Krishna Kowshik
జనవరి 12న విడుదలైన సినిమాల్లో ఒకటి మహేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కిన గుంటూరు కారం. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కనకవర్షం కురిపిస్తోంది. మహేష్ బాబు స్టామినాను నిరూపించిన చిత్రంగా నిలిచింది. ఈ మూవీ హిట్ టాక్ రావడంతో ప్రెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్.
జనవరి 12న విడుదలైన సినిమాల్లో ఒకటి మహేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కిన గుంటూరు కారం. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కనకవర్షం కురిపిస్తోంది. మహేష్ బాబు స్టామినాను నిరూపించిన చిత్రంగా నిలిచింది. ఈ మూవీ హిట్ టాక్ రావడంతో ప్రెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్.
Krishna Kowshik
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వచ్చిన మూడవ చిత్రం గుంటూరు కారం. సంక్రాంతి రేసులో భాగంగా జనవరి 12న విడుదల ఈ చిత్రం కలెక్షన్లలో రికార్డులు సృష్టిస్తోంది. తనదైన మార్క్ సెంటిమెంట్‌తో ప్రేక్షకులను థియేటర్లకు రాబడుతున్నారు గురూజీ త్రివిక్రమ్. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ 94 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టిందని యూనిట్ చెబుతోంది. మదర్ అండ్ సన్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యింది. చాలా రోజుల తర్వాత మహేష్ మాస్ యాంగిల్లో, ఊర మాస్ స్టెప్పులతో రెచ్చిపోయాడు. ఆయన నటన గురించి చెప్పనక్కర్లేదు. అయితే ఈ మూవీ సక్సెస్ మీట్ తాజాగా నిర్వహించింది చిత్ర యూనిట్.
ఈ సందర్భంగా గుంటూరు కారం మూవీ నైజాం డిస్ట్రిబ్యూటర్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ఈ సినిమా నిర్మాత నాగవంశీ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. నాగ వంశీ మాట్లాడతూ.. ‘గుంటూరు కారం యూనిట్‌ను ఎంతో ప్రేమించిన మీడియా మిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సినిమాను జనాలు బాగా ఆదరించారు. ఫస్ట్ డే కలెక్షన్స్.. మేము ఆశించిన దాని కన్నా ఎక్కువే వచ్చాయి. ఫ్యామిలీ సెంటిమెంట్‌తో ఒక తెలుగు రీజనల్ మూవీ చాన్నాళ్ల తర్వాత రిలీజ్ అయ్యింది. స్పెషల్ షో పడిన కొన్ని చోట్ల ఈ సినిమాకు మిక్స్ డ్ రివ్యూస్ వచ్చాయి. కానీ నిన్న ఫస్ట్ షో, సెకండ్ షో వచ్చేటప్పటికీ ఆ టాక్ కూడా పాజిటివ్‌గా మారింది. చక్కగా ఫ్యామిలీతో వచ్చి పండుగ రోజు ఎంజాయ్ చేయాల్సిన సినిమా ఇది’ అంటూ పేర్కొన్నారు.
‘పండగక్కి కుటుంబంతో సహా వచ్చి త్రివిక్రమ్, మహేష్ సినిమా ఎంజాయ్ చేయండి. పాటలు, ఫైట్స్, సెంటిమెంట్, కామెడీ అన్ని ఎలిమెంట్స్ ఉన్న ప్రొపర్ పండుగ సినిమా ఇది. దయచేసి మిగిలిన ఏ రూమర్స్ నమ్మకుండా మీరు థియేటర్‌కు వచ్చి సినిమా చూడండి. మీరు ఎంటర్ టైన్ అవుతారన్న గ్యారెంటీ నాది’అని నాగవంశీ తెలిపారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. స్పెషల్ షో అయిపోయాక ఆడియెన్స్, సోషల్ మీడియా నుండి మిక్స్ డ్ టాక్స్ వచ్చాయని, దీన్ని క్రాస్ చెక్ చేసుకోవడానికి మళ్లీ సినిమాను చూశానని అన్నారు. ఫఖ్తు మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ బేస్ చేసుకుని తీసిన సినిమా ఇదని, ఇది షో బై షో నెగిటివ్ వైబ్స్ వచ్చినా థియేటర్లు వెళ్లి పాజిటివ్ టాక్‌తో బయటకు వస్తున్నారని దిల్ రాజు పేర్కొన్నారు. మిక్స్ డ్ టాక్ వచ్చిన అనేక సినిమాలు కూడా చాలా హిట్ అయ్యాయన్నారు. సినిమాను ఎంజాయ్ చేస్తున్నారని పేర్కొన్నారు.