Prabhas- Hanu Raghavapudi Concept Poster Released: అఫీషియల్: ప్రభాస్- హను రాఘవపూడి మూవీ.. పోస్టర్ తో స్టోరీ చెప్పేశారు!

అఫీషియల్: ప్రభాస్- హను రాఘవపూడి మూవీ.. పోస్టర్ తో స్టోరీ చెప్పేశారు!

Prabhas- Hanu Raghavapudi Concept Poster Released: ప్రభాస్- హను రాఘవపూడి సినిమా కాన్సెప్ట్ కి సంబంధించి ఒక కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని పోస్టర్ ద్వారా చెప్పేశారు.

Prabhas- Hanu Raghavapudi Concept Poster Released: ప్రభాస్- హను రాఘవపూడి సినిమా కాన్సెప్ట్ కి సంబంధించి ఒక కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని పోస్టర్ ద్వారా చెప్పేశారు.

ప్రభాస్- హను రాఘవపూడి సినిమా పట్టాలెక్కేసింది. అంటే హైదరాబాద్ లో శనివారం ఉదయం అట్టహాసంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం సినిమా నుంచి అప్ డేట్ ఉంటుంది అని ప్రకటించిన విషయం తెలిసిందే. సినిమా పేరు ప్రకటిస్తారని అంతా అనుకున్నారు. అయితే పేరు చెప్పలేదు. కానీ, కథను రివీల్ చేస్తూ ఒక కాన్సెప్ట్ పోస్టర్ ని విడుదల చేశారు. ఆ పోస్టర్ చూస్తే.. సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోతాయి. ఎందుకంటే ఇప్పటి వరకు అంతా అనుకున్నట్లే ఇది స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించి సినిమా స్టోరీ. అలాగే అతి త్వరలోనే సినిమా షూటింగ్ కూడా ప్రారంభించబోతున్న విషయాన్ని వెల్లడించారు.

మైత్రీ మూవీస్ ఈ సినిమాని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. వాళ్లు ఒక కొటేషన్ పెట్టారు. “యుద్ధాలు ఆధిపత్య పోరులా మారిన సమయంలో.. ఒక యోధుడు వాళ్ల పోరాట లక్ష్యాన్నే మార్చేశాడు” 1940ల్లో జరిగినట్లు చూపించబోతున్న ఒక ఊహజనిత కథ. త్వరోలనే షూటింగ్ ప్రారంభం కాబోతోంది.. అంటూ కోట్ చేశారు. ఇది స్వతంత్రానికి ముందు జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఒక ఫిక్షనల్ స్టోరీని తెరకెక్కిస్తున్న విషయాన్ని ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రభాస్- హను రాఘవపూడి ప్రాజెక్ట్ కి సంబధించి ఉన్న ఊహాగానాలను అధికారికంగా నిజం చేసినట్లు అయ్యింది. వాళ్లు పెట్టిన కొటేషన్ చూస్తే సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పినట్లు ఉంది. యుద్ధాల అర్థాన్నే మార్చేశాడు అనేది నేతాజీ గురించి చెప్పినట్లుగా ఉన్నారు.

సినిమా పోస్టర్:

సినిమా పోస్టర్ మీద చాలా విషాలు ఉన్నాయి. ఒకవైపు బ్రిటీష్ జెండా కాలిపోతూ ఉంది. ఆజాద్ హింద్ ఫౌజ్- బ్రిటీష్ దళాలకు మధ్య జరిగే యుద్ధం తరహాలోనే ఉంది. అదే నిజమైతే సుభాష్ చంద్రబోస్ తో కలిసి బ్రిటీష్ సైన్యానికి చుక్కలు చూపించిన ఒక గొప్ప యోధుడు పాత్రలో మనం ప్రభాస్ ని చూడొచ్చు. అక్టోబర్ 21, 1943 సింగపూర్ లో సుభాష్ చంద్రబోస్ ‘ఛలో ఢిల్లీ’ నినాదమిచ్చారు. 1944లో ఈ ‘ఛలో ఢిల్లీ మార్చ్’ మొదలైంది. దానిని సెంటర్ చేసుకుని సినిమా ఉండే అవకాశం ఉండచ్చు. అలాగే ఈ సినిమాలో ఒక ప్రేమకథ కూడా ఉంటుందని మొదటి నుంచి వాదన ఉంది. ఒకవైపు యుద్ధం.. మరోవైపు ప్రేమకథను మిళితం చేస్తూ ఒక గొప్ప సినిమాని తెరకెక్కించబోతున్నారు అని చెబుతున్నారు. ఇప్పటివరకు వచ్చిన ఊహాగానాలు నిజమైతే.. సినిమా పేరు ఫౌజీ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరి.. ప్రభాస్- హను రాఘవపూడి కొత్త సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments