Aditya N
సూపర్ స్టార్ రజీనికాంత్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయనకు మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన ఏ నిర్ణయం తీసుకున్న సమర్ధించే అభిమానులు ఓ విషయంలో మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సమచారం.
సూపర్ స్టార్ రజీనికాంత్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయనకు మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన ఏ నిర్ణయం తీసుకున్న సమర్ధించే అభిమానులు ఓ విషయంలో మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సమచారం.
Aditya N
సూపర్ స్టార్ రజినీకాంత్ తన పెద్ద కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించిన లాల్ సలాం (2024) చిత్రంలో అతిథి పాత్రలో కనిపించిన విషయం మనందరికీ తెలిసిందే. పేలవమైన ప్రమోషన్స్, మిక్స్డ్ టాక్ కారణంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొట్టింది. తన ఇమేజ్ కు సరిపోని ఇలాంటి అతిథి పాత్రలు చేయడం ద్వారా స్టార్ డమ్ పడిపోతుందని ఆయన అభిమానులతో పాటు ట్రేడ్ అనలిస్టులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే రజినీకాంత్ మాత్రం ఎవరి మాటా వినేలా లేడు.
ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో విష్ణు విశాల్, విక్రాంత్, విఘ్నేష్, సెంథిల్, జీవిత, కె.ఎస్.రవికుమార్, తంబి రామయ్య ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘లాల్ సలాం’. మొయిద్దీన్ భాయ్ అనే మరో ప్రధాన పాత్రలో రజినీకాంత్ నటించగా, మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ కూడా ఒక అతిథి పాత్రలో నటించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ప్రేక్షకులు ఈ సినిమాని ఏకగ్రీవంగా తిప్పికొట్టడంతో బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. అందువల్ల మళ్ళీ ఇలాంటి అతిధి పాత్రల జోలికి వెళ్ళకూడదని రజినీ అభిమానులు ఆయనను వేడుకున్నారు. అయితే ఈ మాటలన్నీ వినే మూడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ లేనట్లు కనిపిస్తుంది.
తాజాగా రాఘవ లారెన్స్ సినిమాలో అతిథి పాత్రలో నటించేందుకు అంగీకరించారని సమాచారం. తన రెండో కూతురు సౌందర్య రజినీకాంత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుందట. కూతుళ్ల పట్ల రజినీ చూపిన ఉదారత పై అభిమానులతో పాటు నెటిజన్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. లాల్ సలాం (2024) సినిమాలో రజినీకాంత్ పాత్ర దాదాపు నలభై నిమిషాల పైనే ఉంటుంది. అయితే రాఘవ లారెన్స్ – సౌందర్య రజినీకాంత్ సినిమాలో సుమారు 20 నిమిషాల నిడివి గల పాత్రలో రజినీకాంత్ కనిపించనున్నట్లు సమాచారం.