Darshan: దర్శన్ కేసుపై పుష్ప జాలిరెడ్డి షాకింగ్ కామెంట్స్! బయట ఇంత మంచోడా?

గత కొన్ని రోజుల క్రితం కన్నడ స్టార్ దర్శన్ అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో ఏ2 నిందితుడిగా అరెస్టు అయ్యి జైలు జీవితం గడుపుతున్న విషయం తెలిసిందే.అయితే ఈ కేసులో దర్శన్ అరెస్టు పై గత కొద్ది రోజుల క్రితం పుష్ప ఫేమ్ డాలీ ధనుంజయను ప్రశ్నించగా.. అతను స్పందించేందుకు నిరాకరించారు. అయితే తాజాగా నిన్న ఆయన తొలిసారి ఈ కేసు పై స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు.

గత కొన్ని రోజుల క్రితం కన్నడ స్టార్ దర్శన్ అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో ఏ2 నిందితుడిగా అరెస్టు అయ్యి జైలు జీవితం గడుపుతున్న విషయం తెలిసిందే.అయితే ఈ కేసులో దర్శన్ అరెస్టు పై గత కొద్ది రోజుల క్రితం పుష్ప ఫేమ్ డాలీ ధనుంజయను ప్రశ్నించగా.. అతను స్పందించేందుకు నిరాకరించారు. అయితే తాజాగా నిన్న ఆయన తొలిసారి ఈ కేసు పై స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు.

గత కొన్ని రోజుల క్రితం కర్ణాటకలోని అభిమాని రేణుకస్వామి హత్య కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ హత్య కేసులో ప్రధాన నిందుతుడిగా ప్రముఖ ఛాలెంజ్ నటుడు, కన్నడ స్టార్ దర్శన్, ప్రియురాలు పవిత్ర గౌడ్ తో పాటు మరో 15మందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పటికే వీరంతా జైలు జీవితం గుడుపుతున్నారు. అలాగే ఈ కేసులో పలు ఆధారాలు లభ్యం కావడంతో..దర్శనే ఈ హత్య చేయిందని పోలీసులు కూడా బలంగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే దర్శన్ విచారిస్తుండగా.. ఈ కేసుకు సంబంధించి రొజుకొక నిజాలు ఈ మధ్య కాలంలో వెలుగులోకి వచ్చాయి.

మరోవైపు దర్శన్ మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకోవడం కూడా కన్నడ ఇండస్ట్రీలో తీవ్ర సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి దర్శన్ అభిమానులు, కొంతమంది సెలబ్రిటీస్ దర్శన్ కు మద్ధతు తెలుపుతుండగా.. మరి కొందరు నెటిజన్స్, ఇండస్ట్రీ ప్రముఖులు దర్శన్ పై తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. పైగా తప్పు చేసినవారికి కచ్చితంగా శిక్షపడాలని తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈమేరకు తాజాగా పుష్ప నటుడు డాలీ ధనంజయ్ స్పందించి పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

గత కొన్ని రోజుల క్రితం కన్నడ స్టార్ దర్శన్ అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో ఏ2 నిందితుడిగా అరెస్టు అయ్యి జైలు జీవితం గడుపుతున్న విషయం తెలిసిందే.అయితే ఈ కేసులో దర్శన్ అరెస్టు పై గత కొద్ది రోజుల క్రితం పుష్ప ఫేమ్ డాలీ ధనుంజయను ప్రశ్నించగా.. అతను స్పందించేందుకు నిరాకరించారు. అయితే తాజాగా నిన్న అనగా బుధవారం (జూలై10) ఆయన తొలిసారి ఈ కేసు పై స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా డాలీ మాట్లాడుతూ.. ‘తప్పు చేస్తే శిక్ష కచ్చితంగా అనుభవించాలి. అలాగే ముందు పరిస్థితులను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే.. విషాదం జరిగింది,ఒక జీవితం పోయింది, తప్పు కూడా జరిగింది. మరి ఆ వ్యక్తి (రేణుకా స్వామి) తల్లిదండ్రుల ముఖం చూసి, ఆ వ్యక్తి భార్య ముఖం చూసి అయినా న్యాయం చేయాల్సిందే ఎందుకంటే.. చట్టాన్ని మించిన గొప్పవారు ఎవరూ లేరు అని డాలీ ధనుంజయ అన్నారు.

అంతేకాకుండా.. ఈ కేసు బాధితులు మా వాళ్లో, మీ వాళ్లో అయితే, అలాగే నిందితుడు మనలో ఒకరైతే ఎలా ఉంటుంది?  అసలు ఈ విషయం తెలియగానే చాలా షాకింగ్ గా అనిపించింది. అలాగే చాలా ఫీలయ్యాను. ఎందుకంటే.. నేను దర్శన్ గురించి అడిగినప్పుడు, మనస్ఫూర్తిగా అభిమానిస్తున్నా. ఇక్కడ దేనిని సమర్థించలేము , ప్రతిదానికీ ఒక చట్టం ఉంటుంది. దాని వలన ఏం జరగాలి అని ఉంటే అదే జరుగుతుంది. ఇక దీనిని గురించి ఎక్కువగా మాట్లాడిన ప్రయోజనం లేదని అనిపిస్తుంది. ఎందుకంటే.. అక్కడ ఏం జరిగిందో మనలో ఎవరూ చూడలేదు. అంతా చట్టానికే తెలుసు. అయితే అతని (దర్శన్) సోదరుడిగా నేను చెబుతున్నాను, అతని తప్పు ఉంటే శిక్ష పడుతుంది. నేను కూడా ఈ విషయంలో మేధావిని కాదు. కానీ, చాలా ఎమోషనల్ తో మాట్లాడుతున్నాను’ అని ధనుంజయ చెప్పుకొచ్చారు.  మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ధనుంజయ  కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments