ప్రముఖ గాయని పి సుశీలకు అస్వస్థత.. ఆందోళనలో అభిమానులు

P Susheela: సంగీత ప్రపంచంలో వేలాది పాటలు పాడి ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న పి సుశీల అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.

P Susheela: సంగీత ప్రపంచంలో వేలాది పాటలు పాడి ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న పి సుశీల అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.

తన గానామృతంతో శ్రోతలను ఉర్రూతలూగించిన ప్రముఖ సింగర్ పి సుశీల అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా 86 ఏళ్ల వయసు కలిగిన పి సుశీల గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. శనివారం రోజు ఉన్నట్టుండి ఒక్కసారిగా కడుపు నొప్పితో బాధపడుతుండడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమెను పరీక్షించిన వైద్యులు సాధారణ కడుపు నొప్పేనని ఆందోళన చెందాల్సిన పని లేదని తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాల పేర్కొన్నాయి.

సుశీల ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఇక పి సుశీల అస్వస్థతకు గురైన విషయం తెలిసి ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. వందలాది సినిమాల్లో వేలాది కొలది మాటలు పాడి ప్రేక్షకులను రంజింపజేసి సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తుళు, బడుగ, సింహళ భాషలలో 50 వేలకు పైగా పాటలు పాడారు పి సుశీల. కాగా పద్మభూషణ్‌ గ్రహీత అయిన సుశీల.. తెలుగు సినీ వినీలాకాశంలో ఎన్నో అద్భుత గీతాలు ఆలపించి అలరించారు.

Show comments