Keerthi
యంగ్ హీరో రాజ్ తరణ్, శివానీ రాజశేఖర్ నటించిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ ఆహ నా పెళ్లంట గురించి అందరికి తెలిసిందే. అయితే తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రముఖ బుల్లితెర ఛానెల్ లో త్వరలోనే ప్రసారం కానుంది. ఇంతకి ఎక్కడంటే..
యంగ్ హీరో రాజ్ తరణ్, శివానీ రాజశేఖర్ నటించిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ ఆహ నా పెళ్లంట గురించి అందరికి తెలిసిందే. అయితే తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రముఖ బుల్లితెర ఛానెల్ లో త్వరలోనే ప్రసారం కానుంది. ఇంతకి ఎక్కడంటే..
Keerthi
ప్రస్తుత కాలంలో థియేటర్లు, ఓటీటీ అని పెద్దగా తేడాలు లేవు. కంటెంట్ బావుంటే దేనికైనా ప్రేక్షకుల ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా.. స్టార్ హీరోలు సైతం ఓటీటీ ప్రాజెక్టులు చేస్తు దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా ‘అహ నా పెళ్ళంట’ అనే వెబ్ సిరీస్ తో ఓటీటీకి పరిచయమైన విషయం తెలిసిందే. ఇందులో రాజ్ తరణ్ కు జోడిగా శివానీ రాజశేఖర్ నటించింది. ఇక వెబ్ సిరీస్ ను సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. మంచి కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ 2022 నవంబర్ 17న ప్రముఖ ఓటీటీ జీ5 వేదికలో స్ట్రీమింగ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ ను అందుకుంది. అయితే దాదాపు రెండెళ్ల తర్వాత ఈ వెబ్ సిరీస్ అనేది ఇప్పుడు టీవీలో అలరించనుంది. ఇంతకి ఎప్పుడంటే..
అసలే టాలీవుడ్ లో సంక్రాతి తర్వాత కొత్త సినిమాలేవి లేకపోవడం అనేది సినీ ప్రియులుకు అంతగా మింగుడుపడటం లేదు. మరి ఇలాంటి సమయంలో తెలుగు ప్రేక్షకులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇవ్వడానికి జీ తెలుగు సిద్ధమైంది. సరికొత్త సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు.. ఇప్పుడు జీ 5 ఒరిజినల్ వెబ్ సిరీస్ అయిన అహ నా పెళ్లంట మొత్తం సీజన్ ను సినిమాగా అందించనుంది. మరి జీ5 ఓటీటీ వేదికగా అత్యధికంగా వీక్షకులను ఆకట్టుకున్న ఈ తెలుగు వెబ్ సిరీస్ ను.. ఈనెల అనగా ఫిబ్రవరి 29న గురువారం మధ్యాహ్నం 12 గంటలకు జీ తెలుగు ఛానెల్ లో ప్రసారం చేయనున్నారు. ఇక ఈ వార్త తెలిసిన మూవీ లవర్స్ కు చాలా రోజుల తర్వాత ఓ కొత్త సినిమా టీవిలో సందడి చేయనుందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
అయితే.. ఆహ నా పెళ్లంట సిరీస్ కథ విషయానికి వస్తే.. ఓ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన కథను ఓ పెద్ద ట్విస్ట్ తో చెప్పే కథే అహ నా పెళ్లంట. ఈ సిరీస్ కథ మొత్తం హీరో శీను (రాజ్ తరుణ్) చుట్టూ తిరుగుతుంది. స్కూల్లో జరిగిన సంఘటనతో జీవితంలో ఏ అమ్మాయిని చూడనని హీరో తండ్రికి మాటిస్తాడు. కానీ, అనుకోకుండా.. మహా(శివానీ రాజశేఖర్) శీను జీవితంలోకి వస్తుంది. ఆ తర్వాత ఊహంచని ట్విస్ట్ లతో కథ మలుపు తిరుగుతుంది. అసలు శీను స్కూల్లో జరిగిన సంఘటన ఏంటి? మహా, శీను జీవితాన్ని మారుస్తుందా? వీటికి సమాధానాలు తెలియాలంటే.. జీ తెలుగులో ప్రసారం కానున్న అహ నా పెళ్లంట సిరీస్ చూడాల్సిందే.
ఇక ఆహ నా పెళ్లంట సిరీస్ లో హీరో రాజ్ తరుణ్ కు తల్లిగా సీనియర్ నటి అమని నటించగా.. తండ్రి పాత్రలో నటుడు హర్షవర్ధన్ నటించారు. అలాగే పోసాని కృష్ణ మురళి, మహ్మద్ అలీ బేగ్, వడ్లమాని శ్రీనివాస్, రఘు కారుమంచి, మధు నందన్, దీపాలి శర్మ, తాగుబోతు రమేశ్, గెటప్ శీను, భద్రం తదితరులు నటి నటులు ఈ సిరీస్ లో అలరించారు. మరి, త్వరలో జీ తెలుగు ఛానెల్ లో ప్రసారం కానున్న ఆహ నా పెళ్లంట సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
75 Million Viewing Minutes! Ee pelli hangama roju roju ki marintha pedhhaga ayipotundiii!🥳
Goo watch #AhaNaPellantaOnZee5 for this record breaking comedy!@itsRajTarun @Rshivani_1 @tamadamedia @sanjeevflicks @rahultamada @saideepreddy @basava_sri @SheikDawoodG1 @Zee5Tamil pic.twitter.com/YJUUWATTh3
— Sreedhar Sri (@SreedharSri4u) December 2, 2022