమైన సందేశాన్ని ఇవ్వాలని చూస్తూ ఉంటాడు శంకర్. అది కూడా కమర్షియల్ మూవీ ఫార్మేట్ లో చెప్పడంలో శంకర్ స్పెషలిస్ట్. హీరో ఎవరైనా సరే సేమ్ ఫార్ములా ఫాలో అవుతూ ఉంటాడు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ విషయంలో కూడా శంకర్ ఇదే అనుసరిస్తున్నట్లు తెలుస్తుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ సోషల్ మీడియాలో గట్టిగ సౌండ్ చేస్తుంది. ముఖ్యంగా మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఎక్కడా మాస్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా.. పొలిటికల్ యాక్షన్ మూవీని తీస్తున్నట్లుగా టీజర్ తో క్లారిటీ వచ్చేసింది. నార్మల్ గా శంకర్ సినిమాలలో హీరోలు సమాజం పట్ల అవగాహనతో , బాధ్యతగా ఉంటారు. గేమ్ ఛేంజర్ లోను అదే కనిపిస్తుంది. కానీ రామ్ నందన్ క్యారెక్టర్ మాత్రం అన్ ప్రెడిక్టబుల్ గా తీర్చిదిద్దాడు శంకర్.
రామ్ మంచోడే కానీ కోపం వస్తే చెడ్డోడిగా మారిపోతాడంటూ హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో శాంపిల్ చూపించారు. హీరోకి కోపం కాస్త ఎక్కువే అనే విషయాన్నీ డైలాగ్స్ తో చూపించేసారు. దీనితో సినిమాపై ఇంకాస్త ఆసక్తి పెరిగింది. అలాగే చరణ్ కు కోపం , యాంగర్ మేనేజ్మెంట్ ను జత చేసినట్లు టీజర్ లో హింట్ ఇచ్చారు. అలాగే ఒక సీన్ లో చరణ్ లైబ్రెరీలో కూర్చుని ’30 రోజుల్లో కోపం తగ్గించుకోవడం ఎలా?’ అనే ఓ బుక్ ను చదువుతూ కనిపిస్తాడు. ఇంకో సీన్ లో కోపాన్ని తగ్గించుకోవడానికి రీజన్ రాసి.. ఈ విధంగా ట్రీట్ చేయండి అంటూ.. పేపర్స్ చించేస్తూ కనిపిస్తాడు. ఒకవేళ రామ్ నందన్ కోపిష్టి అయితే.. అలాంటి వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ ఎలా అయ్యాడు? అన్ ప్రిడిక్టబుల్ నేచర్ తో పొలిటిక్స్ ను ఎలా రూల్ చేశాడు? ఇలాంటివన్నీ ఇప్పుడు ప్రేక్షకులు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. మరో వైపు అప్పన్న క్యారెక్టర్ కు కూడా బాగా ఎలివేషన్స్ ఇచ్చారు. అసలు కథ ఎలా ముందుకు వెళ్లబోతుందనేదే ఇప్పుడు అందరి ప్రశ్న. కొద్దీ రోజుల తర్వాత ట్రైలర్ రిలీజ్ చేస్తారు. అప్పుడే సినిమాపై ఇంకాస్త క్లారిటి వచ్చే అవకాశం ఉంది.
ఆల్రెడీ యాంగర్ మేనేజ్మెంట్ మీద ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. రీసెంట్ గా సరిపోదా శనివారం మూవీలో నాని క్యారెక్టర్ కూడా ఇదే. ఇప్పుడు గేమ్ చెంజర్ లోను హీరోకు విపరీతమైన కోపం ఉంటుందని టీజర్ లో చూపించారు. మరి దానికి శంకర్ స్క్రీన్ ప్లే జోడిస్తే ఔట్ పుట్ ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంది. ఇప్పటివరకు అయితే టీజర్ తో గేమ్ ఛేంజర్ మీద ఉండే అనుమానాలు తుడిపెట్టేసాడు శంకర్. అంచనాలు కూడా పెరుగుతూ పోతున్నాయి. మొత్తానికి సినిమాలో ఎదో ఇంట్రెస్టింగ్ ప్లాట్ ఉండేలా అనిపిస్తుంది . ప్రమోషనల్ ప్లాన్స్ విషయంలో కూడ శంకర్ పక్కా స్కెచ్ రెడీ చేస్తున్నాడు. ఒక్కసారి పుష్ప హడావిడి తగ్గితే ఇక గేమ్ ఛేంజర్ రంగంలోకి దిగుతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో పుష్ప 2 , గేమ్ ఛేంజర్ పోటా పోటీగా వైరల్ అవుతున్నాయి. ఇకపై వచ్చే అప్డేట్స్ తో ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.