పవర్ స్టార్స్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. హరి హర వీరమల్లు రిలీజ్ డేట్ ఫిక్స్

Hari Hara Veeramallu Movie Release Date: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ప్రేక్షకులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో రీసెంట్ గా ఎప్పటినుంచో వినిపిస్తున్న హరి హర వీరమల్లు మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Hari Hara Veeramallu Movie Release Date: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ప్రేక్షకులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో రీసెంట్ గా ఎప్పటినుంచో వినిపిస్తున్న హరి హర వీరమల్లు మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే పవర్ స్టార్ అభిమానులు మాత్రం ఆయనను వెండి తెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్నారు. ఆల్రెడీ హరి హర వీరమల్లు , ఓజి సినిమాల గురించి అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వీటిలో హరి హర వీరమల్లు మూవీ గురించి టాక్ మొదలయ్యి చాలా కాలమే అయింది. కానీ పవన్ కళ్యాణ్ బిజీ గా ఉండడంతో ఇప్పటివరకు ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్ రాలేదు. కానీ రీసెంట్ పవర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. రీసెంట్ గా పవన్ హరి హర వీరమల్లు సెట్స్ లో జాయిన్ అవ్వడంతో.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అలాగే ఈ మూవీ రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు మేకర్స్ . ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

తాజాగా పవన్ హరి హర వీరమల్లు మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఈరోజు ఉదయం 7 గంటలకు ఈ మూవీ షూటింగ్ ప్రారంభించినట్టు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. దీనితో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉండగానే.. రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసి ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చారు. హరి హర వీరమల్లు మూవీని 2025 మార్చి 28న పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. రిలీజ్ డేట్ తో పాటు.. పవన్ కళ్యాణ్ కత్తి పట్టుకున్న పోస్టర్ కూడా రివీల్ చేశారు. దీనితో ఇంకాస్త ఖుషి అయిపోతున్నారు అభిమానులు. ముందు నుంచి ఈ సినిమాపై ఫుల్ హైప్ నడుస్తుంది. కాబట్టి సినిమా అయితే హిట్ కొట్టేస్తుంది. ఇక మూవీ నుంచి ముందు ముందు రాబోయే అప్డేట్స్ ఎలాంటి హైప్ ను క్రియేట్ చేస్తాయో వేచి చూడలి.

కాగా ఈ సినిమాకు డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తో పాటు.. నిధి అగర్వాల్, బాబీ డియోల్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి లాంటి వారు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాను సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్స్ పైన.. ఏ దయాకర్ రావు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో కొన్ని సీన్స్ కు క్రిష్ జాగర్లమూడి కూడా దర్శకత్వం వహించడం విశేషం. మరి ఈ మూవీ ప్రేక్షకులకు ఏ మాత్రం కిక్ ఇస్తుందో చూడాలి. అటు ఓజి మూవీ పై కూడా ప్రేక్షకులకు భారీగానే అంచనాలు పెరిగిపోతున్నాయి. మొత్తానికి వచ్చే ఏడాది అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టడానికి పవన్ కూడా వచ్చేస్తున్నాడు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments