Somesekhar
రియల్ ఐరన్ మ్యాన్ సూట్ ను తయ్యారుచేశాడు రష్యన్ యూట్యూబర్, ఇంజినీర్ అలెక్స్ బుర్కాన్. దాంతో ప్రయోగం కూడా చేశాడు. ప్రస్తుతం ఈ న్యూస్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది.
రియల్ ఐరన్ మ్యాన్ సూట్ ను తయ్యారుచేశాడు రష్యన్ యూట్యూబర్, ఇంజినీర్ అలెక్స్ బుర్కాన్. దాంతో ప్రయోగం కూడా చేశాడు. ప్రస్తుతం ఈ న్యూస్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది.
Somesekhar
‘ఐరన్ మ్యాన్’.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. హాలీవుడ్ నటుడు రబర్ట్ డౌనీ జూనియర్ నటించిన ఈ సినిమా విడుదలై ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో మనందరికి తెలిసిందే. ఇక ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ కు వరల్డ్ వైడ్ గా ఎంతో క్రేజ్ ఏర్పడింది. దీంతో చాలా మంది రకరకాల ఐరన్ మ్యాన్ సూట్ ను రూపొందించారు. వీటన్నింటినీ తలదన్నేలా రియల్ ఐరన్ మ్యాన్ సూట్ ను తయ్యారుచేశాడు రష్యన్ యూట్యూబర్, ఇంజినీర్ అలెక్స్ బుర్కాన్. దాంతో ప్రయోగం కూడా చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
రియల్ ఐరన్ మ్యాన్ సూట్ ను సృష్టించాడు రష్యన్ యూట్యూబర్, ఇంజినీర్ అలెక్స్ బుర్కాన్. ఇదివరకే ఇతరులు రూపొందించిన ఆషామాషీ సూట్ కాదిది. సెల్ఫ్ పవర్డ్ హైడ్రోజన్ రియాక్టర్, రిపల్సర్ అప్ గ్రేడ్, బుల్లెట్ ఫ్రూప్ ఆర్మర్ వంటి హై టెక్నాలజీని ఇందులో వాడాడు. అత్యంత సంక్లిష్టమైన డిజైన్ తో దీన్ని బుర్కాన్ తయ్యారుచేశాడు. సినిమాలో చూపించిన విధంగానే అచ్చం అలాగే ఈ సూట్ ను సిద్దం చేశాడు.
‘రియల్ లైఫ్ ఐరన్ మ్యాన్ సూట్ విత్ ఏ రిపల్సర్ బ్లాస్ట్’ అనే క్యాప్షన్ తో ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియానే షేక్ చేస్తోంది. దీంతో నెటిజన్లు ఈ టెక్నాలజీని చూసి ఆశ్చర్యపోతున్నారు. బుర్కాన్ ను రియల్ లైఫ్ టోనీ స్టార్క్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అయితే అలెక్స్ కు ఇలాంటి ఎక్స్ పరిమెంట్స్ ఇదే ఫస్ట్ టైమ్ కాదు. గతంలో ఎన్నో పరిశోధనలు చేసి గిన్నిస్ బుక్ లోకి కూడా ఎక్కాడు. తాజాగా మరోసారి తన అద్భుత సృష్టితో అబ్బురపరిచాడు. ఇక ఈ ఐరన్ మ్యాన్ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ప్రపంచ వ్యాప్తంగా అతడిపై ప్రశంసలు కురుస్తున్నాయి.
ఇదికూడా చదవండి: OTT Release: నెల రోజుల్లోపే ఓటీటీలోకి ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?