Prashanth Varma-ChatGPT, Midjourney For Hanuman: హనుమాన్‌ VFX షాట్స్‌ కోసం చాట్‌ GPT, AI వాడాం: ప్రశాంత్‌ వర్మ

HanuMan: హనుమాన్‌ VFX షాట్స్‌ కోసం చాట్‌ GPT, AI వాడాం: ప్రశాంత్‌ వర్మ

ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్‌ సినిమా సూపర్‌హిట్‌ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ క్రమంలో సినిమాలో వాడిన టెక్నాలజీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రశాంత్‌ వర్మ. ఆ వివరాలు..

ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్‌ సినిమా సూపర్‌హిట్‌ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ క్రమంలో సినిమాలో వాడిన టెక్నాలజీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రశాంత్‌ వర్మ. ఆ వివరాలు..

హనుమాన్‌.. ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ పేరే వినిపిస్తోంది. ఎన్నో అవాంతరాలను దాటుకుని.. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది హనుమాన్‌ సినిమా. మొదటి రోజు నుంచే సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకుని.. దూసుకుపోతుంది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజే 21 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసినట్లు సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 55 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ఫస్ట్‌ డేనే ఇంత భారీ కలెక్షన్స్‌ సాధించడం సంచలనంగా మారింది. ఇక సినిమా చూసిన వారు.. వీఎఫ్‌ఎక్స్‌, గ్రాఫిక్స్‌ వర్క్‌ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.

అంతేకాక హనుమాన్‌ సినిమాలో కొన్ని సీన్లు చూస్తే.. గూస్‌బంప్స్‌ వచ్చాయని అంటున్నారు. హనుమాన్‌ సినిమాలో గ్రాఫిక్స్‌ చూసిన తర్వాత మరోసారి ఆదిపురుష్‌ దర్శకుడు ఓం రౌత్‌ని ఏకి పారేస్తున్నారు ప్రేక్షకులు. 400 వందల కోట్ల బడ్జెట్‌.. ఆ తర్వాత మరో 2 వందల కోట్లతో ఔం రౌత్‌ పరమ చెత్తగా ఆదిపురుష్‌ సినిమాను తెరకెక్కించారని.. అంత బడ్జెట్‌ ప్రశాంత్‌ వర్మకు ఇస్తే.. కేవలం 100-200 కోట్ల బడ్జెట్‌లోనే ప్రభాస్‌తో బ్లాక్‌ బాస్టర్‌ సినిమా తీస్తాడు అని ప్రశాంత్‌ వర్మ పనితనం మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. హనుమాన్‌ వీఎఫ్‌ఎక్స్‌, గ్రాఫిక్‌ వర్క్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటున్నారు ప్రేక్షకులు.

ఈ క్రమంలో హనుమాన్‌ సినిమా ప్రయోషన్స్‌ సందర్భంగా ప్రశాంత్‌ వర్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘హనుమాన్‌ గ్రాఫిక్స్‌ వర్క్‌ కోసం తాము వాడిన టెక్నాలజీ గురించి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. వందల కోట్ల భారీ బడ్జెట్‌తో సినిమాలు తెరకెక్కించే వాళ్లు వీఎఫ్‌ఎక్స్‌, గ్రాఫిక్స్‌ వర్క్‌ కోసం పెద్ద పెద్ద కంపెనీలను తీసుకుంటారు. కానీ మాకు అంత బడ్జెట్‌ లేదు. దాంతో మేం స్టార్టప్‌ కంపెనీలను అప్రోచ్‌ అయ్యాం’’ అని చెప్పుకొచ్చారు.

‘‘అలా అని వాళ్ల టాలెంట్‌ని తక్కవ చేయాల్సిన అవసరం లేదు. మాకున్న బడ్జెట్‌లో వాళ్లు ది బెస్ట్‌ ఔట్‌పుట్‌ ఇచ్చారు. అంతేకాక కొత్తగా వస్తోన్న టెక్నాలజీ చాట్‌ జీపీటీ, ఏఐ, మిడ్‌జర్నీ వంటి టెక్నాలజీలతో హనుమాన్‌ వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌ తెరకెక్కించాము’’ అని చెప్పుకొచ్చారు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. ఇప్పటి వరకు చాట్‌జీపీటీ అంటే టెక్‌ జాబ్స్‌కు అన్నట్లుగానే అందరూ భావించారు. కానీ వాటితో ఎలాంటి అద్భుతాలు చేయవచ్చో.. ప్రశాంత్‌ వర్మ హనుమాన్‌ సినిమాతో నిరూపించినట్లు అయ్యింది.

Show comments