జైలర్ మూవీలో ఈ విలన్ గుర్తున్నడా.. ఈయన బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమాలో విలన్ పాత్రలో నటించిన ఈ నటుడు గుర్తున్నడా.. ఈయన ఎవరు? ఎలా ఇండస్ట్రీకి పరిచయమైయ్యాడు? ఈయన బ్యాక్ గ్రౌండ్ ఏమిటి తెలిస్తే షాక్ అవుతారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమాలో విలన్ పాత్రలో నటించిన ఈ నటుడు గుర్తున్నడా.. ఈయన ఎవరు? ఎలా ఇండస్ట్రీకి పరిచయమైయ్యాడు? ఈయన బ్యాక్ గ్రౌండ్ ఏమిటి తెలిస్తే షాక్ అవుతారు.

సాధరణంగా ఏ సినిమాలోనైనా హీరో పాత్ర ఎలివేట్ అవ్వలంటే.. అందులో మొదటిగా విలనీజం బాగా పండాలి. ముఖ్యంగా విలన్ పాత్ర ఎంత ఫవర్ ఫుల్ గా ఉంటే.. సినిమాలో హీరోకు అంతా హైప్ వస్తుంది. ఒక్క మాటాలో చెప్పాలంటే.. ఆడియోన్స్ కూడా ఆ విలనీజంను చూసి భయపడే విధంగా ఉండాలి. అందుకే ఇప్పుడు చాలా వరకు సినిమాలో  పాపులర్ అండ్ పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్స్ చేసే యాక్టర్స్ ను వెతికే పనిలో దర్శకులు ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఇక భాష ఏదైనా సరే.. విలన్ గా సెట్ అవుతారా, పాత్రను ఎంతవరకు న్యాయం చేయగలరా అనేది ముఖ్యం.

మరీ, అలాంటి ఫవర్ ఫుల్ పాత్రల్లో అలరించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ విలన్ ఎవరో గుర్తుపట్టారా.. ఈ యాక్టర్ పేరు ‘వినయకన్‘. ఈ పేరుతో గుర్తుపట్టాడం కష్టమేమో కానీ,  జైలర్ మూవీ విలన్ అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. అంతలా ఆ సినిమాలో ఈ విలనీజం పండించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ నటుడు. ఇంతకీ ఈయన ఎలా ఇండస్ట్రీకి పరిచయమైయ్యాడు? ఈయన బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అనే విషయాలను తెలుసుకుందాం. సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్‘ మూవీలో విలన్ గా నటించి ఫుల్ క్రేజ్ వినయకన్ ఒక మలయాళ నటుడు. ఈయన కేరళలోని ఎర్నాకులంలో 1973 జన్మించాడు. అయితే వినయకన్ చూడటానికి రఫ్ లుక్, క్రూరమైన మొహం, భీకరమైన చూపులతో అందర్నీ భయపట్టే విధంగా కనిపిస్తాడు. కానీ, నిజనాకి ఈయన ఒక మల్టీ టాలెండెట్ యాక్టర్. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఒక యాక్టర్, సింగర్, కంపోజర్, కొరియోగ్రాఫర్ గా అన్ని రంగాల్లో మల్టీ టాలెంటెడ్ గా రాణించాడు.

అయితే వినయకన్ వినయకన్ ఇండస్ట్రీకి రాకముందు మొదట ఒక డ్యాన్సర్ గా తన కెరీర్ ప్రారంభించాడు. పైగా ఈయన ఫైర్ డ్యాన్సర్ గా బ్లాక్ మెర్క్యురీ’ అనే డాన్స్ గ్రూపు కూడా నిర్వహించాడు. ఇక ఇతనికి  మైకేల్ జాక్సన్ అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే.. మైకేల్ జాక్సన్ ని ఇమిటేట్ చేస్తూ డ్యాన్స్ చేసేవాడు. ఇలా డ్యాన్సర్ గా కెరీర్ మొదలుపెట్టిన ఆయన మొదటిగా మలయాళం లో 1995 సంవత్సరంలో యాక్షన్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన ‘మాంత్రికం’ మూవీతో వెండితెరకు పరిచయమైయ్యాడు. ఇక ఈ సినిమాలో మైఖేల్ జాక్సన్ డూప్ గా అతిథి పాత్రలో నటించాడు. ఇలా మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న వినయకన్ కు ఆ తర్వాత..2001లో ‘ఓనమన్’ లో నటించాడు. ఇక అప్పటి నుంచి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వినయకన్ మలయాళం, కన్నడ, తమిళ్ చిత్రాల్లో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే ఎక్కువగా ఈయన విలన్, అతిథి పాత్రల్లోనే అలరించాడు.

ఇకపోతే వినయకన్ జైలర్ సినిమా కంటే ముందుగా తెలుగులో 2006లో కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘అసాధ్యుడు’ మూవీలో కూడా విలన్ గా నటించాడు. ఇక అదే ఏడాది విశాల్ హీరోగా నటించిన ‘పొగరు’ సినిమాలో కూడా వినయకన్ నటించాడు. కానీ, వినయకన్ ఇప్పటి వరకు నటించిన సినిమాలకన్నా.. ఇటీవలే నటించిన జైలర్ సినిమా ఈయనకు వరల్డ్ వైడ్ గా క్రేజ్ తెచ్చిపెట్టిందనే చెప్పవచ్చు.  ఇకపోతే సుదీర్ఘీకాలంగా ఇండస్ట్రీలో రాణిస్తున్న వినయకన్ హిందీ, తమిళ్ తెలుగు, మలయాళం, కన్నడ వంటి భాషల్లో సినిమాల్లో నటించారు. కాగా, మలయాళంలో ఇప్పటి వరకు 53 సినిమాల్లో నటించగా, తమిళం లో 8, తెలుగులో 1, బాలీవుడ్ 1 సినిమాలో నటించారు. ఇక ఈయన నటనకు ఫిదా అయిన తెలుగు ఆడియోన్స్ డబ్బింగ్ సినిమాల్లో కాకుండా నేరుగా తెలుగులో సినిమాలు చేస్తే బాగున్నంటూ అభిప్రాయపడుతున్నారు.  మరీ, జైలర్ మూవీ విలన్ బ్యాక్ గ్రౌండ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments