Renu Desai: ప్లీజ్ సాయం చేయండి అంటూ రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్! ఏమైందంటే?

ప్లీజ్ సాయం చేయండి అంటూ రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్! ఏమైందంటే?

Renu Desai: సాయం చేయండి అంటూ నటి, దర్శకురాలు రేణు దేశాయ్ ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు.. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతుంది. ఇంతకు ఆమె ఏమని పోస్టు పెట్టారంటే..?

Renu Desai: సాయం చేయండి అంటూ నటి, దర్శకురాలు రేణు దేశాయ్ ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు.. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతుంది. ఇంతకు ఆమె ఏమని పోస్టు పెట్టారంటే..?

నటి, దర్శకురాలు రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు బ ద్రీ, జానీ మూవీలతో అలరించిన రేణు.. పెళ్లి, విడాకుల తర్వాత సింగిల్ మదర్‌గా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇటీవల టైగర్ నాగేశ్వరరావు మూవీతో సెకండ్ ఇన్నింగ్ స్టార్ చేశారు రేణు. అలాగే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. తన పిల్లల ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులన్ని ఆనందపరుస్తుంటారు. అలాగే సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ ఉంటారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పర్యావరణ కార్యకర్తగా, జంతు ప్రేమికురాలిగా ప్రకృతి, జంతువుల పట్ల ఆప్యాయత చూపుతుంటారు. తనకు తోచినంత సాయం చేయడంతో పాటు తన ఫ్యాన్స్ ను కూడా విరాళాలు అడుగుతూ ఉంటారు. మూగ జీవుల సంరక్షణకు తన వంతు సాయం చేసి పెద్ద మనస్సు చాటుకుంటారు. అలాగే డాగ్స్‌కు ఆహారం అందించాలంటూ రిక్వెస్ట్ చేస్తుంటారు.

తాజాగా తక్షణ సాయం చేయాలంటూ ఇన్‌స్టా‌గ్రామ్ వేదికగా ఫాలోవర్స్‌ను రిక్వెస్ట్ చేశారు రేణు దేశాయ్. కుక్క పిల్లలకు డొనేషన్‌గా రైస్ కావాలంటూ పోస్టు చేశారు. డాగ్ లవర్స్ ఉంటే హెల్ప్ చేయాలని కోరారు. తాను 50 కేజీల రైస్ ఇచ్చినట్లు చెప్పారు. ఇంతకు ఆమె ఏమని రిక్వెస్ట్ చేశారంటే.. ‘అర్జెంట్ రిక్వెస్ట్.. మా కుక్కలకు రేషన్ బియ్యం కావాలి ఎవరైనా మాకు సహాయం చేయగలరా, ప్లీజ్ మాకు ప్రతి నెలా 300 కేజీల రైస్ కావాలి.. 4 మంది సభ్యులున్న కుటుంబానికి ప్రభుత్వం నుండి 24 కేజీల బియ్యం అందుతుంది. కాబట్టి దయచేసి మీరు మాకు విరాళం ఇవ్వగలరా. అలా 10 కుటుంబాలు అందిస్తే.. చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దయచేసి స్నేహితులు, బంధువులతో ఈ విషయాన్ని షేర్ చేయండి’ అంటూ విన్నవించారు రేణు. ప్రస్తుతం ఈమె పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

ఇప్పుడే కాదు గతంలో కూడా ఆహారం లేక అల్లాడిపోతున్న వీధికుక్కల కోసం ఫుడ్ అందించాలంటూ కోరారు. తన వంతు సాయం చేయడమే కాకుండా ఇతరులను ఇలాంటి మంచి కార్యక్రమంలో కూడా భాగస్వామ్యం చేయాలని ఊవిళ్లూరుతుంటారు. జంతు ప్రేమికురాలిగా.. మూగ జీవాల పట్ల ఆప్యాయత కనబరుస్తుంటారు. మనలా బాధ చెప్పుకోలేని మూగ జీవాలకు తమ చేతనైన సాయం చేయాలని కోరుతుంటారు.  అందుకే ఆమె పలుమార్లు తన ఫాలోవర్స్‌నుద్దేశించి ఇలా ర్వికెస్టులు చేస్తుంటారు. గతంలో ఓ పెట్ డాగ్‌కు సర్జరీ చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా డొనేషన్స్ అడగ్గా.. సరైన స్పందన రాకోవడంతో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఆమె సేవ ఆగిపోలేదు.  నిజంగా ఆమె మంచి మనస్సుకు హ్యట్సాఫ్ చెప్పాల్సిందేనంటున్నారు నెటిజన్స్.

Show comments