Krishna Kowshik
మాస్ మహారాజ్ రవితేజకు ప్రమాదం జరిగింది. గురువారం ఆసుపత్రిలో ఆపరేషన్ నిర్వహించారు వైద్యులు.. ఆరువారాల పాటు రెస్ట్ తీసుకోవాలని సూచించారట. ఇంతకు ఏమైందంటే...?
మాస్ మహారాజ్ రవితేజకు ప్రమాదం జరిగింది. గురువారం ఆసుపత్రిలో ఆపరేషన్ నిర్వహించారు వైద్యులు.. ఆరువారాల పాటు రెస్ట్ తీసుకోవాలని సూచించారట. ఇంతకు ఏమైందంటే...?
Krishna Kowshik
ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్ అంటూ పలకరించిన మాస్ మహారాజ్ రవితేజ ప్రమాదం బారిన పడ్డారు. తన 75వ సినిమా షూటింగ్‌లో ఆయనకు స్వల్పంగా గాయాలయ్యాయి. దీంతో ఆయనకు హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో ఆపరేషన్ జరిగింది. కుడి చేతికి గాయం కావడంతో వైద్యులు ఆపరేషన్ చేయాలని సూచించారు. శస్త్ర చికిత్స అనంతరం ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు రవితేజకు సూచించారట. ఈ నేపథ్యంలో షూటింగ్ గ్యాప్ ఇచ్చి రెస్ట్ తీసుకుంటున్నారు టాలీవుడ్ స్టార్ యాక్టర్. అయితే రవితేజ ప్రమాదం బారిన పడ్డారని తెలిసిన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ట్వీట్స్ చేస్తున్నారు. మిస్టర్ బచ్చన్ తర్వాత వరుసగా రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు మాస్ మహారాజ్.
అందులో ఒకటి భాను భోగవరపు తెరకెక్కిస్తున్న చిత్రం ఉంది. ఆర్టీ 75వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తుండగా.. రవితేజ గాయపడ్డాడట. మాస్ మహారాజా కుడి చేతి కండరం చిట్లిపోయి గాయపడ్డట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. ఆ గాయాన్ని పక్కనపెట్టి రవితేజ షూటింగ్‌ను కంప్లీట్ చేసినట్లు తెలిసింది. అయితే గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో గురువారం యశోద హాస్పిటల్ డాక్టర్లు రవితేజకు సర్జరీని నిర్వహించారు. గాయం నుంచి కోలుకోవడానికి ఆరు వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.