P Krishna
Jai Hanuman Movie New Poster: ఈ ఏడాది సంక్రాంతి బరిలో స్టార్ హీరోలతో పోటీ పడుతూ చిన్న సినిమాగా రిలీజ్ అయిన ‘హనుమాన్’ పాన్ ఇండియా వైడ్ గా అద్భుత విజయం సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ ‘జై హనుమాన్’ తెరకెక్కిన్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ.
Jai Hanuman Movie New Poster: ఈ ఏడాది సంక్రాంతి బరిలో స్టార్ హీరోలతో పోటీ పడుతూ చిన్న సినిమాగా రిలీజ్ అయిన ‘హనుమాన్’ పాన్ ఇండియా వైడ్ గా అద్భుత విజయం సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ ‘జై హనుమాన్’ తెరకెక్కిన్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ.
P Krishna
తెలుగు ఇండస్ట్రీలో ఇటీవల చిన్న సినిమాలకు మంచి ఆధరణ లభిస్తుంది. బలమైన కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమాలైన ప్రేక్షకులు ఆదరిస్తారని పలు సినిమాలు రుజువు చేశాయి. ప్రశాంత్ వర్మ తెలుగు యండ్ డైరెక్టర్. 2018 లో అ! మూవీతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కల్కి, జాంబిరెడ్డి సినిమాలతో ప్రేక్షకులకు కొత్త అనుభూతి అందించారు. తక్కువ బడ్జెట్ తో సూపర్ హిట్స్ అందించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ ‘హనుమాన్’ బ్లాక్ బస్టర్ విజయం దక్కించుకుంది. తన టేకింగ్ తో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాడు ప్రశాంత్ వర్మ. ఇదే ఉత్సాహంతో హునుమాన్ సీక్వెల్ ‘జై హనుమాన్’ మూవీ తెరకెక్కిస్తున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా ఈ మూవీ నుంచి ఓ అద్భుతమైన పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ చూస్తుంటే ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. వివరాల్లోకి వెళితే..
టాలీవుడ్ లో ఈ మధ్య ఎలాంటి భారీ తారగణం లేకుండా వస్తున్న చిన్న సినిమాలు మంచి సక్సెస్ అందుకోవడమే కాదు కలెక్షన్లు కూడా భారీగానే రాబడుతున్నాయి. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా మహేష్ బాబు, వెంకటేశ్, నాగార్జున లాంటి స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయి. స్టార్ హీరోల మూవీలకు పోటీగా ‘హనుమాన్’ సినిమా రిలీజ్ అయ్యింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జ నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్ గా అద్భుత విజయం సొంతం చేసుకోవడమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీకి సీక్వెల్ గా ‘జై హనుమాన్’ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టు శ్రీరామ నవమి సందర్భంగా రిలీజ్ అయిన పోస్టర్ చూస్తుంటే.. రాముడు, హనుమంతుడు ఇచ్చిపుచ్చుకున్న వాగ్దానంగా కనిపిస్తుంది. హనుమాన్ మూవీలో కొన్ని సీన్లు చూస్తుంటే ఒక రకమైన అనుభూతి కలుగుతుంది. సినిమాలో చివరి 20 నిమిషాలు అద్భుతాన్ని ఆవిష్కరించాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఆ సన్నివేశాలు చూస్తుంటే రోమాలు నిక్కబొడుస్తాయి. కేవలం చివరి సన్నివేశాల కోసమే సినిమా ఎన్నిసార్లైనా చూడొచ్చు అని టాక్ వచ్చింది.
‘హనుమాన్’ సినిమాలో హనుమంతుడి విశ్వరూపం చూపించారు. ‘జై హనుమాన్’ పేరుతో ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందిస్తున్నారు ప్రశాంత్ వర్మ. సెకండ్ పార్ట్ లో హనుమంతుడి పాత్ర ఎక్కువగా ఉండబోతుందని అందరూ భావిస్తున్నారు. ట్విస్ట్ ఏంటేంటే.. పార్2 శ్రీరాముడి పాత్రకు కూడా ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తుంది. త్రేతాయుగంలో రాముడు-హనుమంతుడు ఇచ్చిపుచ్చుకున్న వాగ్దానం కలిగియుగంలో ఎలా నిలబెట్టుకున్నారు? అనే కథాంశంతో మూవీ నడుస్తుందని ఇండస్ట్రీ టాక్. అయితే ఆ వాగ్దానం ఏంటీ? అందుకోసం సాక్షాత్తూ ఆ శ్రీరాముడే భువిపైకి ఎందుకు వస్తాడు? ఆయన విశ్వరూపం చూపించబోతున్నారు? రాముడు-హునమంతుడు ఏం చేశారు? హీరో పాత్ర ఎలా ఉండబోతుంది.. అనేది వెండితెరపై చూస్తే మైండ్ బ్లాంక్ కావడం ఖాయం అంటున్నారు సినీ ప్రేమికులు. హనుమాన్ మూవీలో చివరి పది నిమాషాల్లో హనుమంతుడుని తెరపై ఏ రేంజ్ లో చూపించారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
ఇప్పటి వరకు వెండి తెరపై ఈ రేంజ్ లో హనుమంతుడిని చూపించిన సందర్భాలు లేవు. ఆ సీన్లు చూస్తేనే రోమాలు నిక్కబోడుస్తే.. ఇప్పుడు శ్రీరాముడు, హనుమంతుడు, విభీషనుడు ఇలాంటి పాత్రలు తెరపై కనిపిస్తే ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. జై హనుమాన్ మూవీలో రాములవారి విశ్వరూపం చూపిస్తారని టాక్ నడుస్తుంది. ఓ వైపు సూపర్ మాన్ గా తేజ సజ్జ.. మరోవైపు డివోషన్ ని ప్రతిభింభిస్తూ దేవుళ్ల పాత్రలు.. గ్రాఫిక్స్ ఏ రేంజ్ లో చూపించబోతున్నారో ఆడియన్స్ ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఇదే పాయింట్ తో రాముడి పాత్ర తాలూకు స్పాన్ ని ‘జై హనుమాన్’ కోసం ప్రశాంత్ వర్మ పెంచుకుంటూ వెళ్తున్నారు. నిన్న రిలీజ్ చేసిన పోస్టర్ పాన్ ఇండియా అభిమానులను ఆకట్టుకోవడానికి ప్రశాంత్ వర్మ మంచి ప్లాన్ మీదే ఉన్నట్లు తెలుస్తుంది. శ్రీరాముడి పాత్రలో ఎవరు కనిపిస్తారు అన్నది మరో ఆసక్తికర అంశం. అయితే హనుమాన్ మూవీలో ఆంజనేయుడిని గ్రాఫిక్స్ లో చూపించారు.. మరి శ్రీరాముడిని అలాగే గ్రాఫిక్స్ లో చూపిస్తారా? లేద ఎవరైనా స్టార్ నటుడు నటిస్తారా? అనేది సస్పెన్స్. ఏది ఏమైనా నిన్న రిలీజ్ చేసిన పోస్టర్ మాత్రం అదుర్స్ అంటున్నారు సినీ ప్రేమికులు.