తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించిన ప్రభాస్!

Prabhas Donation To AP, TG: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన రెండు తెలుగు రాష్ట్రాలను ఆదుకోవడం కోసం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ భారీ విరాళం ప్రకటించారు. ఇప్పటికే ఎన్నో సార్లు కష్టాల్లో ఉన్న వారిని ఆదుకున్న ప్రభాస్ మరోసారి తన మంచి మనస్సును చాటుకున్నారు.

Prabhas Donation To AP, TG: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన రెండు తెలుగు రాష్ట్రాలను ఆదుకోవడం కోసం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ భారీ విరాళం ప్రకటించారు. ఇప్పటికే ఎన్నో సార్లు కష్టాల్లో ఉన్న వారిని ఆదుకున్న ప్రభాస్ మరోసారి తన మంచి మనస్సును చాటుకున్నారు.

గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు చిగురుటాకులా వణికాయి. ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహించాయి. ఖమ్మం, విజయవాడ నగరాలను వరదలు ముంచేత్తాయి.  భారీ వరదలకు మున్నేరు నది ఖమ్మంపై , బుడమేరు వాగు విజయవాడపై విరుచుకపడ్డాయి. నిన్నటి నుంచి వరదలు కాస్త తగ్గు ముఖం పట్టినప్పటికి.. పరిస్థితి మాత్రం ఇంకా చక్కబడలేదు. ఇళ్లన్నీ నీట మునగడంతో కట్టుబట్టలతో సహాయక శిబిరాలకు చేరుకున్న జనాలు. తిండి, నీరు కోసం అలమటిస్తున్నారు. ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకోవడం కోసం ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయి. ఇదే సమయంలో వరద బాధితులకు సాయం అందించేందుకు టాలీవుడ్ హీరోలు ముందుకు వచ్చారు.

టాలీవుడ్ చెందిన అనేక మంది ప్రముఖులు వరద బాధితుల కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ, సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగాస్టార్ చిరంజీవి వంటి సినీ స్టార్స్ తెలుగు రాష్ట్రాల సీఎం సహాయనిధులకు భారీ ఎత్తున విరాళం ప్రకటించారు. అలానే తాజాగా పాన్ ఇండియా స్టార్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా భారీ విరాళం ప్రకటించారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభాస్ ముందుకు వచ్చారు.

ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ. 2 కోట్లు భారీ విరాళం ప్రభాస్ ప్రకటించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం సహాయ నిధులకు కోటి చొప్పున మొత్తం 2 కోట్ల రూపాయాలను ఇస్తున్నట్లు సమాచారం. అలానే వరదలకు గురైన ప్రాంతలో ప్రజలకి భోజనాలు నీళ్లు ప్రభాస్ ఏర్పాటు చేశారు. కష్టాల్లో ఉన్నవారికి తన వంతు సాయం అందించడానికి ఎప్పుడూ ముందుంటారు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్. అలానే తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు.

గతంలో కూడా అనేక సందర్భాల్లో ప్రభాస్ తన మంచి మనస్సును చాటుకున్నారు. విపత్తులకు విరాళల ఇవ్వడం, ఆపదలో ఉండే వారిని ఆదుకోవడంలో ప్రభాస్ ముందుటారు. ఇక ఆయన చేసే అన్నదానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ఇంటికి వచ్చిన వారికి, తాను షూటింగ్ చేసే సమయంలో అక్కడ ఉన్న వారికి స్వయంగా భోజనాలు ఏర్పాటు చేస్తాడు.  సాయం చేయడంతో కూడా ప్రభాస్ బహుబలి అని  చాలా మంది అభిప్రాయా పడుతుంటారు.

Show comments