Bhavatharini: ఇండస్ట్రీలో విషాదం.. ఇళయరాజా కుమార్తె కన్నుమూత

Ilayaraja Daughter Singer Bhavatharini Died: చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దిగ్గజ సంగీత దర్శకులు, మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా కుమర్తె భవతరణి మరణించారు.

Ilayaraja Daughter Singer Bhavatharini Died: చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దిగ్గజ సంగీత దర్శకులు, మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా కుమర్తె భవతరణి మరణించారు.

చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దిగ్గజ సంగీత దర్శకులు, మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా కుమర్తె భవతరణి మరణించారు. లివర్ క్యాన్సర్ తో ఆమె గత కొంత కాలంగా బాధపడుతోంది. దీంతో చికిత్స తీసుకునేందుకు ఆమె శ్రీలంక వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలోనే గురువారం(జనవరి 25)న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలిసి సినీ పరిశ్రమ మెుత్తం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. తన గొంతు నుంచి ఎంతో మధురమైన పాటలను అందించింది భవతరణి. తన తండ్రి సంగీత దర్శకత్వం వహించిన చాలా సినిమాల్లో అద్భుతమైన పాటలు పాడింది.

భారతీయ దిగ్గజ సంగీత దర్శకులు, మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇళయరాజా కుమార్తె భవతరణి(47) మరణించారు. గత కొంతకాలంగా లివర్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె, చికిత్స నిమిత్తం శ్రీలంకకు వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలోనే గురువారం(జనవరి 25న) తుది శ్వాస విడిచారు భవతరణి. తన సినీ కెరీర్ లో ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాటలు పాడారు.

తన తండ్రి ఇళయరాజా సంగీత దర్శకత్వంతో పాటుగా తన సోదరులు కార్తీక్ రాజా, యువన్ శంకర్ రాజా సంగీత దర్శకత్వంలో కూడా పలు పాటలు పాడారు భవతరణి. తెలుగులో గుండెల్లో గోదారి సినిమాలో ఓ సాంగ్ పాడారు. ఇక 2000 సంవత్సరంలో వచ్చిన భారతి సినిమాలో ‘మైల పోల పొన్ను ఒన్ను’ పాటకు గాను ప్లే బ్యాక్ సింగర్ గా నేషనల్ అవార్డును అందుకున్నారు. సింగర్ గానే కాకుండా.. ఎన్నో సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా ఆమె పనిచేశారు. భవతరణి పార్థీవ దేహాన్ని చెన్నైకి తీసుకొచ్చి.. అక్కడే రేపు(జనవరి 26)న అంత్యక్రియలు జరపనున్నట్లు సమాచారం. భవతరణి మరణవార్త విని చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా దిగ్బ్రాంతికి లోనైంది. ఇళయరాజా కుటుంబానికి తమ ప్రగాఢసానుభూతి తెలుపుతున్నారు సినీ, రాజకీయ ప్రముఖులు.

Show comments