Ravi Teja in Coolie Movie: ఇదెక్కడి మాస్ లోకేశ్ మామ.. కూలీలో రవితేజ?

Ravi Teja Acting In Rajinikanth Coolie Movie: సూపర్ స్టార్ రజినీకాంత్-లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ 'కూలీ'. ఈ మూవీ కోసం లోకేశ్ భారీ ప్లానింగ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కింగ్ నాగ్ ను బరిలోకి దింపిన అతడు.. తాజాగా మాస్ మహారాజ రవితేజను కూడా కూలీ మూవీలో దించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Ravi Teja Acting In Rajinikanth Coolie Movie: సూపర్ స్టార్ రజినీకాంత్-లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ 'కూలీ'. ఈ మూవీ కోసం లోకేశ్ భారీ ప్లానింగ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కింగ్ నాగ్ ను బరిలోకి దింపిన అతడు.. తాజాగా మాస్ మహారాజ రవితేజను కూడా కూలీ మూవీలో దించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సూపర్ స్టార్ రజినీకాంత్-లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ ‘కూలీ’. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవలే టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున బర్త్ డే సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు. సైమన్ పాత్రలో నాగ్ కనిపించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ లుక్ లో నాగ్ స్టైలిష్ గా కనిపించాడు. దాంతో రజినీని ఢీకొట్టే విలన్ పాత్రలో మన్మథుడు కనిపించనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కూలీ మూవీలో మాస్ మహారాజా రవితేజ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

‘కూలీ’ మూవీలో లోకేశ్ కనగరాజ్ భారీ క్యాస్టింగ్ నే ప్లాన్ చేసినట్లు కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో టాలీవుడ్ మన్మథుడు కింగ్ నాగార్జున నటిస్తున్న విషయం తెలిసిందే. నాగ్ ఫస్ట్ లుక్ ను కూడా మేకర్స్ రివీల్ చేశారు. కూలీలో సైమన్ పాత్రలో ఈ సీనియర్ హీరో కనిపించబోతున్నాడు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మాస్ మహారాజ రవితేజ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ.. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం అనకాపల్లిలో ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడి సెట్ లో నాగార్జునతో పాటుగా రవితేజ కూడా కనిపించాడట. దాంతో కూలీలో మాస్ మహారాజ కూడా ఉన్నాడని అనుకుంటున్నారు. అయితే.. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కాగా.. రజినీకాంత్ సైతం జైలర్ మూవీ నుంచి తన సినిమాల్లో స్టార్ క్యాస్టింగ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. జైలర్ లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, సునీల్, జాకీ ఫ్రాప్, సునీల్ లాంటి స్టార్స్ నటించగా.. రిలీజ్ కు రెడీ అవుతున్న రజినీ మరో మూవీ వెట్టయాన్ లో కూడా దగ్గుబాటి రానా, అమితాబ్, ఫాహద్ ఫజిల్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక కూలీలో రవితేజ నటిస్తున్నాడు అన్న వార్తలు వైరల్ అయిన నేపథ్యంలో డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ప్లానింగ్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ రేంజ్ లో స్టార్ హీరోలను దించుతున్నాడంటే? ఏదో పెద్ద ప్లానింగే చేసినట్లున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నాడు. ఇంకా ఎంతమందిని దించుతాడో.. ఇదెక్కడి మాస్ ఐడియా లోకేశ్ మామా అని పొగుడుతున్నారు. మరి రజినీ మూవీలో రవితేజ నటిస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Ravi Teja is in coolie
byu/Competitive_Path_495 intollywood

Show comments