Movie: ఊరు పేరు భైరవకోనకి, ఆ సినిమాకి పోలిక లేదంటున్న సందీప్ కిషన్

తాజాగా హీరో సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ నటిస్తున్న చిత్రం ఊరు పేరు భైరవకోన. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు అలరించడానికి సిద్ధంగా ఉంది. అయితే తాజాగా బైరవకోన సినిమాను ఏకంగా ఆ సినిమాతో పోల్చడం మొదలుపెట్టారు. ఇంతకి ఆ సినిమా ఏదంటే..

తాజాగా హీరో సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ నటిస్తున్న చిత్రం ఊరు పేరు భైరవకోన. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు అలరించడానికి సిద్ధంగా ఉంది. అయితే తాజాగా బైరవకోన సినిమాను ఏకంగా ఆ సినిమాతో పోల్చడం మొదలుపెట్టారు. ఇంతకి ఆ సినిమా ఏదంటే..

సందీప్ కిషన్ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఊరు పేరు భైరవకోన చిత్రం ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే అదే సమయంలో చాలా మంది ఊరు పేరు భైరవకోన సాయి ధరమ్ తేజ్ విరూపాక్షతో పోల్చడం మొదలుపెట్టారు. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో సందీప్ కిషన్ ను ప్రశ్నించగా.. “నిజం చెప్పాలంటే, నేను మొదట విరూపాక్ష కథను విన్నాను, కానీ నేను మరొక ప్రాజెక్ట్ చేయడంలో బిజీగా ఉన్నాను అందువల్లే ఆ సినిమాని వదులుకోవాల్సి వచ్చింది.

నాకు ఈ జానర్ అంటే చాలా ఇష్టం, మేము చాలా కాలం క్రితమే ఊరు పేరు భైరవకోనను ప్రారంభించాము. కథల పరంగా చూస్తే విరూపాక్ష, ఊరు పేరు భైరవకోన వేరు. విజువల్స్, సౌండ్ డిజైన్ వంటి కొన్ని అంశాలు ఒకేలా అనిపించవచ్చు, కానీ ఇందులో తప్పు లేదు. సందీప్ కిషన్ మాట్లాడుతూ “రెండు సినిమాల్లో హీరో క్యారెక్టర్, కథ, మెయిన్ పాయింట్ పూర్తిగా డిఫరెంట్ గా ఉంటాయి. బహుశా ఈ శైలిలో సినిమాలు తక్కువ కావడం వల్ల, ప్రేక్షకులకి విరూపాక్ష సినిమా కనెక్ట్ అయ్యారు కావచ్చు. కొన్ని రోజుల క్రితం ఊరు పేరు భైరవకోన హనుమాన్ సినిమా తరహాలో ఉంటుందా అని ఎవరో అడిగారు. నాకు ఏం సమాధానం చెప్పాలో తోచలేదు. ఇది అంతగా అన్వేషించబడని జానర్ కానందున పోలికలు అనివార్యమవుతాయి.”

ఊరు పేరు భైరవకోన సినిమాలో హర్ష చెముడు, రాజశేఖర్ అనింగి, వెన్నెల కిషోర్, కుషి రవి కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 16, 2024న విడుదల కానున్న ఈ చిత్రం ఎకె ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్‌ పై రాజేష్ దండా గారు నిర్మించారు. ఈ సినిమాకి శేఖర్ చంద్ర సంగీతాన్ని అందించారు.

Show comments