పటాస్ మూవీలోని ఈ నటుడు గుర్తున్నాడా.. ఇప్పుడు ఎంతలా మారిపోయాడంటే..?

పటాస్ మూవీతో డైరెక్టరుగా మారాడు అనిల్ రావిపూడి. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, నిర్మాతగా తెరకెక్కిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో ఓ కామెడీ సీన్ ఉంటుంది. అందులో నటించిన ఇతడు ఇప్పుడెలా ఉన్నాడంటే..

పటాస్ మూవీతో డైరెక్టరుగా మారాడు అనిల్ రావిపూడి. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, నిర్మాతగా తెరకెక్కిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో ఓ కామెడీ సీన్ ఉంటుంది. అందులో నటించిన ఇతడు ఇప్పుడెలా ఉన్నాడంటే..

అనిల్ రావిపూడి డెబ్యూ డైరెక్టర్‌గా తెరకెక్కిన మూవీ పటాస్. 2015లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. నందమూరి కళ్యాణ్ రామ్‌కు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచిపోయింది. శృతి సోది హీరోయిన్. యాక్షన్ కామెడీ చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మించాడు. ఈ మూవీ హిట్ కొట్టడంతో తమిళంలో, కన్నడలో రీమేక్ చేశారు. ఇక ఇందులో స్టూడెంట్ కామెడీ ట్రాక్ నడుస్తుంది. యూత్ లీడర్ అరెస్టు కాగా, స్టూడెంట్స్ అందర్ని విలన్ రెచ్చగొట్టడంతో నిరసనకు దిగుతారు. దీంతో పోలీసైన హీరో రంగంలోకి దిగి.. ధర్నాను విరమించుకోవాలని చెబుతాడు. అయినప్పటికీ స్టూడెంట్ లీడర్స్ వినిపించుకోకపోవడంతో.. వారి పేరెంట్స్‌ను రంగంలోకి దింపుతాడు. తల్లులు వచ్చి కొడుకుల్ని ఇరగగొడుతుంటారు.

ఇందులో ఓ సన్నగా పొడుగ్గా ఉంటే నటుడు గుర్తున్నాడా.. పరిగెత్తి, పరిగెత్తి..కొడుతుంది అతడి తల్లి. సింగం సింగం అంటూ బ్యాగ్రౌండ్‌లో మ్యూజిక్ నడుస్తూ ఉంటుంది. వింతైన ఎక్స్ ప్రెషన్స్‌తో నవ్వులు తెప్పిస్తుంటాడు ఆ యాక్టర్. ఇంతకు ఆ నటుడు ఎవరంటే.. మహేష్. కొరియోగ్రాఫర్ అండ్ నటుడు. ఫేసులో వింతైన ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం వల్ల ఆయనకు హాలీవుడ్ నటుడు జిమ్మి క్యారీతో పోలుస్తూ ఉంటారు. గత ఏడాది చనిపోయిన రాకేశ్ మాస్టర్ దగ్గర డ్యాన్సులో శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత బ్యాగ్రౌండ్ డ్యాన్సరుగా కొనసాగాడు. తాజాగా ఐ డ్రీమ్‌లో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఢీ షోలో రమ్మని రాకేష్ మాస్టర్, శేఖర్ మాస్టర్ అడిగితే చేయలేదన్నారు. తనకు షార్ట్ మెమొరీ లాస్ ఉందని, స్టెప్స్ తర్వగా గుర్తుపెట్టుకోలేనని చెప్పాను.

చదవండి: సరిపోదా శనివారం మూవీ రివ్యూ

పటాస్ మూవీస్ తర్వాత సరైన క్యారెక్టర్ పడకపోవడంపై స్పందించాడు మహేష్. ‘ ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నాను. ఫోటోలను పంపిస్తున్నాను. క్యారెక్టర్ ఇస్తామని చెబుతారు. నేను కూడా నటిస్తున్నాననే ఫీలవుతా. కానీ చివరకు ఆ సినిమా విడుదల కూడా అయిపోతుంది. ఆ తర్వాత నాకు ఈ క్యారెక్టర్ ఇస్తానన్నారే అని అడిగేందుకు ఫోన్ చేస్తే కట్ చేస్తారు’ అని చెప్పుకొచ్చాడు. ‘సుప్రీం మూవీలో మంచి రోల్ చేశా.. కానీ చాలా సీన్ కట్ చేశారు. అలాగే రాజాది గ్రేట్ ఆఫర్ వచ్చినట్లే వచ్చి పోయింది. సరిలేరు నీకెవ్వరు, భగవంత్ కేసరిలో కూడా నటించాల్సి ఉంది. కుదురలేదు. ఇప్పుడు వెంకటేశ్‌లో రాబోతున్న సినిమాలో అవకాశం ఉంటుందని ఆశిస్తున్నా’ అని తెలిపాడు. డ్యాన్స్ మాస్టర్‌గా చేసినప్పడు చాలా స్ట్రగుల్స్ పడ్డానని చెప్పాడు. ఇప్పుడు కొరియోగ్రాఫర్ గా రాణిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఎన్నో విషయాలు పంచుకున్నాడు.

Show comments