PVR Inox: తెలుగు రాష్ట్రాలకు వర్తించని పీవీఆర్ ఐనాక్స్ డిస్కౌంట్

PVR Inox Discount: నేషనల్ మల్టీప్లెక్స్ చైన్ పీవీఆర్ ఐనాక్స్ ప్రేక్షకులకి ఓ శుభవార్త చెప్పింది.

PVR Inox Discount: నేషనల్ మల్టీప్లెక్స్ చైన్ పీవీఆర్ ఐనాక్స్ ప్రేక్షకులకి ఓ శుభవార్త చెప్పింది.

నేషనల్ మల్టీప్లెక్స్ చైన్ పీవీఆర్ ఐనాక్స్ ఇటీవల ఫిబ్రవరి 23వ తారీఖున ప్రేక్షకులకి డిస్కౌంట్ టికెట్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. అయితే పీవీఆర్ ఐనాక్స్ తెలుగు ప్రేక్షకుల పట్ల కొంచెం వివక్ష చూపుతుందని కొందరు భావిస్తున్నారు. ఈ శుక్రవారం, ఫిబ్రవరి 23, 2024 ‘సినిమా లవర్స్ డే’ సందర్భంగా, సినీ ప్రేమికులు కేవలం 99 రూపాయలకు పీవీఆర్ ఐనాక్స్ థియేటర్లలో తమకు ఇష్టమైన సినిమాలను చూసి ఆనందించవచ్చు. ఈ ఆఫర్ కేవలం భారతీయ సినిమాలకే కాకుండా హాలీవుడ్ చిత్రాలకి వర్తిస్తుంది. అదనంగా, రెక్లైనర్ సీట్లు మరియు ఐమాక్స్ వంటి ప్రీమియం ఫార్మాట్ల పై కూడా మునుపటి రేట్ పైన డిస్కౌంట్ వరిస్తుంది.

అయితే రూ.99 ఆఫర్ తెలుగు రాష్ట్రాల్లో చెల్లదని తన అఫిషియల్ నోట్ లో పీవీఆర్ ఐనాక్స్ ప్రకటించింది. అయితే తెలంగాణలో మాత్రం కొంచెం తేడాతో ఈ డిస్కౌంట్ ఆఫర్ తో ప్రేక్షకులు సినిమాలు చూడవచ్చు. ఫిబ్రవరి 23న తెలంగాణ రాష్ట్రంలోని పీవీఆర్ ఐనాక్స్ థియేటర్లలో నార్మల్ సీట్స్ టికెట్ రేట్ 112 అయితే రిక్లైనర్ సీట్స్ కూడా కొంచెం తక్కువ రేట్ కే దొరుకుతాయి. కానీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలలో ఎలాంటి డిస్కౌంట్ లేకుండా సాధారణ రేట్లకే సినిమాలు ప్రదర్శిస్తారు.
ఇది ఆంధ్రప్రదేశ్ లోని సినీ ప్రేమికులకు ఆగ్రహాన్ని కలిగించింది. ఇలా తేడా చూపించడం చాలా అన్యాయమని, పీవీఆర్ ఐనాక్స్ ను బహిష్కరించాలని సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ఇలాంటి సమస్యలు తలెత్తడం పీవీఆర్ సంస్థకు ఇదే మొదటి సారి కాదు. గతంలో పీవీఆర్ ఐనాక్స్ రూ.699 ధరతో సినిమా పాస్ ను ప్రవేశపెట్టింది, ఈ పాస్ తో ప్రేక్షకులు వీక్ డేస్ లో నెలకు 10 సినిమాలు చూడచ్చు. కానీ ఈ ఆఫర్ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మొత్తం సౌత్ ఇండియాలోనే లేకుండా చేశారు. ఇలా నార్త్ – సౌత్ ఆడియెన్స్ మధ్య తేడా చూపించడంతో పీవీఆర్ ఐనాక్స్ కొత్త వివాదానికి తెరలేపింది.

Show comments