nagidream
ఓ సీరియల్ నటికి చేదు అనుభవం ఎదురైంది. ఆమె చేసిన ఒకే ఒక్క తప్పు పోలీసుల ముందు దోషిగా నిలబెట్టింది. ఆమె తప్పు చేసిన విషయం కూడా ఆమెకు తెలియలేదు. కానీ పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి మరీ..
ఓ సీరియల్ నటికి చేదు అనుభవం ఎదురైంది. ఆమె చేసిన ఒకే ఒక్క తప్పు పోలీసుల ముందు దోషిగా నిలబెట్టింది. ఆమె తప్పు చేసిన విషయం కూడా ఆమెకు తెలియలేదు. కానీ పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి మరీ..
nagidream
సీరియల్ నటికి చేదు అనుభవం ఎదురైంది. ఆ ఒక్క చిన్న తప్పు వల్ల ఆమె దొరికిపోయింది. చిన్న తప్పే ఆమెను పోలీసుల ముందు దోషిగా నిలబెట్టింది. పేరుకు సీరియల్ నటి. బాగా చదువుకునే ఉండి ఉంటుంది. అయినా ఏం లాభం? బయట ఎలా ఉండాలో తెలియని పరిస్థితి. కనీసం సీరియల్ లో నటించే తోటి నటీనటులు, దర్శకులైనా చెప్పాల్సింది. కానీ పోలీసుల ముందు ఆమె పరువు పోయింది. అసలేం జరిగిందంటే?
ద్విచక్ర వాహనం మీద వెళ్ళేటప్పుడు బుర్రకి హెల్మెట్, పెద్ద వాహనాల మీద వెళ్ళినప్పుడు సీటు బెల్టు కంపల్సరీ. ట్రాఫిక్ రూల్స్ ని పాటించకపోతే ఎంతలాంటి వారికైనా జరిమానా తప్పదు. జరిమానా కట్టకుండా ఇష్టమొచ్చినట్టు తిరిగితూ ఎక్కువ సార్లు పట్టుబడితే ట్రాఫిక్ పోలీసులు వాహన లైసెన్స్ రద్దు చేయడం, బండి సీజ్ చేయడం వంటివి చేస్తారు. అయితే ట్రాఫిక్ పోలీసులు ఎంత చేసినా గానీ జనాల్లో భయం మాత్రం రావడం లేదు. ఈ విషయంలో చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు అందరూ ఒకేలా ప్రవర్తిస్తున్నారు. హెల్మెట్ లేకుండా రోడ్డెక్కడం.. తల పక్కకు వాల్చి ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం.. రోడ్డు మీద దృష్టి పెట్టకుండా దిక్కులు చూస్తూ నడపడం చేస్తూ వెనుక వచ్చే వాళ్లకి ఇబ్బందులు కలిగిస్తున్నారు.
వెనక వచ్చే వాళ్లకి ఇబ్బంది కలిగిస్తున్నామన్న విషయం కూడా తెలియనంత మూర్ఖంగా ఉంటారు. అయితే ఇలాంటి మనుషులను చూసి కొంతమంది చూస్తూ ఊరుకోలేరు. పోలీసులకు ఫిర్యాదు చేసి తగిన మూల్యం చెల్లించుకునేలా చేస్తారు. తాజాగా ఓ సీరియల్ నటి విషయంలో అదే జరిగింది. హెల్మెట్ లేకుండా బండి నడిపింది. అయితే సీరియల్ షూట్ లో భాగంగా ఆమె హెల్మెట్ లేకుండా బండి నడిపింది. దీంతో ఆ సీరియల్ చూసిన ఓ వ్యక్తికి మండడంతో ఫిర్యాదు ఇచ్చాడు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆమెకు జరిమానా విధించారు.
ఆ సీరియల్ నటి పేరు వైష్ణవి గౌడ. ఆమె కన్నడలో సీతారామ సీరియల్ లో నటిస్తుంది. అయితే ఈ సీరియల్ లో ఓ ఎపిసోడ్ లో హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపింది. ఈ సీరియల్ ని ఇంట్లో చూస్తున్న జయప్రకాశ్ అనే వ్యక్తి.. సదరు నటి హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపిందని ఆమెపై ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హెల్మెట్ లేకుండా బండి నడిపే సెలబ్రిటీలను చూసి జనం కూడా వాళ్లనే ఫాలో అవుతారని.. ఇది తప్పుడు సంకేతం ఇస్తుందని సీరియల్ దర్శకుడిపై, నటి వైష్ణవిపై, సీరియల్ ని ప్రసారం చేసిన ఛానల్ పై చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడా యువకుడు.
దీనిపై స్పందించిన పోలీసులు.. ఆ సీన్ ని ఎక్కడ షూట్ చేశారో ఆ ప్రదేశానికి వెళ్లారు. బెంగళూరులోని నందిని లే అవుట్ లో చిత్రీకరణ జరిగినట్లు గుర్తించిన పోలీసులు.. వైష్ణవితో పాటు ఆమె నడిపిన బండి యజమానికి 500 రూపాయల చొప్పున జరిమానా విధించారు. ఇకపై రోడ్డు మీద ఇలా హెల్మెట్ లేకుండా కనిపించవద్దని.. కనిపిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. దీంతో స్పందించిన సీరియల్ యూనిట్, ప్రొడక్షన్ మేనేజర్ ఇకపై ఇలాంటి తప్పులు జరక్కుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.