ఈ ఫోటోలో ఓ స్టార్ కమెడియన్‌ని గుర్తుపట్టారా? ఎన్నో అవమానాలు దాటి ఎదిగాడు!

ఈ ఫోటోలో ఓ స్టార్ కమెడియన్ ఉన్నాడు.. అతడు ఎవరో గుర్తు పట్టండి.. ఇక్కడ క్లూ కూడా ఉంది. ఎన్నో ఛీత్కారాలు, బాడీ షేమింగ్ ఎదుర్కొని ఈ స్థాయికి ఎదిగాడు. ఆల్మోస్ట్ దక్షిణాది ఇండస్ట్రీలో సినిమాలు చేశాడు.. ఎవరో చెప్పుకోండి..?

ఈ ఫోటోలో ఓ స్టార్ కమెడియన్ ఉన్నాడు.. అతడు ఎవరో గుర్తు పట్టండి.. ఇక్కడ క్లూ కూడా ఉంది. ఎన్నో ఛీత్కారాలు, బాడీ షేమింగ్ ఎదుర్కొని ఈ స్థాయికి ఎదిగాడు. ఆల్మోస్ట్ దక్షిణాది ఇండస్ట్రీలో సినిమాలు చేశాడు.. ఎవరో చెప్పుకోండి..?

‘నవ్వడం ఓ భోగం, నవ్వించడం ఓ యోగం.. నవ్వలేకపోవడం ఓ రోగం’ అంటుంటారు. నిజమే నవ్వు ఓ దివ్య ఔషధంలా పనిచేస్తుంది. ఎన్నో సమస్యలను ఓ చిన్న చిరునవ్వు పరిష్కరిస్తుంది. చెప్పుకోవడం సులువే.. చెప్పినంత ఈజీ కాదు నవ్వు రావడం. అందుకే ఆ బాధ్యతను తీసుకున్నారు హాస్య నటుడు. ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో అన్ని రసాలను అలవోకగా పండించొచ్చు కానీ.. హాస్య రసాన్ని పండించడం అత్యంత కష్టమైనది అంటుంటారు. అలాంటి నవ్వును మన మోముపైకి తెప్పించేందుకు ఎంతో కష్టపడుతుంటారు కమెడియన్స్. తెరపై కనిపించేది కాసేపే అయినా.. పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంటారు. అయితే నవ్విస్తున్నారు కదా వీరి లైఫ్ కూడా అంతే ఆనందంగా ఉంటుంది అనుకుంటే పొరపాటు. ఎన్నో కష్ట నష్టాల పడి ఇక్కడ వరకు వస్తుంటారు.

ఎన్నో ఆటుపోట్లు, ఆకలి దప్పికలను తట్టుకుని ఓ స్థాయికి చేరుకున్న ఎంతో మంది హాస్య నటులు ఇండస్ట్రీలో ఉన్నారు. వీరిలో ఒకరు ఈ ఫోటోలో కనిపిస్తున్న స్టార్ కమెడియన్ కూడా. కింది వరుసలో రైట్ నుండి రెండో వ్యక్తి కనిపిస్తున్నాడు కదా.. అతడో గొప్ప హాస్యనటుడు. ఎన్నో ఛీత్కారాలు, బాడీ షేమింగ్ ఎదుర్కొని.. సక్సెస్ ఫుల్ యాక్టర్‌గా దూసుకెళుతున్నాడు. నటుడు కాకముందే అతడో స్పోర్ట్స్ చాంపియన్ కూడా. రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఛాంపియన్‪గా నిలిచిన టీంలో సభ్యుడు. తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్ అటు నుండి సైడ్ క్యారెక్టర్, ఆపై కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఏ బాడీ అయితే షేమింగ్ చేశారో.. ఇప్పుడు అదే ఎస్సెట్ అయ్యింది.

అతడి చింపురు జుట్టు, వస్త్రధారణను చూడటం మానేసి.. కామెడీ టైమింగ్‌తో సత్తా చాటుతున్నాడు. ఇంత చెప్పిన తర్వాత అర్థం అయ్యింది కదా.. అతడే తన స్పాంటెనిటీ డైలాగులతో పాటు క్యూట్ ఎక్స్ ప్రెషన్స్‌తో కితకితలు పెట్టించే కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగి బాబు. తమిళనాడులో పుట్టినప్పటికీ.. తండ్రి ఉద్యోగరీత్యా పలు చోట్ల పెరిగాడు యోగి. లొల్లు సభ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారిన ఈ నటుడు.. యోగి మూవీలో చిన్న పాత్రతో ఎంట్రీ ఇచ్చాడు. మెల్లిగా చిన్న చిన్న రోల్స్ చేస్తూ.. కమెడియన్‌గా మారాడు. వేలాయుధం, కలాకలప్పు, ఆటకత్తి, సూదు కవ్వంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాగే షారూఖ్ మూవీ చెన్నై ఎక్స్ ప్రెస్‌లోనూ నటించాడు.

ఆరణ్మణి, ఐ, డీమాంట్ కాలనీ చిత్రాల్లో చేశాడు. అనతి కాలంలోనే మంచి కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడికి బాగా పేరు తెచ్చిన మూవీ కోలవావు కోకిల. ఇక అక్కడి నుండి మరింత బిజీ ఆర్టిస్టుగా మారిపోయాడు. తమిళ్, మలయాళ చిత్రాలతో పాటు తెలుగు సినిమాలు చేస్తున్నాడు. బైలింగ్వల్ మూవీ కాకితో తెలుగు వారికి పరిచమైనా.. రాజా సాబ్ మూవీతో నేరుగా తెలుగు మూవీలో నటించబోతున్నాడు. ఇప్పుడు అతడి చేతిలో ఇంచుమించు పది ప్రాజెక్టులున్నాయి. అతడి నటనకు గానూ 2020లో కలైమణి  అవార్డును కూడా అందుకున్నాడు. ఈ రోజు ఈ హాస్య నటుడి పుట్టిన రోజు.

Show comments