Hanuman: హనుమాన్‌ ఆపాలని కుట్ర! దర్శకుడు ప్రశాంత్‌ చెప్పిన నిజాలు!

హమానున్‌ సినిమాపై మొదటి నుంచి పాజిటివ్‌ బజ్‌ ఉంది. తాజాగా, విడుదల అయిన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. సినిమా జనవరి నెలలో విడుదల కానుంది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

హమానున్‌ సినిమాపై మొదటి నుంచి పాజిటివ్‌ బజ్‌ ఉంది. తాజాగా, విడుదల అయిన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. సినిమా జనవరి నెలలో విడుదల కానుంది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువగా ‘హనుమాన్‌’ పేరు వినిపిస్తోంది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా గత కొద్దిరోజుల నుంచి వివాదాల్లో నిలుస్తోంది. సంక్రాంతికి పోటీ విషయంలో ఈ వివాదం నడుస్తోంది. ఈ వివాదంపై తాజాగా, చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ వర్మ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో యాంకర్‌ ఇన్‌ డైరెక్ట్‌ గా సంక్రాంతి బరిలో ‘హనుమాన్‌’ వివాదం గురించి ప్రశ్న వేశాడు. ‘‘జూబ్లిహిల్స్‌ రోడ్డు మీదకు ఓ కుర్రాడు రోడ్డు ఖాళీగా ఉందని వచ్చాడు.

అదే టైంలో నాలుగు కార్లు, రెండు బైకులు వచ్చాయి. నేను ముందు వచ్చానని సెంటర్‌ లో ఉంటాడా? పక్కకు వెళ్లిపోతాడా?’’ అని అడిగాడు. ఇందుకు ప్రశాంత్‌ వర్మ ఏ మాత్రం ఆలోచించకుండా సమాధానం ఇస్తూ.. ‘‘ నేనైతే ఉంటాను సార్‌. అది సైకిల్‌ అయినా సరే.. ఏదైనా సరే.. సైకిల్‌ కు ఎక్కువ పవర్‌ ఉండొచ్చు కదా.. సైకిల్‌ తో గుద్దితే కారుకు సొట్టపడొచ్చు కదా.. రిస్క్‌ లేనిదే రివార్డు లేదు. నేను ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ పెట్టుకుని హ్యాపీగా ఉండొచ్చు. సినిమా పరిశ్రమలోకి రావటమే పెద్ద రిస్క్‌.

నేను అటెంప్ట్ చేసిన జానర్‌ లు అన్నీ రిస్కే.. నేను సేఫ్‌ గేమ్‌ ఆడలేదు. చిత్ర పరిశ్రమలో రిస్క్‌ తీసుకోకపోవటమే రిస్క్‌. సేఫ్‌ గేమ్‌ ఆడితే దొరికేస్తాము. ఎంత రిస్క్‌ చేస్తే అంత మంచిది. సంక్రాంతికి మూడు సినిమాలు ఆడతాయి. తేజ కొంచెం టెన్షన్‌ పడుతున్నాడు. నేను ఆశావాదిని. చూద్దాం ఏం జరుగుతుందో.. తేజ నిరాశావాది.. నేను ఆశవాది.. మా ప్రొడ్యూసర్‌ బొంబాస్టిక్‌.. ఆయన నాకంటే ఎక్కువగా సినిమాను నమ్ముతున్నాడు. హిందీ వాళ్లు ఇంకా ఎక్కువగా నమ్ముతున్నారు.

మా సినిమా పోటీగా వస్తున్నందుకు కొంతమందికి కోపంగా ఉంది. నేను దాన్ని ఫేస్‌ చేస్తున్నాను. నేను చాలా ఫీల్‌ అయ్యాను. సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ నన్ను బూతులు తిడుతున్నారు. నాకు ఎవరితో వెళ్లి తిట్టించుకోవటం అలవాటు లేదు. నేను ఎవర్నీ ఇబ్బంది పెట్టను నా పని నేను చేసుకుంటూ ఉంటాను. నేను వాళ్లను మార్చలేను కాబట్టి.. నేను మెచ్యూర్‌ అయ్యాను. నేను దాన్ని పాజిటివ్‌ వేలో తీసుకుంటున్నాను. సినిమాను నెగిటివ్‌ చేసే అవకాశం ఉంది. సెన్సార్‌ విషయంలో అడ్డంకులు వస్తే..

ఇన్‌ఫ్లుయెన్స్‌ ఉపయోగించి సాల్వ్‌ చేశాం. అది ఎవరు క్రియేట్‌ చేశారో తెలీదు. ఎవరు ఆపాలని చూస్తున్నారో తెలీదు. కొంతమంది అడ్డంకులు కలిగిస్తున్నారు. నా దృష్టికి వచ్చింది. వెళ్లి గొడవ పెట్టుకోలేము కదా.. నాకున్న గుడ్‌విల్‌ను దీనికి వాడేస్తున్నాను.’’ అని అన్నారు. మరి, హనుమాన్‌ సినిమాపై మీ అంచనాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments