Krishna Kowshik
టాలీవుడ్ అగ్ర హీరోలు సినిమాలు వస్తున్నాయంటే.. వంద కోట్లు, 200 కోట్లు మినిమమ్ కలెక్షన్లు. 1000 కోట్ల టార్గెట్ ను ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పాన్ ఇండియా లెవల్లోనే కాదు.. ఓవర్సీస్ కలెక్షన్లపై కూడా కన్నేస్తున్నారు. ఇంతకు ఓవర్సీస్ బాక్సాఫీసును షేక్ చేసిన హీరోలు ఎవరంటే..?
టాలీవుడ్ అగ్ర హీరోలు సినిమాలు వస్తున్నాయంటే.. వంద కోట్లు, 200 కోట్లు మినిమమ్ కలెక్షన్లు. 1000 కోట్ల టార్గెట్ ను ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పాన్ ఇండియా లెవల్లోనే కాదు.. ఓవర్సీస్ కలెక్షన్లపై కూడా కన్నేస్తున్నారు. ఇంతకు ఓవర్సీస్ బాక్సాఫీసును షేక్ చేసిన హీరోలు ఎవరంటే..?
Krishna Kowshik
తెలుగు సినిమా హీరోల స్థాయి పెరిగింది. మార్కెట్ డబుల్ అయ్యింది. అగ్ర హీరోల సినిమాలు వస్తే 100, 200 కోట్లు మినిమమ్ కలెక్షన్స్. వెయ్యి కోట్లను ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దీంతో పాన్ ఇండియా లెవల్లోనే కాదు. వరల్డ్ వైడ్ కలెక్షన్లపై ఫోకస్ పెంచారు టాలీవుడ్ స్టార్ హీరోలు. ముఖ్యంగా ఓవర్సీస్ బాక్సాఫీసుపై కన్నేశారు. ఒకప్పుడు అక్కడ మిలియన్ మార్క్ దాటితే ఆహా ఓహో అనుకునే వాళ్లు దర్శక నిర్మాతలు, సినీ విశ్లేషకులు. కానీ ఇప్పుడు ఆ మార్క్ ఈజీగానే దాటేస్తున్నారు. ప్రీ బుకింగ్ సమయంలోనే లేకుండా విడుదలైన వారంలోనే మిలియన్ డాలర్ వసూలు చేస్తున్నారు. టైర్ 2 హీరోలు సైతం 2, 3 మిలియన్ డాలర్స్ ఈజీగా కొల్లగొట్టేస్తున్నారు. దీంతో ఇప్పుడు రేంజ్ దాటిపోయింది. మినిమం 5 మిలియన్ డాలర్లను టార్గెట్‌గా పెట్టుకున్నారు. కానీ ఈ ఫీట్ దాటడంలో కాస్తంత తడబడుతున్నారు టాలీవుడ్ టాప్ హీరోలు. ఇప్పటి వరకు 5 మిలియన్ డాలర్లను కొల్లగొట్టింది కేవలం ఇద్దరు హీరోలు మాత్రమే. మరీ ఆ ఇద్దరు ఎవరో.. ఓ లుక్కేద్దాం.
ప్రస్తుతం ఓవర్సీస్ కింగ్ ఎవరు అంటే డార్లింగ్ ప్రభాసే. ప్రభాస్ కనబడితే చాలు కాసుల వర్షం కురవాల్సిందే. బాహుబలి నుండి ప్రభాస్ ఓవర్సీస్ పై కూడా తన దండయాత్ర కొనసాగిస్తున్నాడు. ఇప్పటి వరకు 5 మిలియన్ డాలర్లను నాలుగు సార్లు అవలీలగా దాటేశాడు ఈ బాక్సాపీస్ కింగ్. బాహుబలి1, 2 చిత్రాలు రాజమౌళి ఖాతాలోకి చేరిపోయినా.. సలార్, కల్కి చిత్రాలు యంగ్ రెబల్ స్టార్ స్టామినా ఏంటో మరోసారి రుజువు చేశాయి. బాహుబలి- 2 ..20 మిలియన్ డాలర్లను వసూలు చేస్తే.. కల్కి 19 మిలియన్ డాలర్లు, సలార్, బహుబలి 8 మిలియన్ మార్క్‌ను చూశాయి. ఇక ప్రభాస్ తర్వాత ఆ ఫీట్ అందుకున్న హీరో మ్యాన్ ఆఫ్ ది మాసెస్ జూనియర్ ఎన్టీఆర్. తారక్‌వి రెండు సినిమాలు ఓవర్సీస్‌లో దుమ్ము దుమారం లేపే కలెక్షన్లు వసూలు చేశాయి. అందులో ఒకటి ఆర్ఆర్ఆర్. ఇది సింగిల్ హీరోగా సాధించింది కాదు.. ప్లస్ రాజమౌళి మేనియా లేకుండా వచ్చిన కలెక్షన్లు కాదు.. సో ఆ క్రెడిట్ కూడా రాజమౌళికి దక్కుతుంది. కానీ ఇటీవల వచ్చిన దేవరతో సోలోగా ఆ మార్క్ దాటేశాడు యంగ్ టైగర్. ప్రీ బుకింగ్ సమయంలో రికార్డుల సునామీ సృష్టించింది దేవర. దీంతో 5 మిలియన్స్ దాటేశాడు తారక్.
ఈ ఇద్దరే కాదు.. ఓ చిన్న హీరో కూడా అతి తక్కువ సమయంలో 5 మిలియన్ డాలర్లకు చేరువయ్యాడు. ఆ యంగ్ హీరో తేజ సజ్జా. హనుమాన్ మూవీతో ఓవర్సీస్‌లో 5.2 మిలియన్ డాలర్లను కొల్లగొట్టి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. ఇక కొల్లగొట్టాల్సిన హీరోల విషయానికి వస్తే.. సూపర్ స్టార్ మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్. ఇప్పుడు వీరి ఫ్యాన్స్ కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. నెక్ట్ ఓవర్సీస్ కలెక్షన్ల రికార్డులు దున్నేసే సత్తా మా హీరోకి ఉందంటే.. మా హీరోకి ఉందంటూ బెట్టింగ్‌కు రెడీ అవుతున్నారు. ఈ ఏడాది ఆ మార్కును అందుకునేందుకు రెడీగా ఉన్నారు మెగా, అల్లు హీరోలు. పుష్ప పాన్ ఇండియన్ లెవల్లో కాసుల సునామీ కురిపించినా.. ఓవర్సీస్‌లో అంత మేనియా కనబర్చలేదు. ఆర్ఆర్ఆర్ 15 మిలియన్ డాలర్లు వసూలు చేసినా.. రామ్ చరణ్ సింగిల్‌గా ఆ స్కోర్ సాధించలేదు. సో రాబోయే పుష్ప 2, గేమ్ ఛేంజర్లతో 5 మిలియన్ డాలర్లను కిక్ చేయాల్సిన రేసులో ఉన్నారు. మహేష్ బాబు కూడా ఈ మార్క్ అందుకోవాలంటే.. రాజమౌళి మూవీతోనే సాధ్యం అయ్యేలా కనిపస్తున్నాయి. చూడాలి.. నెక్ట్స్ 5 మిలియన్ డాలర్లను అందుకోబోయే స్టార్ హీరో ఎవరనేది.