తాను నటించిన ఆ చిత్రం చూసి ఎంతో మంది విడాకులు తీసుకున్నారని షాకింగ్ కామెంట్స్ చేసింది స్టార్ హీరోయిన్. ఈ మూవీలో షారుఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్, ప్రతీజింటాలు కూడా నటించడం గమనార్హం. మరి ఆ మూవీ ఏది? ఆ హీరోయిన్ ఎవరు?
తాను నటించిన ఆ చిత్రం చూసి ఎంతో మంది విడాకులు తీసుకున్నారని షాకింగ్ కామెంట్స్ చేసింది స్టార్ హీరోయిన్. ఈ మూవీలో షారుఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్, ప్రతీజింటాలు కూడా నటించడం గమనార్హం. మరి ఆ మూవీ ఏది? ఆ హీరోయిన్ ఎవరు?
చాలా మంది సినిమాల ప్రభావం ప్రేక్షకులపై ఉండదని అనుకుంటూ ఉంటారు. కానీ కాస్తో.. కూస్తో వాటి ప్రభావం వారిపై పడుతూనే ఉంటుంది. అందుకు సమాజంలో జరిగిన ఎన్నో సంఘటనలు నిదర్శనం. ఇక థ్రిల్లర్ మూవీలను చూసి, అచ్చం అలాగే హత్యలు చేసి తప్పించుకోవాలని చూసిన కేసుల గురించి మనం వినే ఉన్నాం. కాగా.. తాను నటించిన ఆ చిత్రం చూసి ఎంతో మంది విడాకులు తీసుకున్నారని షాకింగ్ కామెంట్స్ చేసింది స్టార్ హీరోయిన్. ఈ మూవీలో షారుఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్, ప్రతీజింటాలు కూడా నటించడం గమనార్హం. మరి ఆ మూవీ ఏది? ఆ హీరోయిన్ ఎవరో? ఆ వివరాలు..
కభీ అల్విదా నా కెహనా 2006లో వచ్చిన బాలీవుడ్ చిత్రం. ఇందులో షారుఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్, ప్రతీజింటా, అమితాబ్, రాణీ ముఖర్జీ లాంటి భారీ తారాగాణం నటించారు. ఈ మూవీకి కరణ్ జోహార్ దర్శకత్వం వహించారు. ఇక అప్పట్లో ఈ మూవీ సృష్టించిన సంచలనం అంతా.. ఇంతా కాదు. తాజాగా ఈ మూవీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది సీనియర్ హీరోయిన్ రాణీ ముఖర్జీ. గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న ఆమె పలు షాకింగ్ కామెంట్స్ చేసింది. రాణీ ముఖర్జీ మాట్లాడుతూ..”అప్పట్లో కభీ అల్విదా నా కెహనా సినిమా చూసిన తర్వాత చాలా మంది విడాకులు తీసుకున్నారు. ఆ టైమ్ లో ఈ సినిమా ఓ సంచలనమనే చెప్పాలి. అయితే ఈ మూవీని థియేటర్లలో కాస్త అసౌకర్యంగానే ప్రేక్షకులు చూశారు. ఈ పిక్చర్ ఎంతో మంది కళ్లు తెరిపించింది. దీంతో సంతోషంగా ఉండాలని ఎంతో మంది సింగిల్ లైఫ్ ను కోరుకున్నారు” అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
కాగా.. ఈ మూవీలో ‘మాయా’ పాత్రలో రాణీ ముఖర్జీ నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇష్టం లేని కాపురం చేయలేక ఈ సినిమాలో రెండు జంటలు తమ భర్త లేదా భార్యను వదిలేసి మరోకరితో జీవిస్తారు అన్నదే కభీ అల్విదా నా కెహనా సినిమా స్టోరీ. ఈ కథ చాలా మందిని విడాకులు తీసుకునేందుకు ప్రేరేపితం చేసిందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. మరి రాణీ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.