Salaar Ticket Booking: బుక్ మై షోలో సలార్‌ తెలుగు టికెట్స్ ఓపెన్‌ అయ్యేది ఎప్పుడంటే?

Salaar Telugu Ticket Booking Date & Time: సలార్‌ ప్రీ బుకింగ్స్‌ విషయంలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. ఓవర్‌సీస్‌లో నిజంగానే డైనోసార్‌లా ప్రీ బుకింగ్స్‌ రాబడుతున్నాడు. ఇండియాలోనూ పలు చోట్ల బుక్‌మై షోలో ప్రీ బుకింగ్స్‌ మొదలయ్యాయి.

Salaar Telugu Ticket Booking Date & Time: సలార్‌ ప్రీ బుకింగ్స్‌ విషయంలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. ఓవర్‌సీస్‌లో నిజంగానే డైనోసార్‌లా ప్రీ బుకింగ్స్‌ రాబడుతున్నాడు. ఇండియాలోనూ పలు చోట్ల బుక్‌మై షోలో ప్రీ బుకింగ్స్‌ మొదలయ్యాయి.

సలార్‌ విడుదలకు కేవలం ఐదు రోజులు మాత్రమే ఉంది. ప్రభాస్‌ ఫ్యాన్స్‌  సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా? అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్‌ బుకింగ్స్‌ మొదలయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రీ బుకింగ్స్‌ విషయంలో సలార్‌ రికార్డులు క్రియేట్‌ చేస్తున్నాడు. ముఖ్యంగా ఓవర్‌సీస్‌ లో తన సత్తా చాటుతున్నాడు. పాత రికార్డులను తుడిచి పెట్టేస్తున్నాడు. ఇప్పటికే ఓవర్‌సీస్‌ లో 1 మిలియన్‌  అడ్వాన్స్‌ బుకింగ్స్‌ జరిగినట్లు సమాచారం.

ఇక, ఇండియా విషయానికి వస్తే.. బెంగళూరు, ముంబై లాంటి నగరాలకు సంబంధించి బుక్‌ మై షోలో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ మూడు రోజుల క్రితమే మొదలయ్యాయి. ఇండియాలో కూడా ప్రీ బుకింగ్స్‌ విషయంలో సలార్‌ దూసుకుపోతోంది. అయితే, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బుక్‌ మై షోలో  ప్రీ బుకింగ్స్‌ ఓపెన్‌ అవ్వలేదు. సలార్‌ నిర్మాతలు 16వ తేదీ నుంచే అన్ని భాషలకు సంబంధించిన ప్రీ బుకింగ్స్‌ మొదలవుతాయని ప్రకటించారు. అయితే, అలా జరగలేదు. మిగిలిన భాషలకు సంబంధించి ప్రీ బుకింగ్స్‌ మొదలైనా.. తెలుగుకు సంబంధించి బుక్‌ మై షోలో ఆప్షన్ చూపించటం లేదు.

ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎదురు చూపులు రోజులు గడుస్తున్నా.. ఎదురుచూపుల్లానే మిగిలిపోతున్నాయి. ఇంతకీ తెలుగుకు సంబంధించి బుక్‌ మై షోలో బుకింగ్స్‌ ఎందుకు ఓపెన్‌ అవ్వలేదంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సలార్‌ టికెట్‌ ధరలు పెంచాలంటూ నిర్మాతలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తి పెండింగ్ లో పడింది. టికెట్‌ ధర పెంపుకు సంబంధించి ఇంకా జీవో విడుదల కాలేదు. జీవో విడుదల అయిన తర్వాత పెరిగిన ధరలతో టికెట్లు అమ్ముకునే అవకాశం ఉంటుంది.

నిర్మాతలు జీవో కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. జీవో విడుదల కాగానే.. బుక్‌ మై షోలో ప్రీ బుకింగ్స్‌ ఓపెన్‌ అవుతాయి. అది కూడా పెరిగిన ధరలతో టికెట్లు అందుబాటులో ఉంటాయి.  ఒకవేళ ప్రభుత్వం 100 రూపాయలు పెంచుకునేందుకు అవకాశం ఇస్తే.. మల్టీప్లెక్స్‌ లలో సలార్‌ టికెట్‌ ధర దాదాపు 400 రూపాయలు ఉండే అవకాశం ఉంది. ఇక, సింగిల్‌ స్క్రీన్‌లలో టికెట్‌ ధర 275 రూపాయల నుంచి 300 వరకు ఉండే అవకాశం ఉంది.  సోమవారం కానీ, మంగళవారం కానీ, దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

కాగా, విడుదలకు కేవలం 5 రోజులు ఉన్న నేపథ్యంలో సలార్‌ టీం సెకండ్ ట్రైలర్‌ ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. నిన్ననే ట్రైలర్‌ 2 విడుదల కావాల్సి ఉంది. కానీ సాంకేతిక సమస్యల కారణంగా ట్రైలర్‌ వాయిదా పడింది. ఈ రోజు 10.42 నిమిషాలకు ట్రైలర్‌ విడుదల కావాల్సింది. ఇప్పుడు కూడా సాంకేతిక కారణాల వల్ల మళ్లీ వాయిదా పడింది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ట్రైలర్‌ విడుదల చేస్తామని సినిమా టీం ప్రకటించింది. మరి, తెలుగు రాష్ట్రాల్లో సలార్‌ బుక్‌ మై షోలో సలార్‌ ప్రీ బుకింగ్స్‌ ఓపెనింగ్స్‌ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments