Nidhan
Harish Shankar: డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మాస్ మహారాజా రవితేజతో ఆయన తెరకెక్కించిన ‘మిస్టర్ బచ్చన్’ విడుదలకు సిద్ధమవుతోంది.
Harish Shankar: డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మాస్ మహారాజా రవితేజతో ఆయన తెరకెక్కించిన ‘మిస్టర్ బచ్చన్’ విడుదలకు సిద్ధమవుతోంది.
Nidhan
తాను నమ్మిన కథను మంచి కమర్షియల్ విలువలు జోడించి అందరికీ నచ్చేలా చెప్పడంలో టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ సిద్ధహస్తుడనే చెప్పాలి. ఆయన సినిమాల్లో వినోదం పుష్కలంగా ఉంటుంది. అలాగని మొత్తం కామెడీతోనే సినిమాను చుట్టేయరు. స్టోరీని నడిపిస్తూ అవసరాన్ని బట్టి కామెడీ టచ్ ఇస్తూ పోతారు. అలాగే హీరోహీరోయిన్ల మధ్య రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్‌ను కూడా బాగా పండేలా చూసుకుంటారు. విభిన్నమైన కథల్ని ఎంచుకుంటూ ఆడియెన్స్‌ను అలరించే హరీష్ శంకర్ ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఒకవైపు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పనుల్ని చూసుకుంటూనే మరోవైపు మాస్ మహారాజా రవితేజతో ‘మిస్టర్ బచ్చన్’ను తెరకెక్కిస్తున్నారు.
పవన్ సినిమాను పక్కనబెడితే.. ‘మిస్టర్ బచ్చర్’ను రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు హరీష్ శంకర్. రవితేజ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ మూవీలో భాగ్యశ్రీ వర్మ ఫీమేల్ లీడ్ రోల్లో యాక్ట్ చేస్తున్నారు. సీనియర్ నటుడు జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా దాదాపుగా లాక్ అయిపోయింది. ఆగస్టు 15, 2024న ‘మిస్టర్ బచ్చన్’ విడుదలవడం ఖాయంగా కనిపిస్తోంది. రిలీజ్‌కు టైమ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌ను పరుగులు పెట్టించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో ఈ మూవీ బిజినెస్ విషయం చర్చనీయాంశంగా మారింది. రవితేజ-హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ఈ ఫిల్మ్‌కు ఏకంగా రూ.35 నుంచి రూ.45 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని టాక్ నడుస్తోంది.
‘మిస్టర్ బచ్చన్’ సినిమా రీమేక్ అనే సంగతి తెలిసిందే. అయితే పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న ఈ టైమ్‌లో ‘మిస్టర్ బచ్చన్’ అంటూ రీమేక్‌కు ప్లాన్ చేయడం సాహసమనే చెప్పాలి. ఆరేళ్ల కింద వచ్చిన బాలీవుడ్ హిట్ బొమ్మ ‘రెయిడ్’ రైట్స్ తీసుకొని రవితేజతో సినిమాకు ప్లాన్ చేశారు హరీష్ శంకర్. నలభై ఏళ్ల కింద జరిగే కథ, పెద్దగా గూస్బంప్స్ సీన్స్ లేని స్క్రీన్‌ప్లేతో బిగ్ రిస్క్ చేశారు. అయితే రవితేజ-జగపతి బాబు మధ్య క్లాష్ సీన్స్, కమర్షియల్ సాంగ్స్, భాగ్యశ్రీ రొమాన్స్‌ను గట్టిగా ప్యాక్ చేసి ఆడియెన్స్ మీదకు టీజర్స్, సాంగ్స్ రూపంలో వదిలారు. మంచి మాస్ కంటెంట్ ఉండటంతో 35 నుంచి 40 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. హీరో-డైరెక్టర్ కలయికలో గతంలో ‘మిరపకాయ’ లాంటి సూపర్ హిట్ పడటం, హరీష్ కంటెంట్‌లో చేసిన మార్పులు వర్కౌట్ అవడం, సినిమాలో ఆయన మ్యాజికల్ టచ్ కనిపిస్తుండటంతో ఈ రీమేక్‌కు ఊహించని రేంజ్లో బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.