AAY Movie Day 2 Collection: జోరు మీదున్న NTR బావమరిది.. ఆయ్‌ మూవీకి 2 రోజుల్లోనే ఊహకందని వసూళ్లు

AAY Movie: జోరు మీదున్న NTR బావమరిది.. ఆయ్‌ మూవీకి 2 రోజుల్లోనే ఊహకందని వసూళ్లు

AAY Movie Collections: ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఆయ్‌.. కలెక్షన్ల విషయంలో మాత్రం పెద్ద సినిమాలకు గట్టి పోటీ ఇస్తుంది. రెండో రోజు ఆయ్‌ కలెక్షన్లు భారీగా పెరిగాయి. ఆ వివరాలు..

AAY Movie Collections: ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఆయ్‌.. కలెక్షన్ల విషయంలో మాత్రం పెద్ద సినిమాలకు గట్టి పోటీ ఇస్తుంది. రెండో రోజు ఆయ్‌ కలెక్షన్లు భారీగా పెరిగాయి. ఆ వివరాలు..

సినిమా ఇండస్ట్రీలో వారసత్వం అనేది కామన్‌. ఒక్కరు ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్‌ అయితే.. మిగతా కుటుంబ సభ్యులు కూడా అదే బాటలోనడుస్తారు. అయితే వారసత్వం అనేది ఎంట్రీ ఇచ్చే వరకు మాత్రమే పనికి వస్తుంది. టాలెంట్‌ లేకపోతే అస్సలు పట్టించుకోరు. అందుకే వారసులుగా ఎంట్రీ ఇచ్చిన వారు సైతం పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి బాగా కష్టపడుతుంటారు. ఇక కొందరు వారసత్వంగా ఇండస్ట్రీలోకి వచ్చినా.. ఆ తర్వాత తమ కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి శ్రమిస్తుంటారు. అలాంటి వారినే విజయం వరిస్తుంది.. ప్రేక్షకులు కూడా ఆదరిస్తారు. ఇదుగో ఈ జాబితాలో నిలుస్తారు హీరో నార్నే నితిన్‌.

జూనియర్‌ ఎన్టీఆర్‌ బావమరిదిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు నార్నే నితిన్‌. మ్యాడ్‌ సినిమాతో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రభావం తన మీద లేకుండా చూసుకోవడం కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే తనకు సూటయ్యే కథలను ఎంచుకుని.. కెరీర్‌లో ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలోనే రెండో సినిమాగా ఆయ్‌ని ఎంచుకున్నాడు. ఈ మూవీ మీద మేకర్స్‌కు ఎంత నమ్మకం అంటే.. పంద్రాగస్టు బరిలో మిస్టర్‌ బచ్చన్‌, డబుల్‌ ఇస్మార్ట్‌ వంటి స్టార్‌ హీరోల సినిమాలు రిలీజ్‌కు ఉన్నా ఏమాత్రం భయపడకుండా.. కథ మీద నమ్మకంతో అదే తేదీన అనగా ఆగస్టు 15ననే ప్రేక్షకులు ముందుకు వచ్చింది ఆయ్‌ సినిమా.

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఆయ్‌ సినిమా తొలిరోజు మొదటి షో నుంచే పాజిటీవ్‌ టాక్‌ తెచ్చుకోవడమే కాక.. ఫస్ట్‌ డే నుంచే మంచి కలెక్షన్లు సాధిస్తో‍ంది. దీనిలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 55 లక్షలు షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా ఇంకో పది లక్షలు కలుపుకుని రూ. 65 లక్షలు షేర్‌ను, 1.20 కోట్లు గ్రాస్ రాబట్టింది.

ఇక రెండో రోజు మిస్టర్‌ బచ్చన్‌, డబుల్‌ ఇస్మార్ట్‌ సినిమాల కలెక్షన్లు తగ్గగా.. ఆయ్‌ మాత్రం దూసుకుపోతుంది. ఫస్ట్‌ డే కు మించి రెండో రోజు వసూళ్లు సాధించి.. స్టార్‌ హీరోల సినిమాలను వెనక్కి నెట్టింది. ఇక ఆయ్‌ సినిమా 2వ రోజు ఇలా..  ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 65 లక్షలు షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా రూ. 75 లక్షలు రాబట్టింది. ఇలా రెండు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 1.40 కోట్లు షేర్‌ రాబట్టి సత్తా చాటుకుంది.

కంచిపల్లి అంజిబాబు తెరకెక్కించిన ఆయ్‌ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్య కప్పినీది నిర్మించారు. ఇందులో నయన్ సారిక హీరోయిన్‌గా నటించగా.. అంకిత్ కొయ్య, కృష్ణ చైతన్య, శ్రీవాణి తదితరులు కీలక పాత్రలను చేశారు. ఈ మూవీకి రామ్ మిరియాల సంగీతాన్ని అందించాడు.

Show comments