Lal Salaam: ‘జైలర్’ ఎఫెక్ట్ ‘లాల్ సలాం’ మీద లేదెందుకు? ఎక్కడ ఫెయిలైనట్లు?

‘జైలర్’తో గతేడాది బ్లాక్​బస్టర్ హిట్ కొట్టారు కోలీవుడ్ సూపర్​స్టార్ రజినీకాంత్. ఈ సినిమా అటు తమిళంతో పాటు ఇటు తెలుగునాట కూడా సంచలన విజయం సాధించింది.

‘జైలర్’తో గతేడాది బ్లాక్​బస్టర్ హిట్ కొట్టారు కోలీవుడ్ సూపర్​స్టార్ రజినీకాంత్. ఈ సినిమా అటు తమిళంతో పాటు ఇటు తెలుగునాట కూడా సంచలన విజయం సాధించింది.

కోలీవుడ్ తలైవా రజినీకాంత్ గతేడాది ఓ భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఆయన నటించిన గత చిత్రం ‘జైలర్’ సెన్సేషనల్ బ్లాక్​బస్టర్​గా నిలిచింది. కొన్నాళ్ల నుంచి సరైన హిట్ లేక నిరాశలో ఉన్న రజినీకి ఈ ఫిల్మ్ బిగ్​ రిలీఫ్​ను ఇచ్చింది. అటు తమిళంతో పాటు ఇటు తెలుగు నాట కూడా సంచలన వసూళ్లతో బాక్సాఫీస్​ను షేక్ చేసింది ‘జైలర్’. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్, రజినీ యాక్టింగ్, కామెడీ, యాక్షన్ సీక్వెన్స్​లకు ఆడియెన్స్​కు గూస్​బంప్స్ వచ్చాయి. ‘జైలర్’ సూపర్ హిట్ అవడంతో సూపర్​స్టార్ నుంచి వచ్చే నెక్స్ట్ మూవీకి మంచి బజ్ ఏర్పడింది. కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో యాక్ట్ చేసిన ‘లాల్ సలాం’ మూవీతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు రజినీ. అయితే ఈ సినిమా మీద పెద్దగా హైప్ లేదు. ‘జైలర్’ సక్సెస్ ఎఫెక్ట్ కూడా దీనిపై కనిపించడం లేదు. దీనికి ‘లాల్ సలాం’ యూనిట్ ఫెయిల్యూరే​ కారణంగా కనిపిస్తోంది.

‘జైలర్’ తర్వాత వస్తున్న ‘లాల్ సలాం’కు తెలుగు రాష్ట్రాల్లో భారీగా థియేటర్లు దక్కాయి. అయితే ఓపెనింగ్స్​ మాత్రం డల్​గా ఉన్నాయని ట్రేడ్ సమాచారం. రజినీ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా దారుణంగా ఉన్నాయని అనలిస్టులు అంటున్నారు. సాధారణంగా ఓ పెద్ద స్టార్ హీరోకు బ్లాక్​బస్టర్ వచ్చాక ఆయన తర్వాతి సినిమాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అయితే ‘జైలర్’ లాంటి సూపర్ హిట్ తర్వాత తలైవా నుంచి వస్తున్న ‘లాల్ సలాం’ గురించి ఎక్కడా చప్పుడు లేదు. ఇందులో సోలో హీరోగా కాకపోయినా చెప్పుకోదగ్గ నిడివి ఉన్న క్యారెక్టర్​ చేశారు రజినీ. అందునా కూతురు ఐశ్వర్య డైరెక్టర్ కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి. కానీ థియేటర్ల వద్ద మాత్రం అందుకు తగ్గట్లు సందడి కనిపించడం లేదు. ‘జైలర్’ ఎఫెక్ట్ ఈ మూవీ మీద పడి ఉంటే ఓపెనింగ్స్ అదిరిపోయేవి. థియేటర్ల దగ్గర ప్రేక్షకులు, అభిమానుల కోలాహలంతో జాతర వాతావరణం కనిపించేది. కానీ ‘లాల్ సలాం’ మేకర్స్ సరైన్ ప్లానింగ్​ను పాటించకపోవడంతో సినిమా మీద బజ్, ఎక్స్​పెక్టేషన్స్​ ఏర్పడలేదు.

‘లాల్ సలాం’ వస్తోందనే విషయమే చాలా మందికి తెలియదని ట్రేడ్ ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. ముఖ్యంగా తెలుగు నాట సినిమాను పెద్దగా ప్రమోట్ చేయకపోవడం, ప్లానింగ్ కొరవడటం, మాస్​కు రీచ్ అయ్యే విధంగా టైటిల్ లేకపోవడం మైనస్​గా మారాయని తెలుస్తోంది. అలాగే రజినీకాంత్ క్యారెక్టర్​ అందరికీ కనెక్ట్ అయ్యేలా డైరెక్టర్ కేర్ తీసుకోకపోవడం.. అసలు సినిమాలోని కంటెంట్ క్రికెట్ గురించా? లేదా ఓ గ్రామంలో ఉన్న పగల గురించా? అనే క్లారిటీ సరిగ్గా ఇవ్వకపోవడం కూడా కారణాలుగా కనిపిస్తున్నాయి. ఫిల్మ్ చూశాక ఇవన్నీ అర్థం కావడం వేరు, ఆడియెన్స్​ను ముందే ప్రిపేర్ చేయడం వేరు. ఏదేమైనా తెలుగులో రజినీకి ఉన్న మార్కెట్, క్రేజ్​ను క్యాష్ చేసుకోవడంలో ‘లాల్ సలాం’ యూనిట్ కంప్లీట్​గా ఫెయిలైందనేది కాదనలేని వాస్తవం. మరి.. ‘లాల్ సలాం’ చిత్రాన్ని మీరు చూసినట్లయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.

Show comments