Tirupathi Rao
Jai Hanuman- Prashanth Varma: శ్రీరామనవమి సందర్భంగా జై హనుమాన్ మూవీ నుంచి ప్రశాంత్ వర్మ ఒక ప్రీ లుక్ ని విడుదల చేశాడు. అయితే ఆ ప్రీ లుక్ లో కథ గురించి క్లారిటీ ఇచ్చేశాడు గమనించారా?
Jai Hanuman- Prashanth Varma: శ్రీరామనవమి సందర్భంగా జై హనుమాన్ మూవీ నుంచి ప్రశాంత్ వర్మ ఒక ప్రీ లుక్ ని విడుదల చేశాడు. అయితే ఆ ప్రీ లుక్ లో కథ గురించి క్లారిటీ ఇచ్చేశాడు గమనించారా?
Tirupathi Rao
ప్రశాంత్ వర్మ.. ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రియేట్ చేసిన రికార్డుల గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు. అతి తక్కువ బడ్జెట్ తో హనుమాన్ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. తన టేకింగ్ కి తెలుగు ప్రేక్షకులే కాదు సినిమా లవర్స్ అంతా ఫిదా అయిపోయారు. ఆ మూవీకి బాక్సాఫీస్ వద్ద కూడా అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి. మరోవైపు ఓటీటీలో కూడా అద్భుతాలు సృష్టించింది. అయితే జై హనుమాన్ కి ఈ ఉత్సాహం రెట్టింపు అవుతుంది అంటున్నారు.
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఒక సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో హనుమాన్ కేవలం ట్రైలర్ మాత్రమే. తర్వాత మరింత మంది సూపర్ హీరోలు రాబోతున్నారు. అలాగే హనుమాన్ కి సీక్వెల్ కూడా ఉంది. అదే జై హనుమాన్ మూవీ. ఇప్పటికే హనుమాన్ క్లైమ్యాక్స్ లో ఆ కథకు సంబంధించి చిన్ లైన్ చెప్పేసి వదిలేశాడు. ఇప్పుడు జై హనుమాన్ ప్రీ లుక్ తో ప్రశాంత్ వర్మ మూవీపై అంచనాలు పెంచడం మాత్రమే కాదండో.. కథ గురించి కూడా పిచ్చ క్లారిటీ ఇచ్చేశాడు.
జైహనుమాన్ ప్రీ లుక్ ని తెలుగు ప్రేక్షకులు అందరూ చూసేశారు. ఆ పోస్టర్ లో రాముడికి హనుమంతుడు ప్రామిస్ చేస్తున్న షాట్ ని చూపించారు. అయితే అందులో ఏముంది అని సింపుల్ గా కొట్టి పారేయకండి. ఇందులోనే అసలు కథ మొత్తం ఉందనే విషయం చాలా మందికి తెలియలేదు. మనకు హనుమాన్ సినిమాలో ప్రశాంత్ వర్మ చాలా తక్కువ కథ చెప్పాడు. ఒక చిన్న ఊరు.. ఆ ఊరిలో ఉండే చిన్న చిన్న సమస్యలు.. ఆ సమస్యలు తీర్చేందుకు ఒక కుర్రాడు. అయితే సినిమాలో అసలు కథ ప్రారంభం అవుతున్న సమయంలోనే ఎండ్ కార్డ్ పడిపోయింది. జై హనుమాన్ లో చాలా పెద్ద కథ ఉండబోతోంది.
హనుమాన్ లో ఒక చిన్న సూపర్ హీరోని, విభీషణుడిని మాత్రమే చూపించారు. కానీ, జై హనుమాన్ లో ఏకంగా ఆ హనుమంతుడే రాబోతున్నాడు. రాముడికి ఇచ్చిన మాట కోసం కాబట్టి.. ఏదో ఒక చోట ఆ రాముడిని కూడా చూపించాల్సి ఉంటుంది. ఇప్పటికే హనుమంతు సూపర్ హీరోగా ఎస్టాబ్లిష్ చేశాడు. ఫస్ట్ పార్ట్ లోనే విలన్ ని నెక్ట్స్ లెవల్లో చూపించాడు. సీక్వెల్ లో హనుమంతుడి మీద పోరాటం కాబట్టి కచ్చితంగా రాక్షస మూకతో పోరాటాలు పకడ్బందీగానే ప్లాన్ చేసి ఉంటాడు. ప్రశాంత్ వర్మ తన స్టైల్ లో జై హనుమాన్ ని ఇంత బిగ్ ప్లాట్ తో తెరకెక్కిస్తే.. పాన్ ఇండియా లెవల్లో సెన్సేషన్ అవుతుంది. ఆ నమ్మకాన్ని ప్రశాంత్ వర్మ ఈ ప్రీ లుక్ తో ఇచ్చేశాడు. పైగా జీవితాంతం గుర్తుండిపోయే సినిమా అందిస్తానని మాటిచ్చాడు కూడా. ఒక్క పోస్టర్ తోనే సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాడు. మరి.. జై హనుమాన్ ప్రీలుక్ మీకెలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.