Rakul Preet Singh: చిక్కుల్లో హీరోయిన్‌ రకుల్‌ భర్త.. ఉద్యోగులను మోసం చేస్తూ..

హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ భర్త చిక్కుల్లో ఇరుక్కున్నాడు. ఉద్యోగులను మోసం చేశాడనే ఆరోపణలు వస్తున్నాయి. ఆ వివరాలు..

హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ భర్త చిక్కుల్లో ఇరుక్కున్నాడు. ఉద్యోగులను మోసం చేశాడనే ఆరోపణలు వస్తున్నాయి. ఆ వివరాలు..

సెలబ్రిటలకు సంబంధించి ఏ చిన్న వార్త వచ్చినా.. అది వెంటనే సోషల్‌ మీడియా, వీడియాలో వైరల్‌ అవుతోంది. ఇక సెలబ్రిటీలు మాత్రమే కాక.. వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఇలా ఎవరు ఏ చిన్న తప్పు చేసినా.. సదరు సెలబ్రిటీ పేరు వార్తల్లో నానుతుంది. వారు చుట్టూ ఉండేవారు, కుటుంబ సభ్యులు చేసే పనులకు సెలబ్రిటీలు బ్లేమ్‌ అవ్వాల్సి వస్తుంది. తాజాగా హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఇలాంటే పరిస్థితి ఎదురయ్యింది. ఆమె భర్త.. ఉద్యోగుల్ని మోసం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆ వివరాలు..

సాధారణంగా ఏదైనా సినిమా తెరకెక్కిస్తే.. దానిలో నటించిన హీరోహీరోయిన్లు, నటీనటుల రెమ్యునరేషన్ గురించి బోలేడు వార్తలు వస్తాయి. అయితే సినిమాకు పని చేసే హీరోహీరోయిన్లకు కచ్చితంగా ముందే మాట్లాడుకున్నంత ఇచ్చేస్తారు. కానీ అదే సినిమాకు పనిచేసిన సిబ్బందికి మాత్రం జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటారు. హీరోహీరోయిన్లకు కోట్ల రూపాయలు పారితోషికం ఇచ్చి.. సిబ్బందికి చెల్లించే వేల రూపాయల జీతాల విషయానికి వచ్చే సరికి.. అది సకాలంలో చెల్లించకుండా వారిని ఇబ్బంది పెడుతుంటారు. తాజాగా హీరోయిన్ రకుల్ భర్త జాకీ భగ్నానీ కూడా ఇదే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. బాలీవుడ్‌లో పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్ పేరిట ఇతడికి ప్రముఖ నిర్మాణ సంస్థ ఉంది. ఇప్పుడు అందులో ఉద్యోగులు తమకు జరుగుతున్న అన్యాయం గురించి వెల్లడించడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

1986లో పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ సంస్థ ఏర్పాటైంది. కూలీ నంబర్ 1, బడేమియా చోటే మియా (1998), బీవీ నంబర్ 1, ఖామోషీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు తీసింది. ఆ తర్వాత కూడా వరుసగా సినిమాలు వస్తున్నాయి. కానీ అవి మాత్రం ఆశించిన మేర విజయం సాధించడం లేదు. రీసెంట్‌గా అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా బడే మియా చోటే మియా అనే యాక్షన్ మూవీ కూడా పూజా ఎంటర్‌టైన్స్‌నే నిర్మించింది. అయితే ఈ సినిమా అనూహ్య రీతిలో బాక్సాఫీస్‌ వద్ద దారుణ పరాజయం మూట గట్టుకుంది. ఇక గత కొంత కాలంగా ఈ నిర్మాణ సంస్థ నుంచి వస్తోన్న సినిమాలు ఏవి పెద్దగా ఆడటం లేదు. దాంతో తాజాగా బడే మియాన్‌.. చోటే మియాన్‌ సినిమాకు పనిచేసిసిన సిబ్బంది.. రకుల్‌ భర్త జాకీ భగ్నానీ కంపెనీ.. పూజా సంస్థ తమకు వేతనాలు చెల్లించలేదని ఆరోపించారు. ఈమేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు చేశారు

బాలీవుడ్ రూల్స్ ప్రకారం.. సినిమా పూర్తయిన 45-60 రోజుల్లో బకాయిలన్నీ చెల్లించాలి. కానీ ఇప్పటికి 2 నెలలు పూర్తవుతున్నా.. తమకు ఇంకా జీతాలు ఇవ్వలేదని.. పూజా సంస్థలో పనిచేసిన ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వైష్ణవి అనే ఉద్యోగి మాట్లాడుతూ.. తనతో పాటు పనిచేసిన 100 మందికి జీతాలు ఇవ్వలేదని చెప్పుకొచ్చింది.. తమకు ఇవ్వాల్సిన జీతాల కోసం గత కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేసింది.

మరో ఉద్యోగి స్పందిస్తూ.. ఔట్ డోర్ షూటిం‍గ్స్ జరిగేటప్పుడు తమకు సరైన తిండి కూడా పెట్టరని ఆరోపించారు. 3 నెలలు పనిచేస్తే రెండు నెలల జీతం ఎగ్గొడతారని చెప్పాడు. ఇప్పుడు తాము ఈ విషయాన్ని బయటకు చెప్పడం వల్ల మిగతా వాళ్లయినా జాగ్రత్త పడతారని అందుకే ఇలా పోస్టులు పెడుతున్నామని అన్నారు. మరి ఈ ఆరోపణలపై నిర్మాణ సంస్థ స్పందన ఏమిటనేది చూడాలి?

Show comments