Revanth Reddy: ప్రభాస్‌, RGVలపై సీఎం రేవంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

Revanth Reddy-Prabhas, RGV: డార్లింగ్‌ ప్రభాస్‌, రామ్‌ గోపాల్‌ వర్మల మీద ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

Revanth Reddy-Prabhas, RGV: డార్లింగ్‌ ప్రభాస్‌, రామ్‌ గోపాల్‌ వర్మల మీద ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

ప్రభాస్‌.. ఇండియన్‌ బాక్సాఫీస్‌కు కేజీఎఫ్‌ లాంటి వాడు. డార్లింగ్‌ సినిమా కోసం ఇండియన్‌ మూవీ లవర్స్‌ అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. భాషలకతీతంగా అభిమానులను సంపాదించుకున్నాడు డార్లింగ్‌ ప్రభాస్‌. హీరోలందరి ఫ్యాన్స్‌.. బాహుబలి అభిమానులు అంటే.. తన క్రేజ్‌ ఏంటో అర్థం అవుతుంది. ప్రస్తుతం పాన్‌ ఇండియా స్టార్‌ హీరోగా భారతీయ బాక్సాఫీస్‌ను ఏలుతున్నాడు. తాజాగా కల్కి సినిమాతో.. కలెక్షన్ల సునామీ సృష్టించి.. రికార్డు క్రియేట్‌ చేశాడు. ఇక డార్లింగ్‌ అంటే కేవలం సినిమా వాళ్లకు మాత్రమే కాక.. ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది. ఆ జాబితాలో తాను కూడా ఉన్నాను అంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. తాజాగా డార్లింగ్‌ గురించి, అతడి సినిమాలపై సీఎం రేవంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలానే ఆర్జీవీపై కూడా ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఆ వివరాలు..

రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు తప్ప మరో మాట రాదేమో అనిపించే సీఎం రేవంత్‌ నోటి వెంబడి సినిమా వాళ్ల ప్రస్తావన రావడమే కాక.. కొందరిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. తాజాగా హైదరాబాద్‌లో క్షత్రియ సేవా సమితి నిర్వహించిన అభినందన సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. ఆ సామాజిక వర్గంలో ఉన్నతస్థాయికి చేరుకున్న వారిపై ప్రశంసలు కురిపించారు. విజయానికి, నమ్మకానికి క్షత్రియులు మారుపేరన్నారు రేవంత్‌. కష్టపడే గుణం వల్లే క్షత్రియులు ఏ రంగంలో అయినా సక్సెస్ అవుతారని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే.. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కృష్ణంరాజు, ప్రభాస్, రామ్ గోపాల్ వర్మ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

కృష్ణంరాజు పేరు లేకుండా తెలుగు సినిమా లేదని.. ఇక టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు సత్తా చాటిన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ.. తనకు మంచి మిత్రుడని సీఎం రేవంత్‌ చెప్పుకొచ్చారు. మరోవైపు.. టాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ వరకు తెలుగు సినిమా రేంజ్‌‌ను తీసుకెళ్లిన సినిమా బాహుబలిలో ప్రభాస్‌ పాత్ర లేకుండా ఊహించలేమని చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. వీరందరిలో ఉన్న కామన్‌ క్యారెక్టర్‌ కష్టపడేతత్వమేనని.. అందుకే ఏ రంగమైనా ఇంతలా సత్తా చాటుతున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్ అభివృద్ధిలో రాజుల పాత్ర చాలా ఉందని.. ఇప్పుడు నిర్మించబోయే ఫోర్త్ సిటీ.. ఫ్యూచర్‌ సిటీలో రాజులు పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా రేవంత్‌ కోరారు. ఇక్కడ ఇన్వెస్ట్‌ చేసేవారికి తమ ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు.. హైదరాబాద్‌లో క్షత్రియ భవన్‌ కావాలని విజ్ఞప్తి చేయగా.. మంజూరు చేస్తానని.. మళ్లీ క్షత్రియ భవన్‌ నిర్మాణమయ్యాక అందులోనే ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకుందామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

Show comments