Venkateswarlu
విజయ్‌కాంత్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. తాజాగా, రాఘవ లారెన్స్ విజయ్‌కాంత్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు.
విజయ్‌కాంత్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. తాజాగా, రాఘవ లారెన్స్ విజయ్‌కాంత్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు.
Venkateswarlu
చిత్ర పరిశ్రమలో మోస్ట్ అండ్ మల్టీ టాలెంటెడ్ కలిగిన అతి కొద్ది మందిలో రాఘవ లారెన్స్ ఒకరు. సైడ్ డ్యాన్సర్‌గా సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆయన నటుడిగా, డైరెక్టర్‌గా, డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా, నిర్మాతగా తన సత్తా చాటుతున్నారు. సొంత సినిమాలు చేస్తూ.. వేరే దర్శకుల సినిమాల్లోనూ పని చేస్తున్నారు. కేవలం సినిమాల్లోనే కాదు.. బయటకు కూడా ఆయన రియల్ హీరో అనిపించుకుంటూ ఉన్నారు. తమిళనాడు వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అవసరం ఉన్న వారికి సాయపడుతున్నారు. కేవలం నిరుపేదలకే కాదు.. చిత్ర పరిశ్రమలోని వారికి కూడా తన వంతు సహాయసహకారాలు అందిస్తున్నారు. లారెన్స్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. విజయ్‌కాంత్ కుమారుడి సినీ జీవితం కోసం తన వంతు సాయం చేస్తానని అన్నారు. ఈ మేరకు ఆయన తన ట్విటర్ ఖాతాలో ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘‘ అందరికీ నమస్కారం. నేను మీ రాఘవ లారెన్స్. మొన్న నేను మా అమ్మతో కలిసి విజయ్ కాంత్ సార్ సమాధి దగ్గరకు వెళ్లాను.
ఆ తర్వాత ఆయన ఇంటికి కూడా వెళ్లాము. విజయ్‌కాంత్ సార్ భార్య, పిల్లలు, విజయ్‌కాంత్ సార్ భార్య వాళ్ల చెల్లెలు అక్కడ ఉన్నారు. అందరం కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నాము. అప్పుడు విజయ్‌కాంత్ సార్ భార్య వాళ్ల చెల్లెలు ఏమందంటే.. షణ్ముఖ పాండి( విజయ్‌కాంత్ కొడుకు)ని చూపిస్తూ.. ‘‘ ఇతడు హీరోగా చేస్తున్నాడు. మాస్టర్ మీరే మొత్తం చూసుకోవాలి’’ అని అంది. ఆ మాటలు నన్ను చాలా బాధించాయి. విజయ్‌కాంత్ ఎంతో మందికి సాయం చేశారు. హీరోలకు కూడా సాయం చేశారు.
సేవా కార్యక్రమాలు చేశారు. అలాంటిది ‘వీళ్లను నువ్వే మంచిగా చూసుకోవాలి’ అన్న ఆమె మాటలు.. చాలా ఇబ్బందిగా అనిపించాయి. ఏదో ఒకటి చేయాలి అని అనిపించింది. రెండు రోజులుగా దాని గురించే ఆలోచిస్తూ ఉన్నాను. ఆ పిల్లల కోసం ఏదైనా చేయాలి. వాళ్లు ఇతర హీరోల సినిమాల్లో గెస్ట్ రోల్ చేస్తున్నారు. ఫైట్లు చేస్తున్నారు. సాంగులు చేస్తున్నారు. విజయ్‌కాంత్ నన్ను కూడా చాలా ఎంకరేజ్ చేశారు. అలాంటి కుటుంబంలో పుట్టిన పిల్లల కోసం ఏదైనా చేయాలి అని అనిపించింది.
దాన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. షణ్ముఖ పాండి సినిమా రిలీజ్ టైంలో ప్రమోషన్లకు ఎంత ఖర్చు అయినా సరే నేను చూసుకుంటాను. వాళ్లు ఒప్పుకుంటే.. అతడి సినిమాలో గెస్ట్ రోల్, సాంగ్, ఫైట్ ఏదో ఒకటి చేస్తాను. విజయ్‌కాంత్ ఎంతో మంది హీరోలకు సాయం చేశారు. అలాంటి ఆయన పిల్లలకు సాయం చేయాలి’’ అని అన్నారు. మరి, రాఘవ లారెన్స్.. విజయ్‌కాంత్ కుమారుడికి సాయం చేస్తాననటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
👏👌
— Christopher Kanagaraj (@Chrissuccess) January 10, 2024