Teja Sajja-Prabhas: రిస్క్​లో తేజ సజ్జ.. ప్రభాసే గట్టున పడేయాలి!

‘హనుమాన్’ మూవీతో పాన్ ఇండియా లెవల్​లో పాపులారిటీ దక్కించుకున్నారు యంగ్ హీరో తేజ సజ్జ. ప్రస్తుతం ఆయన ‘మిరాయ్’ అనే చిత్రంలో నటిస్తున్నారు.

‘హనుమాన్’ మూవీతో పాన్ ఇండియా లెవల్​లో పాపులారిటీ దక్కించుకున్నారు యంగ్ హీరో తేజ సజ్జ. ప్రస్తుతం ఆయన ‘మిరాయ్’ అనే చిత్రంలో నటిస్తున్నారు.

‘హనుమాన్’ మూవీతో పాన్ ఇండియా లెవల్​లో పాపులారిటీ దక్కించుకున్నారు యంగ్ హీరో తేజ సజ్జ. అంతకుముందు ‘జాంబీ రెడ్డి’తో ఆయన మంచి హిట్ అందుకున్నారు. ‘అద్భుతం’, ‘ఓ బేబీ’ లాంటి చిత్రాలతో యూత్ ఆడియెన్స్​లో క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే ప్రశాంత్ వర్మ రూపొందించిన ‘హనుమాన్’తో తేజ నెక్స్ట్ రేంజ్​కు చేరుకున్నారు. టాలీవుడ్​తో పాటు శాండల్​వుడ్, బాలీవుడ్​లో ఈ ఫిల్మ్ సంచలన వసూళ్లు సాధించి పాన్ ఇండియా హిట్​గా నిలిచింది. దీంతో తేజ నటించే తదుపరి సినిమాలపై అందరి దృష్టి నెలకొంది. అయితే చాలా ఆఫర్లు తలుపు తట్టినా సెలెక్టివ్​గా వ్యవహరించిన యంగ్ హీరో ‘మిరాయ్​’కు ఓకే చెప్పారు. ఇప్పుడీ చిత్రం షూటింగ్ దశలో ఉంది.

‘మిరాయ్’తో మరో బ్లాక్​బస్టర్ కొట్టి కెరీర్​లో ఇంకో మెట్టుకు చేరుకోవాలని తేజ సజ్జ భావిస్తున్నారు. ఈ మూవీ కోసం తన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడుతున్నారు. ‘ఈగల్’ ఫేమ్ కార్తీక్ ఘట్టమననేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ రిలీజ్ డేట్​ను ఇప్పటికే ప్రకటించారు. వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్​గా ఏప్రిల్ 18న ‘మిరాయ్​’ను విడుదల చేస్తామని ప్రకటించారు. మూడ్నెళ్ల కింద హీరో బర్త్​ డే నాడు రిలీజ్ డేట్​ను అనౌన్స్ చేశారు మేకర్స్‌. ఇక్కడే ఓ చిక్కు వచ్చి పడింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘రాజా సాబ్​’ నుంచి రీసెంట్​గా టీజర్ బయటకు వచ్చింది. ఇందులో విడుదల తేదీని కూడా ప్రకటించారు. 2025, ఏప్రిల్ 10వ తేదీన ప్రభాస్ ఫిల్మ్ బిగ్​స్క్రీన్స్​లో కనువిందు చేయనుంది.

వారం రోజుల గ్యాప్​లో ప్రభాస్, తేజ సజ్జ చిత్రాలు విడుదల కానున్నాయి. తొలుత రెబల్ స్టార్ ‘రాజా సాబ్’ రానుంది. ఆ తర్వాత ‘మిరాయ్ రిలీజ్ అవుతుంది. దీంతో తేజ రిస్క్​లో పడ్డట్లు అయింది. వారం రోజుల తేడాలో ప్రభాస్ లాంటి బిగ్​ స్టార్​తో బాక్సాఫీస్ వద్ద పోటీపడాల్సి రావడం తేజ కెరీర్​కు మంచిది కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ‘రాజా సాబ్’ ఊపులో ఉంటే ‘మిరాయ్​’ ఓపెనింగ్స్ మీద తీవ్ర ప్రభావం పడుతుందని అంటున్నారు.

‘హనుమాన్’తో వచ్చిన స్టార్​డమ్​, క్రేజ్​ను మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తున్న యంగ్ హీరోకు ఇది నెగెటివ్​గా మారే ప్రమాదం ఉంది. అయితే ప్రభాస్ తలచుకుంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందని ఎక్స్​పర్ట్స్ చెబుతున్నారు. ఈ రెండు సినిమాలను నిర్మిస్తోంది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీనే. కాబట్టి ప్రభాస్​ను ఒప్పించి ‘రాజా సాబ్​’ను ఇంకాస్త వెనక్కి లేదా ముందుకు జరిగేలా చూస్తే తేజ ఈ సమస్య నుంచి బయటపడతాడని చెబుతున్నారు. ప్రభాస్ ఫిల్మ్ ఎప్పుడు వచ్చినా థియేటర్ల దగ్గర పండగే. కాబట్టి తేజకు ఉన్న రిస్క్​ను దృష్టిలో పెట్టుకొని ఆయన పాజిటివ్ డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

Show comments