‘ప్రసన్నవదనం’లో సుహాస్‌కి ఉన్న ‘ఫేస్ బ్లైండ్‌నెస్’ గురించి మీకు తెలియని నిజాలు

ప్రసన్న వదనం మూవీలో హీరో సుహాస్ కి ఉన్న ఫేస్ బ్లైండ్ నెస్ గురించి మీకు తెలుసా? ఈ వ్యాధి ఎందుకొస్తుందో తెలుసా? ఈ వ్యాధి లక్షణాలు ఏంటి? ఈ వ్యాధికి చికిత్స ఉందా? లేదా? వంటి వివరాలు మీ కోసం.

ప్రసన్న వదనం మూవీలో హీరో సుహాస్ కి ఉన్న ఫేస్ బ్లైండ్ నెస్ గురించి మీకు తెలుసా? ఈ వ్యాధి ఎందుకొస్తుందో తెలుసా? ఈ వ్యాధి లక్షణాలు ఏంటి? ఈ వ్యాధికి చికిత్స ఉందా? లేదా? వంటి వివరాలు మీ కోసం.

ప్రసన్న వదనం మూవీలో సుహాస్ ఫేస్ బ్లైండ్ నెస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతుంటారు. ఫేస్ బ్లైండ్‌నెస్ ని శాస్త్రీయంగా ప్రోసో పగ్నోషియా అని అంటారు. ఇదొక నాడి సంబంధితమైన వ్యాధి. దీని వల్ల ముఖాలను గుర్తుపట్టలేరు. బాగా తెలిసిన వాళ్ళ ముఖాలను కూడా గుర్తుపట్టలేరు. చూడగలరు కానీ ముఖాలను గుర్తుపట్టలేరు. స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇలా ఎవరైనా ఎంత తెలిసినప్పటికీ గుర్తుపట్టలేరు. అదే ఈ ఫేస్ బ్లైండ్‌నెస్ లక్షణం. ఇందులో రెండు రకాలున్నాయి. మొదటిది డెవలప్మెంటల్ ప్రోసో పగ్నోషియా, రెండవది అక్వైర్డ్ ప్రోసో పగ్నోషియా. మొదటి రకమైన డెవలప్మెంటల్ ప్రోసో పగ్నోషియా అనేది బాల్యం ప్రారంభంలో మొదలై జీవితాంతం ఉంటుంది. అయితే ఈ వ్యాధి జనాభాలో 2 నుంచి 2.5 శాతం మందిని ప్రభావితం చేస్తుందని అంటున్నారు. రెండో రకం అయిన అక్వైర్డ్ ప్రోసో పగ్నోషియా అనేది బ్రెయిన్ ఇంజ్యూరీ వల్ల వస్తుంది. ముఖ్యంగా స్ట్రోక్, బాధాకరమైన మెదడు గాయం,   అల్జీమర్స్ లేయా పార్కిన్సన్స్ వంటి న్యూరోడీజనరేటివ్ వ్యాధుల వల్ల వస్తాయి.

ఫేస్ బ్లైండ్ నెస్ లక్షణాలు:

ఈ వ్యాధి వల్ల కుటుంబ సభ్యులు, క్లోజ్ ఫ్రెండ్స్, లవర్ ని గుర్తుపట్టడంలో స్ట్రగుల్ అవుతారు. అద్దంలో తన ముఖం తాను చూసుకుని గుర్తుపట్టడానికి కూడా ఇబ్బంది పడతారు. కళ్ళు, ముక్కు, నోరు వంటి వాటిని కూడా గుర్తుపట్టలేరు. అంతకు ముందు కలిసిన వారి ముఖాలను కూడా గుర్తుపట్టలేరు. అప్పుడే పరిచయం అయిన వాళ్ళని, ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వాళ్ళని గుర్తుపట్టలేరు.  

ఫేస్ బ్లైండ్ నెస్ కి కారణాలు:

ఈ డెవలప్మెంటల్ ఫేస్ బ్లైండ్ నెస్ ఎందుకొస్తుంది అనే విషయం ఖచ్చితంగా అర్థం కాకపోయినప్పటికీ జన్యుపరమైన కాంపోనెంట్ తో సంబంధం ఉందని చెబుతున్నారు. ఇది తరచుగా కుటుంబాల్లో నడుస్తుందని అంటున్నారు. అక్వైర్డ్ ఫేస్ బ్లైండ్ నెస్ అనేది మెదడులోని ముఖాలను గుర్తుపట్టే నిర్దిష్ట ఏరియాల్లో డ్యామేజ్ అవ్వడం వల్ల వస్తుంది.

వ్యాధి నిర్ధారణ: 

ప్రోసో పగ్నోషియా వచ్చిందో లేదో అనే విషయాన్ని న్యూరాలజిస్ట్ లేదా న్యూరోసైకాలజిస్ట్ నిర్ధారిస్తారు. క్లినికల్ ఇంటర్వ్యూస్ ద్వారా ఆ వ్యక్తి యొక్క చరిత్ర, లక్షణాలు వంటి సమాచారాన్ని సేకరిస్తారు. ఆ తర్వాత కాగ్నిటివ్ టెస్టులు నిర్వహిస్తారు. పలు టాస్కులు, కొలమానాల ద్వారా రోగి ముఖాలను గుర్తించగల్గుతున్నారా లేదా అని చూస్తారు.   

చికిత్స:

  • ప్రస్తుతానికి ప్రోసో పగ్నోషియాకి చికిత్స అనేది లేదు. కానీ కొన్ని స్ట్రాటజీస్ ద్వారా ఈ వ్యాధి కండిషన్ ని మేనేజ్ చేయవచ్చు.
  • వాయిస్, నడక, సందర్భానుసార సమాచారం వంటి వాటి వల్ల ఈ వ్యాధికి గురైన వాళ్ళు మనుషులను గుర్తుపట్టచ్చు.
  • స్మార్ట్ ఫోన్ యాప్స్, కళ్ళకి ధరించే కొన్ని డివైజ్ లు వంటి టెక్నాలజీ సహాయంతో ముఖాలను గుర్తించవచ్చు. ఈ వ్యాధి సోకిన వాళ్ళు ఇటువంటి టెక్నాలజీ సహాయంతో ఈ సమస్యను అధిగమిస్తున్నారు.
  • కాగ్నిటివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా ముఖాలను గుర్తించే ప్రక్రియ మీద దృష్టి సారిస్తే ముఖాలను గుర్తించే స్కిల్స్ ని ఇంప్రూవ్ చేయవచ్చునని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.

డైలీ లైఫ్ లో ఎంత ప్రభావం చూపిస్తుంది?:

  • ఫేస్ లని గుర్తించలేకపోవడం వల్ల సోషల్ ఛాలెంజెస్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. సమాజంలో మనుషులతో ఇంటరాక్ట్ అవ్వడం, సంబంధాలు కొనసాగించడం వంటి విషయాల్లో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
  • వృత్తిపరమైన చిక్కులు ఉంటాయి. కెరీర్ పరంగా ఛాలెంజెస్ ఉంటాయి. ఫేస్ టూ ఫేస్ ఇంటరాక్షన్ ఉండే జాబ్స్ అయితే ఇబ్బందులు తప్పవు.
  • ఈ వ్యాధి వల్ల మానసికంగా ప్రభావితమవుతారు. తెలిసిన వ్యక్తుల ముఖాలను గుర్తించలేకపోతున్న బాధలో ఫ్రస్ట్రేషన్, ఒంటరిగా ఉండడం, ఆందోళన వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.

పరిశోధన, అవగాహన:

ప్రోసో పగ్నోషియా మీద పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ వ్యాధి రావటానికి గల ముఖ్య కారణాలను అర్థం చేసుకోవడానికి.. అలానే ప్రభావితం చేసే అంశాల గురించి లోతుగా అధ్యయనాలు జరుగుతున్నాయి. అలానే ఈ వ్యాధి సోకిన వారికి నిరుత్సాహపడకుండా వారిలో ఆందోళన తగ్గించి, సపోర్ట్ ఇచ్చే దాని మీద అవగాహన పెంచుతున్నారు. 

ఫైనల్ గా ఈ ఫేస్ బ్లైండ్ నెస్ కి చికిత్స లేదు. ఇది వచ్చిన వాళ్ళు లైఫ్ లో ఛాలెంజెస్ ని ఫేస్ చేయాల్సిందే. ఈ సినిమాలో మన సుహాస్ ఈ ఫేస్ బ్లైండ్ నెస్ ఛాలెంజ్ ని ఎలా ఫేస్ చేస్తారో చూడాలి. మరి జనాభాలో 2 శాతం మందికి మాత్రమే వచ్చే ఈ అరుదైన వ్యాధిని బేస్ చేసుకుని సుహాస్ హీరోగా సినిమా వస్తుండడంపై మీ అభిప్రాయమేమిటి? ఈ సినిమా ట్రైలర్ మీకు నచ్చిందా? మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Show comments