సలార్.. ప్రశాంత్ నీల్ పదునుపెట్టిన బ్రహ్మస్త్రం! బాక్సాఫీస్ బద్దలే..

ప్రపంచమంతా సలార్ ట్రైలర్ 2 గురించి వెయ్యి కళ్ళతో ఎదురుచూసింది. ఎదురుచూపులకు సరిపడా ట్రైలర్ మోతెక్కించింది. రిలీజైన కొద్ది నిమిషాలకే లక్షల వ్యూస్, లక్షల లైక్స్.. సోషల్ మీడియా.. కశ్మీర్ టు కన్యాకుమారి హోరెత్తిపోయింది.

ప్రపంచమంతా సలార్ ట్రైలర్ 2 గురించి వెయ్యి కళ్ళతో ఎదురుచూసింది. ఎదురుచూపులకు సరిపడా ట్రైలర్ మోతెక్కించింది. రిలీజైన కొద్ది నిమిషాలకే లక్షల వ్యూస్, లక్షల లైక్స్.. సోషల్ మీడియా.. కశ్మీర్ టు కన్యాకుమారి హోరెత్తిపోయింది.

అనుమానాలను పటాపంచలు చేసింది. బలమైన అంచనాలను పెంచేసింది. తిరుగులేని సినిమాగా ముద్ర వేసింది. సలార్ ట్రైలర్ 2 ఇరగదీసేసింది. ఉదయం 10. 42 నిమిషాలకి విడుదలవుతుందనుకున్న ట్రైలర్ కాస్త ఆలస్యమై, మధ్యాహ్నం 2 గంటలకు విరుచుకుపడింది. మధ్యలో అభిమానుల గుండెలు పిండుకుపోయాయి. నిమిష, నిమిషానికి పిచ్చెక్కిపోయింది ఫ్యాన్స్ కి. ప్రపంచమంతా సలార్ ట్రైలర్ 2 గురించి వెయ్యి కళ్ళతో ఎదురుచూసింది. ఎదురుచూపులకు సరిపడా ట్రైలర్ మోతెక్కించింది. రిలీజైన కొద్ది నిమిషాలకే లక్షల వ్యూస్, లక్షల లైక్స్.. సోషల్ మీడియా.. కశ్మీర్ టు కన్యాకుమారి హోరెత్తిపోయింది.

ఎందుకింత మేనియా?

ప్రభాస్ రేంజ్ కి తగిన సినిమా, ప్రభాస్ ఇమేజ్ కి తగిన కంటెంట్.. ఆ స్టాయి మేకింగ్ కరువై, అభిమానుల గుండె చెరువై పోయి చతికిలబడిపోయారు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్.. వరసగా ఒకదాని తర్వాత ఒకటి ప్రభాస్ పాపులారిటీకి సమాధానం చెప్పలేకపోయాయి. ఆ మూవీల తర్వాత ప్రారంభమైన సినిమాయే సలార్. అదీ కేజీఎఫ్ 1 అండ్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన మూవీ. అంటే అభిమానులకు ఎలా ఉంటుందో ఆలోచించండి. కేజీఎఫ్ కంటెంట్ తో ఇండియన్ సినిమా ఇండస్ట్రీయే ఫిదా అయిపోయింది. ప్రశాంత్ నీల్ అంటే ఫీవర్లు వచ్చేశాయి. దానికి తోడు ప్రభాస్ కాంబినేషన్. కేజీఎఫ్ లో యశ్ కి ప్రశాంత్ ఎటువంటి ఎలివేషన్లు ఇచ్చాడో ప్రతీ ఫ్రేమ్ ని చెప్పగలరు ఎవ్వరైనా. హీరోయిజమ్ కి కేజీఎఫ్ పరాకాష్ట.

ప్రభాస్ ని ఇప్పుడు ప్రశాంత్ ఫార్మాట్లో ఆలోచించుకుంటే అభిమానులకి మతిపోయింది. దానికి తగ్గట్టుగా ట్రైలర్ వన్ అలాగే ఉంది. ఇక ట్రైలర్ 2లో ప్రభాస్ విశ్వరూపం కనిపించేట్టుగా ట్రైలర్ కట్ చేశాడు ప్రశాంత్. ప్రభాస్ ఫైర్ గన్ పేల్చడం కాదు.. ప్రభాసే ఫైర్ గన్ లా కనిపించాడు. యాక్షన్ యాంగిల్స్ విత్ ఫైర్ బ్రాండ్ ఫ్రేమ్స్, ప్రతీ షాట్ ఓ సినిమాలా కనిపించింది. ఇదే గనక థియేటర్లో చూస్తే పూనకాలు లోడింగే.. అనుమానమే లేదు. ప్రతీ భాషలో ప్రతీ సూపర్ స్టారూ సలార్ లో ఉండడం మరో లెవెల్. ఓ పిచ్చివాడిని తెచ్చాను అన్న డైలాగ్ తర్వాత ట్రైలర్లో ప్రభాస్ ఎంట్రన్స్ తెరకి మంట పెట్టినట్టుంటుంది.

ఖాన్సార్ సామ్రాజ్యం అగ్నిగుండంలా భగ్గుమంది. నరుకుడే నరుకుడు.. దూకుడే దూకుడు.. అదీ ప్రభాస్ నుంచి థియేటర్లు,  ఫ్యాన్స్ ఆశించేది. ప్రభాస్ అడుగేస్తే పిడుగు పేలినట్టుండాలి. సలార్ ట్రైలర్లో ఎన్ని పిడుగులు పేలాయో.. ప్రభాస్ లుక్ కూడా  వెన్నులో చలి పుట్టించినట్టు, గుండెల్లో రైళ్ళు పరిగెట్టించినట్టుంది. ఇంత కన్నా ట్రైలర్ నుంచి ఏం కావాలి. అదీ ప్రభాస్ లాంటి బ్రహ్మాస్త్రానికి. ఆ బ్రహ్మాస్త్రానికి ప్రశాంత్ నీల్ బాగా పదునుబెట్టి థియేటర్లలోకి డిసెంబర్ 22న బాక్సాఫీసులకి గురిపెట్టి వదులుతున్నాడు. జరగబోయేది చరిత్రే.. సలార్ చరిత్ర.. ఖాన్సార్ మండుతున్న చరిత్ర. మరి సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పదునుపెట్టిన బ్రహ్మస్త్రమేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments