భరించలేని నొప్పితో ఆస్పత్రిలో చేరిన సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌! వైద్యులు ఏమన్నారంటే..?

Rajinikanth, Chennai, Apollo Hospital: కొన్ని కోట్ల మంది ఆరాధ్య నటుడు రజినీ కాంత్‌ తీవ్ర అస్వస్తతతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థిత ఎలా ఉందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Rajinikanth, Chennai, Apollo Hospital: కొన్ని కోట్ల మంది ఆరాధ్య నటుడు రజినీ కాంత్‌ తీవ్ర అస్వస్తతతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థిత ఎలా ఉందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. భరించలేని కడుపునొప్పితో ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. సోమవారం రాత్రి ఆకస్మత్తుగా రజనీకాంత్‌కు కడుపునొప్పి రాగా.. ఆయనను కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. రజనీని పరీక్షించిన వైద్యులు.. వెంటనే చికిత్స అందించారు. అయితే.. ప్రస్తుతం రజనీకాంత్‌ పరిస్థితి నిలకడగానే ఉందని తెలుస్తోంది. ఈ విషయంపై రజనీకాంత్‌ భార్య స్పందిస్తూ.. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని తెలిపారు. దీంతో.. రజనీ అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కాగా, రజనీకాంత్‌ త్వరలోనే వేట్టయాన్‌, కూలీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. వేట్టయాన్‌ అక్టోబర్‌ 10న రిలీజ్‌ కానుంది. ఈ భారీ సినిమాకి ముందు రజనీ ఇలా అస్వస్థతకు గురి కావడం అభిమానులను ఆందోళనకు గురి చేసింది. రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.

రజనీ అస్వస్థతకు గురైన విషయం తెలియగానే సినీ రాజకీయ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రజనీ కాంత్ వయసు 73 ఏళ్లు. ఈ వయసులో కూడా తన అభిమానుల కోసం సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. వయసురీత్యా ఆయన ఇదివరకే పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయినప్పటికీ నటనకు మాత్రం విరామం ఇవ్వకుండా సూపర్ హిట్ చిత్రాలతో దూసుకెళ్తున్నారు. రజనీకి భాషతో సంబంధం లేకుండా అన్ని స్టేట్ లలో అభిమానులు ఉన్నారు. స్పెషల్ స్టైల్ తో కూడిన యాక్టింగ్, డైలాగ్స్ తో ప్రేక్షకులను కట్టిపడేయడం రజనీకి వెన్నెతో పెట్టిన విద్య.

ఆ మధ్యకాలంలో తమిళ సూపర్ స్టార్ రాజకీయాల్లోకి రావాలని అనుకున్నారు. ఓ రాజకీయ పార్టీని కూడా స్థాపించారు. రజనీ పొలిటికల్ పార్టీ పెడితే తమిళ రాజకీయాలను ఏలుతాడని రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ, రజనీకాంత్ వ్యక్తిగత, ఆరోగ్య కారణాలతో రాజకీయాలను పక్కనబెట్టారు. పార్టీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించి భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదని వెల్లడించారు. ప్రజల కోసం తాను చేయగలిగినంత చేస్తానని తెలిపారు. రజనీ రాజకీయాల్లోంచి తప్పుకోవడంతో తలైవ అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. తాజాగా ఆయన అనారోగ్యానికి గురికావడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. రజనీ చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Show comments