Dharani
Ramoji Rao: ఇప్పుడంత సోషల్ మీడియాలో పిక్ టాక్‌లా హవా నడుస్తోంది. ఈ క్రమంలో ఓ సెలబ్రిటీ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
Ramoji Rao: ఇప్పుడంత సోషల్ మీడియాలో పిక్ టాక్‌లా హవా నడుస్తోంది. ఈ క్రమంలో ఓ సెలబ్రిటీ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
Dharani
ఈమధ్యకాలంలో సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిల్లో కొందరిని సులభంగానే గుర్తు పట్టవచ్చు. కానీ కొందరిని మాత్రం అసలు గుర్తించలేము. ఇప్పుడు చూస్తున్న గెటప్‌కి, ఫొటోలో ఉన్న వారి రూపుకు పోలికే లేకుండా ఉంటుంది. ఇక చిన్ననాటి ఫొటోలోని సెలబ్రిటీ ఎవరో తెలుసుకుని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో సెలబ్రిటీ ఫొటో ఇప్పుడు గూగుల్‌లో ట్రెండ్ అవుతోంది. దీనిలో ఉన్న సెలబ్రిటీని గుర్తించడం చాలా కష్టం. తెలుగు రాష్ట్రానికే చెందిన ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. మరి ఇంతకు ఆయన ఎవరో గుర్తుపట్టారా.. లేదా అయితే మేమే చెబుతాం రండి.
పైన ఫొటోలోని సెలబ్రిటీ ఎవరంటే.. మీడియా సంస్థల అధినేత రామోజీరావు. నేడు ఆయన మృతి చెందిన సంగతి తెలిసిందే. మూడు రోజులక్రితం అనగా.. జూన్ 5న ఆయన స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో.. కుటుంబసభ్యులు నానక్‌రామ్‌గూడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రామోజీరావును పరీక్షించిన డాక్టర్లు ఆయనకు గుండె సంబంధిత సమస్య ఉన్నట్టు గుర్తించి, స్టంట్ వేశారు. గత రెండు రోజులుగా ఐసీయూలో ఉన్న రామోజీరావు.. ఆరోగ్యం విషమించడంతో.. శనివారం తెల్లవారుజామున.. 4.50 గంటలకు మృతి చెందారు.
రామోజీరావు వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. 1936 నవంబర్ 16న కృష్ణజిల్లా పెద్దపారుపూడిలో జన్మించారు. ఆయన తండ్రి వేంకట సుబ్బారావు, తల్లి వేంకట సుబ్బమ్మలు. వీళ్లది వ్యవసాయ కుటుంబం. రామోజీ భార్య రమాదేవి. ఇయనకు సుమన్, కిరణ్ ఇద్దరు సంతానం. అయితే వీరిలో సుమన్ కొన్నాళ్ల క్రితమే చనిపోయారు. ఇక విద్యాభ్యాసం పూర్తైన తర్వాత రామోజీరావు.. వ్యాపార రంగంలోకి ప్రవేశించారు.
కెరీర్ ప్రారంభంలో సైకిల్‌పై ఊరూరా తిరుగుతూ పచ్చళ్ల వ్యాపారం చేశారని చెబుతారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు వచ్చి మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రారంభించారు. అలా మొదలైన మార్గదర్శి అంచెలంచలుగా పైకి ఎదిగింది. ఆ తర్వాత నెమ్మదిగా మీడియా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. అనంతరం సినిమా నిర్మాతగా మారారు. ఉషాకిరణ్ మూవీస్ సంస్థ స్థాపించి.. ఎన్నో అద్భుతమైన సినిమాలు నిర్మించారు. సుమారు 85కు పైగా చిత్రాలను తెరకెక్కించారు.
ఇక రామోజీరావు అనగానే చాలా మంది కేవలం నిర్మాత మాత్రమే అనుకుంటారు. కానీ ఆయన ఒక సినిమాలో యాక్టింగ్ కూడా చేశారు. 1978లో యూ విశ్వేశ్వర రావు నిర్మించిన మార్పు అనే సినిమాలో రామోజీరావు గెస్ట్ రోల్‌లో కనిపించారు. ఈ చిత్రంలో ఆయన ఒక న్యాయమూర్తి పాత్రలో నటించారు. ఈ సినిమాలో రామోజీరావు చేసింది అతిథి పాత్రలోనే అయినా.. అప్పట్లో సినిమా పోస్టర్ మీద ఆయన బొమ్మ ప్రచురించడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ఇక రామోజీరావు మరణంపై రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక రామోజీరావు మృతి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం.. అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహించాలని నిర్ణయించింది.