Niharika Konidela: విడాకులు తర్వాత నిహారిక మొదటి పోస్ట్‌.. తన కోసమే!

విడాకులు తర్వాత నిహారిక మొదటి పోస్ట్‌.. తన కోసమే!

  • Author Dharani Published - 12:41 PM, Wed - 5 July 23
  • Author Dharani Published - 12:41 PM, Wed - 5 July 23
విడాకులు తర్వాత నిహారిక మొదటి పోస్ట్‌.. తన కోసమే!

గత కొంత కాలంగా మెగా డాటర్‌ నిహారిక విడాకులు తీసుకోబోతుంది అంటూ జోరుగా ప్రచారం సాగింది. కానీ దీనిపై ఎవరు నోరు మెదపలేదు. ఇలా పుకార్లు షికార్లు చేస్తుండగానే.. మంగళవారం అందరికి షాక్‌ ఇచ్చింది నిహారిక. తాను విడాకులు తీసుకున్నట్లు ప్రకటించింది. మరి వీరు విడిపోవడానికి కారణాలు ఏంటి అనేది తెలియదు. అయితే మనస్పర్థల కారణంగానే నిహారిక-చైతన్య విడిపోయారంటూ నెట్టింట ప్రచారం సాగుతోంది. విడాకులకు గల కారణాల గురించి ఎలాంటి సమాచారం లేదు. పెళ్లైన రెండున్నరేళ్లకే నిహారిక విడాకులు తీసుకోవడం సంచలనంగా మారింది. అయితే నిహారిక-చైతన్య ఎప్పటి నుంచో విడిగా ఉంటున్నారని.. ఎవరి కెరీర్‌లో వాళ్లు బిజీగా ఉన్నారని సన్నిహితుల సమాచారం. దీనికి తగ్గట్టుగానే నిహారిక పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ని సొంతంగా ప్రారంభించి.. హైదరాబాద్‌లో ఆఫీస్‌ ఒపెన్‌ చేసి.. సినిమా కార్యక్రమాల్లో బిజీగా ఉంది.

పెళ్లికి ముందు వరకు సినిమాలు, షార్ట్‌ ఫిల్మ్స్‌లో నటించిన నిహారిక.. వివాహం తర్వాత నిర్మాతగా మారింది. ప్రస్తుతం సొంత బ్యానర్‌లో ప్రాజెక్ట్స్‌ చేసే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. చైతన్యకు దూరంగా ఉన్న నిహారిక.. సొంత బ్యానర్‌లో సినిమా కార్యక్రమాలతో చాలా బిజీగా ఉంది. ప్రస్తుతం నిహారిక తన ఫోకస్‌ మొత్తం కెరీర్‌ మీదనే పెట్టింది. మెగా డాటర్‌ విడాకుల వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ క్రమంలో డైవర్స్‌ తర్వాత నిహారిక చేసిన ఫస్ట్‌ పోస్ట్‌ నెట్టింట వైరల​్‌గా మారింది. ఇంతకు నిహారిక ఎవరి గురించి పోస్ట్‌ చేసింది.. ఏమన్నది అంటే..

నిహారిక చేసిన ఫస్ట్‌ పోస్ట్‌లో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఏమైనా షేర్‌ చేస్తుందేమో అని నెటిజనులు భావించారు. కానీ నిహారిక మాత్రం.. వాటిని పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. విడాకులకు సంబంధించిన వార్తలు వచ్చిన కాపేసపటికే.. నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది. అది కూడా బర్త్‌డే విషెస్‌ కావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. నిహారిక సినిమాలకు సంబంధించి అమెరికా నుంచి ప్రమోషన్స్‌ నిర్వహించే సోషల్‌ మీడియా ఇన్‌ప్లుయెన్సర్‌కు నిహారిక బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపింది. ఈ పోస్ట్‌ చూసిన నెటిజనులు.. మెగా డాటర్‌ విడాలకు బాధ నుంచి త్వరగానే మూవ్‌ ఆన్‌ అయినట్లుంది అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. నిహారిక-చైతన్యలకు 2020, డిసెంబర్‌ 9న రాజస్తాన్‌ వేదికగా రాయల్‌ వెడ్డింగ్‌ జరిగిన సంగతి తెలిసిందే.

Show comments