చిన్నారి ప్రాణాలు కాపాడి.. గొప్ప మనసు చాటుకున్న యంగ్ హీరో!

  • Author Soma Sekhar Published - 11:08 AM, Sun - 26 November 23

ఓ యంగ్ హీరో కమ్ మ్యూజిక్ డైరెక్టర్ చిన్నారి ప్రాణాలను కాపాడటం కోసం తనవంతు సాయం అందించాడు. దీంతో అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.

ఓ యంగ్ హీరో కమ్ మ్యూజిక్ డైరెక్టర్ చిన్నారి ప్రాణాలను కాపాడటం కోసం తనవంతు సాయం అందించాడు. దీంతో అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.

  • Author Soma Sekhar Published - 11:08 AM, Sun - 26 November 23

ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది ప్రముఖులు తమ వంతు ప్రజలకు సాయం చేస్తూ ఉంటారు. వారి కష్ట నష్టాల్లో పాలుపంచుకుంటూ తామున్నామంటూ.. భరోసా ఇస్తూ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు మెగాస్టార్ చిరంజీవి లాంటి ఎందరో హీరోలు ట్రస్ట్ లను స్థాపించి.. ఎంతో మందికి ప్రాణదానాలు చేస్తున్న విషయం మనందరికి తెలిసిందే. ఇక అప్పుడప్పుడు తమ దృష్టిలోకి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తూ.. గొప్ప మనసు చాటుకుంటూ ఉంటారు కొందరు నటీ, నటులు. తాజాగా ఓ యంగ్ హీరో కమ్ మ్యూజిక్ డైరెక్టర్ చిన్నారి ప్రాణాలను కాపాడటం కోసం తనవంతు సాయం అందించాడు. దీంతో అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.

సినిమాలతో పాటుగా ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు తనదైన శైలిలో అభిప్రాయాలను వెల్లడిస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేస్తూ ఉంటారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్. కేవలం సంగీత దర్శకుడిగానే కాకుండా.. సింగర్ గా, హీరోగా, నిర్మాతగా కోలీవుడ్ లో దూసుకెళ్తున్నాడు ఈ యంగ్ సెన్సేషన్. ఏఆర్ రెహమాన్ మేనల్లుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ యువ కెరటం.. 25 ఏళ్లకే 25 సినిమాలకు మ్యూజిక్ అందించి రికార్డు నెలకొల్పాడు. కాగా.. ప్రజా సమస్యలపై స్పందిస్తుంటాడు జీవీ ప్రకాశ్. సాయం కోరి వచ్చిన వారికి చేతనైనంత హెల్ప్ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ఒక వ్యక్తి తన సోదరి బిడ్డను ఎవరైనా కాపాడాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బ్రెయిన్ ట్యూమర్ కారణంగా సంవత్సరం వయసున్న బిడ్డ ఆపరేషన్ కోసం ఇబ్బంది పడుతోందని సాయం చేయాలని కోరాడు.

ఈ పోస్ట్ కాస్త వైరల్ కావడంతో.. స్పందించాడు నటుడు జీవీ ప్రకాశ్ కుమార్. చిన్నారి ఆపరేషన్ కోసం తనవంతుగా రూ. 75 వేలను అందించాడు. నా నుంచి ఇది చిరు సాయం అంటూ రాసుకొచ్చాడు ఈ యువ హీరో. దీంతో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇది చూసిన మరికొందరు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. కాగా.. ఆ చిన్నారికి మెదడు వైపు కణితి ఉందని వైద్యులు తెలిపారు. దీంతో బాలుడిని మధురైలోని అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆపరేషన్ అవసరం అని డాక్టర్లు చెప్పారు. ఇక ఆపరేషన్ కు రూ.3.5 లక్షల నుంచి 4 లక్షలు వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. మా కుటుంబం 2 లక్షల వరకు సిద్దం చేసిందని మిగతా డబ్బులు కోసం నేను సాయం కోరుతున్నాను అని కుటుంబ సభ్యులు తెలిపారు. దీనికి స్పందించిన జీవీ ప్రకాశ్ తన వంతు చిరుసాయం చేశాడు. ప్రస్తుతం ధనుష్ నటించిన ‘కెప్టెన్ మిల్లర్’, విక్రమ్ ‘తంగలాన్’  సినిమాలకు మ్యూజిక్ అందించాడు. మరి చిన్నారి ప్రాణాల కోసం హెల్ప్ చేసిన జీవీ ప్రకాశ్ మంచి మనసుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments