అంతా బాగానే ఉంది కానీ రన్ టైం అనౌన్సుమెంట్ తర్వాత..

Pushpa 2 update : బన్నీ సుక్కు కాంబినేషన్ అంటే ముందు నుంచే అంచనాలు భారీగా ఉంటాయి. ఆర్యతో మొదలైన వీరి జర్నీ పుష్ప2 వరకు వచ్చింది. ఊహించని విధంగా పుష్ప పార్ట్ 1 కి మంచి రెస్పాన్స్ దక్కింది. అప్పటినుంచి కూడా పుష్ప 2 మీద డీసెంట్ హైప్ నెలకొన్న మాట వాస్తవం. అది కాస్త ఇప్పుడు వైల్డ్ ఫైర్ ల సోషల్ మీడియాను తగలపెట్టేస్తుంది.

Pushpa 2 update : బన్నీ సుక్కు కాంబినేషన్ అంటే ముందు నుంచే అంచనాలు భారీగా ఉంటాయి. ఆర్యతో మొదలైన వీరి జర్నీ పుష్ప2 వరకు వచ్చింది. ఊహించని విధంగా పుష్ప పార్ట్ 1 కి మంచి రెస్పాన్స్ దక్కింది. అప్పటినుంచి కూడా పుష్ప 2 మీద డీసెంట్ హైప్ నెలకొన్న మాట వాస్తవం. అది కాస్త ఇప్పుడు వైల్డ్ ఫైర్ ల సోషల్ మీడియాను తగలపెట్టేస్తుంది.

బన్నీ సుక్కు కాంబినేషన్ అంటే ముందు నుంచే అంచనాలు భారీగా ఉంటాయి. ఆర్యతో మొదలైన వీరి జర్నీ పుష్ప2 వరకు వచ్చింది. ఊహించని విధంగా పుష్ప పార్ట్ 1 కి మంచి రెస్పాన్స్ దక్కింది. అప్పటినుంచి కూడా పుష్ప 2 మీద డీసెంట్ హైప్ నెలకొన్న మాట వాస్తవం. అది కాస్త ఇప్పుడు వైల్డ్ ఫైర్ ల సోషల్ మీడియాను తగలపెట్టేస్తుంది. ఇప్పటివరకు ఒక్కొక్కటిగా వచ్చిన అప్డేట్స్ అన్ని పీక్స్ లో హైప్ పెంచేసాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ వరల్డ్ వైడ్ గా బాగా స్ప్రెడ్ అవుతుంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్  ని బట్టి పుష్ప గురించి ప్రేక్షకులు ఏ రేంజ్ లో వెయిట్ చేస్తున్నారో చెప్పేయొచ్చు. సో ఇలా భారీ రికార్డ్ టార్గెట్ తో పుష్ప 2 బరిలోకి దిగుతుంది.

ముఖ్యంగా ఫ్యాన్స్ అంతా కూడా పుష్ప రాజ్ యాటిట్యూడ్ కి ఫిదా అయిపోయారు. పార్ట్ 1 లో ఉన్న ఆ స్వాగ్ , గ్రేస్ ఒక్కొక్కరిని థియేటర్ లో విజిల్స్ వేయించింది. ఇక పార్ట్ 2 లో సైతం అంతకుమించిన యాటిట్యూడ్ ఉంటుందని ట్రైలర్ లో చూపించేసారు. బన్నీ పుష్ప రాజ్ క్యారెక్టర్ లో జీవించి ఆడియన్స్ ను మెప్పించాడు. ఇక ఇప్పుడు మరోసారి పూనకాలు తెప్పించడానికి రెడీ అవుతున్నాడు. అటు సుకుమార్ షూటింగ్ కు కూడా ప్యాకప్ చెప్పేశాడు. దీనితో నిన్న మొన్నటివరకు కాస్త టెన్షన్ పడినవారంతా హమ్మయ్య అనుకుంటున్నారు. అటు రెండు భారీ ఈవెంట్స్ కూడా అదిరిపోయేలా చేశారు. సౌత్ లో కూడా ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. ఏముంది ఇక అంతా స్మూత్ గానే జరిగిపోతుంది. కలెక్షన్స్ లెక్కపెట్టుకోవడమే లేట్ అని అనుకున్నారు. నిజమే ఇంతవరకు అంతా బాగానే ఉంది. పుష్ప 2 కి అన్ని మంచి శకునాలే అని అంతా అనుకుంటున్నారు. కానీ నిన్న మూవీ రన్ టైం అనౌన్సుమెంట్ తో కొత్త ప్రశ్నలు మొదలయ్యాయి.

మూవీ రన్ టైం మొత్తం మూడు గంటల 21 నిమిషాలు. దీనితో మూవీ లెంగ్త్ ఎక్కువ అంటూ టాక్ వచ్చింది. ఇప్పటివరకు  ఆశించిన స్థాయిలో సినిమా ఉంటే పర్లేదు. కానీ ఏదైనా తేడా వస్తే మాత్రం సీన్ రివర్స్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. పైగా ఓ వర్గం నుంచి ఎక్కడో దీనికి కాస్త నెగిటివిటి కూడా ఉంది. వీటి అన్నిటిని తట్టుకుని గ్రిప్పింగ్ సీన్స్ తో కనుక.. హిట్ కొట్టేస్తే దీనికి తిరుగు ఉండదు. ఎంత సినిమా మీద ఇష్టం ఉన్నా కానీ మూడున్నర గంటల సేపు ఆడియన్ మూవీ చూడాలంటే.. కచ్చితంగా దానిలో చాలా ఇంటెన్స్ ఉండాలి. ఏ ఒక్క ఫ్రేమ్ తేడా కొట్టిన మొదటికే మోసం వస్తుంది. అటు నిర్మాతలు మాత్రం సినిమా మూడున్నర గంటలైనా.. రెండున్నర గంటల లానే అనిపిస్తుందని.. ఎక్కడ బోర్ కొట్టదని చెప్తున్నారు. ఒకవేళ అదే కనుక నిజం అయితే మూడున్నర గంటల ఆ వైబ్ కు పోతారు మొత్తం పోతారు.. అని చెప్పడం కంటే అవుతాయి థియేటర్స్ బద్దలవుతాయి అని చెప్పడం కరెక్ట్. ఇక పుష్పరాజ్ ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments