Tirupathi Rao
Ram Charan Bollywood Project Story: రామ్ చరణ్ మరోసారి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడని తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ తో క్రేజీ ప్రాజెక్టుతో వస్తున్నాడు అంటున్నారు.
Ram Charan Bollywood Project Story: రామ్ చరణ్ మరోసారి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడని తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ తో క్రేజీ ప్రాజెక్టుతో వస్తున్నాడు అంటున్నారు.
Tirupathi Rao
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఈ స్టార్ హీరోకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా గట్టిగానే ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. రామ్ చరణ్ నుంచి రాబోతున్న గేమ్ ఛేంజర్ మీద బాలీవుడ్ లో కూడా భారీగానే అంచనాలు నెలకొన్నాయి. దానికి తగినట్లుగానే చెర్రీ కూడా తన తర్వాతి ప్రాజెక్ట్స్ ని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే నెక్ట్స్ మూవీని స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబుతో ప్లాన్ చేశాడు. ఆ మూవీ ఇంకా పట్టాలు కూడా ఎక్కలేదు. ఈలోపే ఒక క్రేజీ కాన్సెప్ట్ తో బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ తో మూవీ సైన్ చేశాడని చెప్తున్నారు. నిజానికి ఆ కథ గురించి వింటుంటేనే రామ్ చరణ్ ఖాతాలో మరో భారీ హిట్టు పడిపోయింది అని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
రామ్ చరణ్ సరిగ్గా 11 ఏళ్ల క్రితం బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ జంజీర్ అనే యాక్షన్ ప్యాక్డ్ మూవీ తీశాడు. అపూర్వ లాఖియా దర్శకత్వంలో వచ్చిన ఆ మూవీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఆ తర్వాత చెర్రీ కూడా మళ్లీ బాలీవుడ్ వైపు తిరిగి చూడలేదు. తన నుంచి వచ్చిన సినిమాలు డబ్ అయ్యి హిందీలో రిలీజ్ కావడమే గానీ.. నేరుగా మాత్రం బాలీవుడ్ చిత్రం చేయలేదు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత రామ్ చరణ్ స్ట్రైట్ బాలీవుడ్ మూవీ చేసేందుకు రెడీ అయిపోయాడు. మూడ్రోజుల క్రితమే ప్రముఖ డైరెక్టర్ తో ప్రాజెక్ట్ సైన్ కూడా చేశాడని బీ టౌన్ కోడై కూస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రామ్ చరణ్ సైన్ చేసింది మరెవరికో కాదు.. ప్రముఖ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ మూవీకే. ఈ డైరెక్టర్ ట్రాక్ రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ తో.. సంజయ్ లీలా భన్సాలీకి బాగా అనుభవం ఉన్న వార్ బేస్డ్ బయోపిక్ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట. ఇంకేముంది ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సంజయ్ లీలా భన్సాలీ ఎంచుకున్న బయోపిక్ మరెవరిదో కాదు.. 11వ శతాబ్దపు మహారాజు అయిన సుహెల్ దేవ్ ది అని చెబుతున్నారు. చరిత్ర చూస్తే సుహెల్ దేవ్ ఒక గొప్ప మహారాజు. ఉత్తరప్రదేశ్ లోని శరావస్తి రాజ్యాన్ని పాలించారు. ఆయన 1033లో ఉత్తరప్రదేశ్ బహ్రైచ్ లోని చిత్తోరా నది ఒడ్డున ఒక గొప్ప యుద్ధంలో పాల్గొన్నారు. ఆ మహా సంగ్రామంలో ఘజ్నావిద్ జనరల్ ఘాజీ సయ్యద్ సలార్ మసూద్ ని హత మార్చారు. సుహెల్ దేవ్ పరాక్రమానికి సంబంధించి చాలా కథలు, రచనలు ఉన్నాయి. వాటిలో అమిష్ త్రిపాఠి రచించిన లెజెండ్ ఆఫ్ సుహెల్ దేవ్: ది కింగ్ హూ సేవ్డ్ ఇండియా.. అనే పుస్తకం బాగా పాపులర్.
ఈ బయోపిక్ లో ఎలివేషన్స్, యాక్షన్, ఎమోషన్స్ కు ఎంతో మంచి స్కోప్ ఉంటుంది. పైగా రామ్ చరణ్ ఇప్పటికే మగధీరలాంటి సినిమాలో పిరియాడికల్ యాక్షన్ డ్రామాతో మెప్పించగలనని నిరూపించుకున్నాడు. అలాంటి ఒక మహారాజు పాత్రలో రామ్ చరణ్ కనిపించబోతున్నాడని తెలియగానే మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈసారి మగధీరకు మించి ఈ మూవీ ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 16న మహారాజు సుహెల్ దేవ్ జయంతి సందర్భంగా ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం లేకపోలేదు. మరి.. మహారాజ సుహెల్ దేవ్ పాత్రలో రామ్ చరణ్ నటిస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.