Game Changer: గేమ్‌ ఛేంజర్‌లో ఒక్కో పాట కోసం కోట్లు ఖర్చు చేశారు: రాజీవ్‌ కనకలా

Rajeev Kanakala-Game Changer Movie: గేమ్‌ ఛేంజర్‌ మూవీపై నటుడు రాజీవ్‌ కనకాల చేసిన కామెంట్స్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వివరాలు..

Rajeev Kanakala-Game Changer Movie: గేమ్‌ ఛేంజర్‌ మూవీపై నటుడు రాజీవ్‌ కనకాల చేసిన కామెంట్స్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వివరాలు..

ట్రిపుల్‌ ఆర్‌ సినిమాతో గ్లోబల్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు మెగా హీరో రామ్‌ చరణ్‌. ఆ మూవీ మన దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఏకంగా ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌ను ఇండియాకు అందించిన తొలి చిత్రంగా చరిత్రకెక్కింది. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ ఒకరితో ఒకరు పోటీ పడి నటించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ విజయం తర్వాత ఈ ఇద్దరు స్టార్‌ హీరోల మీద అంచనాలు ఆకాశాన్ని తాకాయి. దానికి తగ్గట్టుగానే రామ్‌ చరణ్‌.. డైరెక్టర్‌ శంకర్‌ సినిమాకు ఒకే చెప్పి.. మరోసారి అంచనాలు పెంచేశాడు. భారీ బడ్జెట్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రెస్‌గా నిలిచే శంకర్‌ దర్శకత్వంలో.. ‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రకటించడంతో దీనిపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ సాగుతోంది.

అయితే ఇటీవల శంకర్-కమల్‌ హాసన్‌ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 (భారతీయుడు 2) ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపర్చింది. దీంతో గేమ్ ఛేంజర్‌కి కూడా ఏమైనా దెబ్బ పడుతుందేమోనని అభిమానులు కంగారు పడుతున్నారు. ఇదిలా ఉంటే.. నిర్మాత దిల్‌ రాజు మాత్రం.. ఈ ఏడాది క్రిస్మస్‌కు గేమ్‌ ఛేంజర్‌ను విడుదల చేస్తామని హింట్‌ ఇచ్చేశారు. అదే సమయంలో పుష్ప 2 కూడా విడుదల కానుందనే వార్తల నేపథ్యంలో.. ఇటు అభిమానులకు, అటు మూవీ లవర్స్‌కు ఇది ఫీస్ట్‌ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రెండు సినిమాల మీద ఓ పాన్‌ ఇండియా వైడ్‌గా ఓ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి.

ఇలా ఉండగా.. నటడు రాజీవ్‌ కనకాల గేమ్‌ ఛేంజర్‌ మూవీపై చేసిన కామెంట్స్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ సినిమాలో ఆయన ఓ కీలక పాత్రలో ఆయన నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గేమ్ ఛేంజర్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంటర్వ్యూలో భాగంగా.. శంకర్ తీసిన గేమ్ ఛేంజర్‌పై.. తాజాగా విడుదలైన ఇండియన్ 2 ఫ్లాప్ ప్రభావం ఉంటుందా అని అడిగిన ప్రశ్నకి రాజీవ్ బదులిస్తూ.. ఇలా అన్నారు.

‘‘గేమ్ ఛేంజర్‌లో బ్రహ్మాండమైన సన్నివేశాలు ఉన్నాయి. షూటింగ్ సమయంలో చాలా బాగా ఎంజాయ్ చేశాం. ఇండియన్ 2 ఎఫెక్ట్ గేమ్ ఛేంజర్ మీద అస్సలు ఉండదు. ఆ కథ వేరు ఈ కథ వేరు. గేమ్ ఛేంజర్‌పై మేము చాలా నమ్మకంగా ఉన్నాం. సాంగ్స్ అద్భుతంగా తీశారు. నేను విన్నది అయితే ఒక్కో సాంగ్ రూ.10 కోట్లు, రూ. 12 కోట్లు ఖర్చు అయ్యాయి. అంత భారీగా ఉంటాయి సాంగ్స్. గేమ్‌ ఛేంజర్‌ బ్రహ్మాంమైన కమర్షియల్ సినిమా.. అలానే కథలో డ్రామా కూడా ఉంటుంది’’ అంటూ సినిమాపై మరింత ఆసక్తి పెంచారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజీవ్‌ కామెంట్స్‌ విన్నవారంతా.. గేమ్‌ ఛేంజర్‌ బ్లాక్‌ బాస్టర్‌ హిట్టు కావడం పక్కా అంటున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా కియారా అద్వానీ నటిస్తుంది. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, అంజలి వంటి నటీనటులు కీలకపాత్రలు పోషించారు. తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు.

Show comments