Maanas Nagulapalli: తండ్రైన బిగ్ బాస్ ఫేమ్ మానస్ నాగులపల్లి.. ఇన్ స్టా పోస్ట్ వైరల్!

Maanas Nagulapalli Instagram Post Viral: బుల్లి తెర స్టార్ హీరోలలో.. మానస్ కూడా ఒకరు. బిగ్ బాస్ తర్వాత మానస్ క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. ఈ క్రమంలో గత ఏడాది నవంబర్ లో శ్రీజను పెళ్లి చేసుకున్న మానస్.. అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పేశాడు. అదేంటో చూసేద్దాం.

Maanas Nagulapalli Instagram Post Viral: బుల్లి తెర స్టార్ హీరోలలో.. మానస్ కూడా ఒకరు. బిగ్ బాస్ తర్వాత మానస్ క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. ఈ క్రమంలో గత ఏడాది నవంబర్ లో శ్రీజను పెళ్లి చేసుకున్న మానస్.. అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పేశాడు. అదేంటో చూసేద్దాం.

ప్రస్తుతం సినిమా హీరోలకు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో సీరియల్ లో హీరోలకు కూడా అదే రేంజ్ హావ నడుస్తుంది. ఈ క్రమంలో బుల్లి తెర స్టార్ హీరోలలో మానస్ కూడా ఒకరు. అప్పటివరకు సీరియల్స్ చేసినా కానీ.. బిగ్ బాస్ షో ద్వారా మానస్ క్రేజ్ ఇంకాస్త పెరిగిందని చెప్పి తీరాలి. ఇక ఆ తర్వాత ప్రస్తుతం బ్రాహాముడి సీరియల్ లో మానస్ నటిస్తున్నాడు. అది కాకుండా లేటెస్ట్ గా నీతోనే డాన్స్ 2.0 డ్యాన్స్ షో లో కూడా మానస్ తన టాలెంట్ ను కనబరిచాడు. ఈ క్రమంలో గత ఏడాది నవంబర్ లో.. మానస్ శ్రీజ నిశ్వంకరను ఘనంగా పెళ్లాడిన సంగతి తెలిసిందే. అలాగే కొద్దీ రోజుల క్రితం.. సోషల్ మీడియా శ్రీజ బేబీ బంప్ ఫొటోస్ కూడా వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు మానస్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పేసాడు.

మానస్ , శ్రీజ ల జంటను ఆల్రెడీ పలు గేమ్ షోస్ లో చూస్తూనే ఉన్నారు. ఆ జంట చూడముచ్చటగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ కూడా చేశారు. ఇక కొన్ని రోజుల క్రితం వీరిద్దరికి సంబంధించిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. మానస్ తండ్రి కాబోతున్నాడంటూ.. కొన్ని వార్తలు కూడా వినిపించాయి. మానస్ దానిని ఇప్పుడు కన్ఫర్మ్ చేశాడు. మానస్, శ్రీజ లకు బాబు పుట్టినట్లు.. మానస్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో..బేబీ బాయ్ అంటూ స్టోరీ పెట్టాడు. అలాగే కొద్దీ గంటల క్రితమే అతను తన భార్య బేబీ బంప్ ఫోటోలు కూడా షేర్ చేశాడు. దీనితో మానస్ అభిమానులు అతనికి విషెస్ తెలియజేస్తున్నారు. ఇక త్వరలో బేబీ కి సంబంధించిన ఫొటోస్ ఏమైనా రివీల్ చేస్తారేమో చూడాలి.

ఇక ఇదిలా ఉంటె.. ప్రస్తుతం మానస్ బ్రహ్మముడి సీరియల్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సీరియల్స్ కంటే ముందు.. ‘కోయిలమ్మ’, ‘మనసిచ్చిచూడు’ వంటి సీరియల్స్‌తో మంచి ఫేమ్ సంపాదించాడు. ఆ తర్వాత తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 లో ఎంట్రీ ఇచ్చి.. ప్రతి రోజు తనని తానూ ఇంప్రూవ్ చేసుకుంటూ.. గేమ్స్ లో తన సత్తా ఏంటో చూపించాడు. అలా బిగ్ బాస్ సీజన్ 5లో ఫైనలిస్ట్‌గా నిలిచి.. మానస్ మిస్టర్ పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత నీతోనే డాన్స్ 2.0 షో లో కూడా తన సత్తా చాటి ఫైనలిస్ట్‌గా నిలిచాడు. సో ప్రస్తుతానికైతే మానస్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతున్నాడు. మరి రానున్న రోజుల్లో ఎలాంటి ప్రాజెక్ట్స్ తీసుకుంటాడో చూడాలి. మరి మానస్ షేర్ చేసిన పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments