మెగా సుప్రీమ్ హీరో సాయి తేజ్‌ గొప్ప మనసు! పావలా శ్యామలకు లక్ష సాయం!

మెగా సుప్రీమ్ హీరో సాయి తేజ్‌ గొప్ప మనసు! పావలా శ్యామలకు లక్ష సాయం!

Sai Dharam Tej, Pavala Shyamala: సుప్రీమ్‌ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ తన గొప్ప మనసు చాటుకుంటూ.. సీనియర్‌ నటి పావలా శ్యామలకు ఆర్థిక సాయం అందించారు. ఆ సమయంలో శ్యామల తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Sai Dharam Tej, Pavala Shyamala: సుప్రీమ్‌ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ తన గొప్ప మనసు చాటుకుంటూ.. సీనియర్‌ నటి పావలా శ్యామలకు ఆర్థిక సాయం అందించారు. ఆ సమయంలో శ్యామల తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

సినిమాల్లోనే కాదు.. రియల్‌ లైఫ్‌లో కూడా సుప్రీమ్‌ హీరో అనిపించుకున్నారు సాయి ధరమ్‌ తేజ్‌. కష్టాలు చూసి చలిచిపోయే పాత్రల్లో నటించడమే కాదు.. నిజజీవితంలో కూడా తాను నిజంగా అలాంటి మనసున్న మనిషినేనని నిరూపించుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సీనియర్‌ నటి పావలా శ్యామలకు సుప్రీమ్‌ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ఆర్థిక సాయం ఆందించి.. గొప్ప మనసు చాటుకున్నారు.  ఫిల్మ్‌ జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌కు సాయి ధరమ్‌ తేజ్‌ రూ.5 లక్షలు డోనేట్‌ చేశారు.

ఆ రూ.5 లక్షల నుంచి ఒక లక్ష రూపాయాలను సీనియర్‌ నటి పావలా శ్యామలకు అందజేయాల్సిందిగా ఫిల్మ్‌ జర్నలిస్టులకు సూచించారు. సుప్రీమ్‌ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ఆదేశాల మేరకు కొంతమంది ఫిల్మ్‌ జర్నలిస్టులు.. రూ.లక్షను పావలా శ్యామలకు శుక్రవారం అందజేశారు. సాయి తేజ్‌ బిజీ షెడ్యూల్‌ వల్ల ఇక్కడికి రాలేకపోయారని, గతంలో మీకు ఇచ్చిన మాట ప్రకారం.. ఈ నగదు పంపించారంటూ ఫిల్మ్‌ జర్నలిస్టులు ఆమెకు తెలిపారు. అయితే.. ఆర్థిక సాయం అందుకుంటూ శ్యామల ఎమోషనల్‌ అయ్యాడు.

తనకు ఆర్థికసాయం అందించిన హీరో సాయి ధరమ్‌ తేజ్‌తో వీడియో కాల్‌లో మాట్లాడుతూ.. ‘మీకు యాక్సిడెంట్‌ కాకముందు మాకు.. మమ్మల్ని ఆదుకుంటాం అని మాట ఇచ్చారని, ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకుని, తమకు మరికొన్నాళ్లు బతికే అవకాశం ఇచ్చారు. అందుకు చాలా చాలా థ్యాంక్స్‌ సాయి తేజ్‌ గారు. మీకు యాక్సిడెంట్‌ అయిన సమయంలో మీ ఆరోగ్యం కోసం దేవుడ్ని ఎంతో ప్రార్థించాం. గతంలో చిరంజీవి గారు కూడా సాయం చేశారు. ఇప్పుడు మీరు కూడా ఆదుకున్నారు..’ అని బోరున విలపించారు. ‘ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను అంతే అమ్మ.. మీరు బాగుండాలి’ అంటూ సాయి తేజ్‌, శ్యామలను ఓదార్చే ప్రయత్నం చేశారు. మరి పావలా శ్యామలకు సాయి తేజ్‌ ఆర్థిక సాయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments