Swetha
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మాట నిజమే. కానీ ఈరోజు తనకంటూ ఓ ప్రత్యేకమైన బ్రాండ్ ను సెట్ చేసుకున్నాడు రామ్ చరణ్. ఈ క్రమంలో ఇప్పుడు ప్రముఖ OTT సంస్థ ఓ డాక్యుమెంటరీ ప్లాన్ చేస్తుందట. ఆ వివరాలేంటో చూసేద్దాం.
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మాట నిజమే. కానీ ఈరోజు తనకంటూ ఓ ప్రత్యేకమైన బ్రాండ్ ను సెట్ చేసుకున్నాడు రామ్ చరణ్. ఈ క్రమంలో ఇప్పుడు ప్రముఖ OTT సంస్థ ఓ డాక్యుమెంటరీ ప్లాన్ చేస్తుందట. ఆ వివరాలేంటో చూసేద్దాం.
Swetha
ఈ మధ్య కాలంలో స్టార్ సెలెబ్రిటీల మీద డాక్యుమెంటరీస్ తెగ తీసేస్తున్నారు. మొన్నీమధ్యన రాజమౌళి మీద డాక్యుమెంటరీ వచ్చిన సంగతి తెలిసిందే. నెట్ ఫ్లిక్స్ లో దీని రిలీజ్ చేశారు. ఈ డాక్యుమెంటరీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక ఇప్పుడు మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ మీద కూడా డాక్యుమెంటరీ ప్లాన్ చేస్తుందట ఈ OTT నెట్ వర్క్. మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా ఈరోజు రామ్ చరణ్ కు పాన్ ఇండియా రేంజ్ లో ఓ స్పెషల్ స్టార్ డమ్ ఉంది. గ్లోబల్ స్టార్ అనే బిరుదును సంపాదించుకున్నాడు. సో దీనికి సంబంధించిన అన్ని వివరాలను ఇలా డాక్యుమెంటరీ రూపంలో పొందుపరిచి… ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది నెట్ ఫ్లిక్స్.
ఇప్పటికే ఈ డాక్యుమెంటరీలో కొన్ని ఎక్స్క్లూజివ్ సీన్స్ ను షూట్ చేసిందట నెట్ ఫ్లిక్స్. గేమ్ చెంజర్ రిలీజ్ సమయంలో చరణ్ అభిమానులు తన ఇంటికి వెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా బాగానే వైరల్ అయింది. ఇప్పుడు అదే ఫుటేజ్ ను ఈ డాక్యుమెంటరీలో వాడబోతుందట ఈ టీం. అయితే ఈ డాక్యుమెంటరీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఎలా ఉండబోతుంది? ఎన్ని భాషలలో రిలీజ్ చేస్తారు ? అనే విషయాలపై అయితే ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదు. సో ఇది ఎలా ఉండబోతుందా అని అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే గతంలో రాజమౌళి డాక్యుమెంటరీ విషయంలో డబ్బింగ్ దగ్గర ప్రేక్షకులు కాస్త అసంతృప్తి వ్యక్తం చేసిన మాట నిజమే. సో ఈసారి చరణ్ డాక్యుమెంటరీ విషయంలో ఇలాంటివి లేకుండా ఉంటే బావుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.