త్రిష, చిరంజీవిపై పరువు నష్టం కేసు వేస్తా.. మన్సూర్ అలీఖాన్ సంచలన నిర్ణయం!

  • Author Soma Sekhar Published - 05:10 PM, Sun - 26 November 23

త్రిష, మెగాస్టార్ చిరంజీవి, ఖుష్బుపై పరువు నష్టం కేసు వేస్తా అంటూ సంచలన ప్రకటన చేశాడు ప్రముఖ నటుడు మన్సూర్ అలీఖాన్. త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆమెకు అండగా నిలబడి, అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు చిరంజీవి, ఖుష్బు.

త్రిష, మెగాస్టార్ చిరంజీవి, ఖుష్బుపై పరువు నష్టం కేసు వేస్తా అంటూ సంచలన ప్రకటన చేశాడు ప్రముఖ నటుడు మన్సూర్ అలీఖాన్. త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆమెకు అండగా నిలబడి, అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు చిరంజీవి, ఖుష్బు.

  • Author Soma Sekhar Published - 05:10 PM, Sun - 26 November 23

సీనియర్ హీరోయిన్ త్రిషపై కోలీవుడ్ ప్రముఖ నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపాయో మనందరికి తెలిసిందే. అతడు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడింది త్రిష. ఇక ఆమెకు అండగా నిలబడుతూ.. మెగాస్టార్ చిరంజీవి, ఖుష్బు తో పాటుగా పలువురు సినీ ప్రముఖులు మన్సూర్ అలీఖాన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అతడు మాత్రం తానేమీ తప్పుగా మాట్లాడలేదు అంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తనపై విమర్శలు ఎక్కువ కావడంతో.. త్రిషకు క్షమాపణలు చెప్పాడు మన్సూర్. ఇంతటితో ఈ వివాదానికి తెరపడిందని అందరూ అనుకున్నారు. కానీ.. తాజాగా త్రిష, మెగాస్టార్ చిరంజీవి, ఖుష్బుపై పరువు నష్టం కేసు వేస్తా అంటూ సంచలన ప్రకటన చేశాడు.

కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీఖాన్ సీనియర్ హీరోయిన్ త్రిషపై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారాన్ని లేపాయి. ఈ కామెంట్స్ పై త్రిష ఘాటుగానే స్పందించింది. ఇక ఈ ఘటనపై తమిళనాడు డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ ఫిర్యాదు కూడా చేసింది. సదరు నటుడిని అరెస్ట్ చేయాలంటూ తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో చెన్నై పోలీసులు రెండు సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేశారు. విచారణకు రావాలని సమన్లు జారీ చేశారు. అనంతరం నవంబర్ 23న అతడు పోలీస్ స్టేషన్ కు హాజరైయ్యాడు. ఇక అతడి వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి, నటి ఖుష్భుతో పాటుగా పలువురు సినిమా ప్రముఖులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో దిగొచ్చిన మన్సూర్ అలీ త్రిషకు క్షమాపణలు చెప్పాడు. ఇంతటితో ఈ వివాదానికి తెరపడిందని అందరూ అనుకున్నారు. కానీ.. మరో సంచలన ప్రకటన చేసి మరోసారి వార్తల్లో నిలిచాడు.

తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన త్రిష, చిరంజీవి, ఖుష్బులపై పరువు నష్టం దావా, క్రిమినల్ కేసు, ముందస్తు అల్లర్లు, ఇతరులను రెచ్చగొట్టడం లాంటి సెక్షన్ల కింద కేసు వేస్తున్నట్లు ప్రకటించాడు మన్సూర్ అలీఖాన్. తన లాయర్ గురు ధనంజయన్ ద్వారా కోర్టులో కేసు వేసి.. వారికి నోటీసులు జారీ చేయనున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. త్రిష విషయంలో తాను మాట్లాడిన వీడియోని ఎడిట్ చేసి.. ఆమెను అసభ్యకరంగా మాట్లాడినట్లు చిత్రీకరించాని అతడు చెప్పుకొచ్చాడు. నిజమైన వీడియోను వారికి పంపించానని ఇదే ఆధారంతో రేపు కోర్టులో వారిపై కేసు వేయబోతున్నట్లు అలీఖాన్ తెలిపాడు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments