Dharani
Mr Bachchan Collections: మాస్ మహారాజా రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15న విడుదలయ్యింది. రెండ్రోజుల్లో మూవీ ఎంత వసూలు చేసిందంటే..
Mr Bachchan Collections: మాస్ మహారాజా రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15న విడుదలయ్యింది. రెండ్రోజుల్లో మూవీ ఎంత వసూలు చేసిందంటే..
Dharani
దర్శకుడ హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన చిత్రం మిస్టర్ బచ్చన్. హిందీ సినిమా రైడ్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 15, గురువారం నాడు రిలీజ్ అయ్యింది. విడుదలకు ముందు టీజర్, ట్రైలర్, పాటలు, ప్రమోషన్ ఇంటర్వ్యూలతో సినిమా మీద హైప్‌ను బాగానే పెంచారు. దాంతో మిస్టర్ బచ్చన్ మీద అంచనాలు ఓ రేంజ్‌లో పెరిగాయి. ఇక గురవారం నాడు చిత్రం రిలీజ్ అయ్యింది. అయితే ప్రేక్షకుల్లో నెలకొన్న అంచనాలును అందుకోవడంలో విఫలమైంది. కాకపోతే సినిమా మీద భారీ హైప్ ఉండటంతో ఫస్ట్ డే కలెక్షన్లు బాగానే వచ్చాయి. కానీ రెండో రోజు మాత్రం మిస్టర్ బచ్చన్ నిరాశపరిచాడు. మరి మాస్ మహారాజా సినిమా డే 2 కలెక్షన్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
ఎన్నో అంచనాలతో విడుదలైన మిస్టర్ బచ్చన్ ఫస్డ్ డే బాగానే వసూళ్లు సాధించినా.. రెండో రోజు మాత్రం నిరాశపరిచింది. డే2 కలెక్షన్లు డౌన్ అయ్యాయి. రెండో రోజే రెస్పాన్స్ బాగా డౌన్ అయిపోయింది. ఫలితంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.30 కోట్లు మాత్రమే షేర్ రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా రూ. 1.75 కోట్లు వసూలు చేసుకుంది. ఇలా రెండు రోజుల్లో ఈ సినిమా రూ. 8 కోట్లు షేర్ కలెక్ట్ చేసుకుంది.
అయితే ‘మిస్టర్ బచ్చన్’ మూవీకి నైజాంలో రూ. 11.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 11.50 కోట్లు బిజినెస్ జరిగినట్లు సమాచారం. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.00 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 2.00 కోట్లు వ్యాపారం అయింది. ఇలా వరల్డ్ వైడ్‌గా ఇది రూ. 31.00 కోట్లు బిజినెస్ చేసింది. కానీ కలెక్షన్ల పరంగా చూస్తే మాత్రం బాగా డల్‌గా ఉంది. ఇది ఇలానే కొనసాగితే బ్రేక్ ఈవెన్ సాధించడం చాలా కష్టం అంటున్నారు సినిమా పండితులు.
రవితేజ హీరోగా హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించాడు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్, సత్య, చమ్మక్ చంద్ర తదితరులు నటించారు.