Venkateswarlu
ఉదయభాను ప్రస్తుతం ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. అందులో ఎక్కువగా వంటల వీడియోలు పోస్టు చేస్తున్నారు. తాజాగా, ఆమె గోంగూర పప్పు చేసే విధానం గురించి చెప్పారు.
ఉదయభాను ప్రస్తుతం ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. అందులో ఎక్కువగా వంటల వీడియోలు పోస్టు చేస్తున్నారు. తాజాగా, ఆమె గోంగూర పప్పు చేసే విధానం గురించి చెప్పారు.
Venkateswarlu
ఒకప్పుడు బుల్లి తెరపై ఓ వెలుగు వెలిగారు ఉదయభాను. కేవలం యాంకర్‌గానే కాదు.. నటిగా కూడా తన సత్తా చాటారు. పలు సినిమాల్లో హీరోయిన్‌గా కూడా చేశారు. ఏమైందో ఏమో తెలీదు కానీ, కొంతకాలం పాటు సినిమాలు, బుల్లి తెరకు దూరం అయ్యారు. ఒకప్పుడు యాంకరింగ్‌లో టాప్‌లో ఉండటమే కాకుండా.. ప్రతీ ఛానల్‌లో షో చేసే ఆమె.. తర్వాతి కాలంలో అవకాశాలు లేక ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు యూట్యూబ్‌లో ‘ఉదయ్ బాను’ పేరిట ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు.
వంటలు ఇతర విషయాలపై వీడియోలు చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఆమె గోంగూర పప్పు చేసే విధానంపై ఓ వీడియో అప్‌లోడ్ చేశారు. ‘ మా పిల్లల కోసం నేను చేసే కమ్మటి గోంగూర పప్పు’ పేరిట ఆ వీడియోను యూట్యూబ్‌లో ఉంచారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏకంగా 1.7 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆ వీడియోలో ఆమె ఆకు కూరలు కడిగే విధానం గురించి వివరించారు. కిడ్నీలో రాళ్ల గురించి కూడా మాట్లాడారు.
ఆకు కూరలను రెండు మూడుసార్ల కడగాలని లేకపోతే కిడ్నీల్లో రాళ్లు వస్తాయని చాలా మంది అంటుంటారని చెప్పారు. ‘‘ పాలకూర భూమికి చాలా దగ్గరగా పెరుగుతుంది. దీంతో ఇసుక ఎక్కువగా ఆకులకు పడుతుంది. మనం నీళ్లతో శుభ్రంగా కడగకపోతే పాలకూరకు ఉన్న ఇసుక మన కడుపులోకి వెళ్లిపోయి కిడ్నీలో రాళ్లు వస్తాయి’ అని ఉదయభాను చెప్పారు. అయితే, ఆకు కూరల్లో ఇసుకకు.. కిడ్నీల్లో రాళ్లు పడటానికి అస్సలు సంబంధం లేదు. కిడ్నీలో రాళ్లు పెరగటానికి వేరే కారణం ఉంది.
కిడ్నీలో రాళ్లు రావటానికి కాల్షియం, ఆగ్జలేట్ల కలయిక కారణం అవుతుంది. పాలకూరలో ఆగ్జలైల్ ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల పాలకూరలో 736 మిల్లీ గ్రాముల ఆగ్జలేట్స్ ఉంటాయి. అయితే, పాలకూరను నేరుగా.. అది కూడా ఉడికించకుండా తీసుకుంటేనే ఆగ్జలైట్స్ ప్రభావం చూపిస్తాయి. అలా కాకుండా పాలకూరను ఉడికిస్తే ఆగ్జలైట్స్ ప్రభావం లేకుండా పోతాయి. అప్పుడు ఎలాంటి ప్రమాదం కూడా ఉండదు. ఇక, టమాటా, పాలకూర కలిపి తీసుకోకూడదని అంటారు.
టమాటాలో కూడా ఆగ్జలైట్స్ ఉంటాయి. అయితే, వేడి చేయటం వల్ల అవి కూడా ప్రభావం లేకుండా పోతాయి. కాబట్టి.. పాలకూర, టమాటా కలిపి తీసుకోవటం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. రెండిటిని కలిపి తీసుకోవటం వల్ల కిడ్నీలో రాళ్లు వస్తాయన్నది కేవలం అపోహ మాత్రమే. ఈ విషయాలు తెలిసిన నెటిజన్లు.. ఉదయభాను కామెంట్లపై మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్స్ చేస్తున్నారు. మరి, ఉదయ భాను పాలకూరపై నిరాధార కామెంట్లు చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురి కావటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.